టీఆర్ఎస్ మజ్లిస్ దోస్తీ… ముస్లిం వోట్ల కోసం కేసీయార్ ఎత్తులు… క్రమేపీ హిందూ వోట్లు సంఘటితం కావడానికి ఉపయోగపడుతున్నయ్… పైగా బీజేపీ మీద కోపంతో కేసీయార్ స్థూలంగా హిందువులనే కించపరిచేట్టుగా చేసిన వ్యాఖ్యలు కూడా తనకు నష్టం చేకూర్చాయి… ఇది గమనించే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ తమకు పొత్తుల్లేవనీ, దోస్తీ లేదని ఎంతగా చెప్పుకున్నా సరే, ఎక్కడికక్కడ బీజేపీ ఆ రెండు పార్టీలను ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించింది… ఆ ఫాయిదా కూడా దక్కించుకుంది కొంతమేరకు..! మజ్లిస్‌తో దోస్తీ రాను రాను తనకు నష్టదాయకంగా మారుతుందని తెలిసీ… బీజేపీ దాన్ని ఇంకా ఇంకా వాడుకుంటుందని తెలిసీ… మళ్లీ మేయర్ ఎన్నికలో మజ్లిస్ సహకారం తీసుకున్నాడు కేసీయార్… వాళ్లకు డిప్యూటీ మేయర్ కూడా ఆఫర్ చేశాడు… (దాన్ని మించిన ఇంకేదో ప్రయోజనం కోసం మజ్లిస్ దాన్ని సున్నితంగా తిరస్కరించి ఉంటుంది)
ఇలాంటి పరిస్థితి రావచ్చుననే భావనతోనే… జీహెచ్ఎంసీ వోటర్లుగా చాలామంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఎన్రోల్ చేయించారు అప్పట్లోనే… ఒకవేళ తక్కువ కార్పొరేటర్ సీట్లు గెలిచినా సరే, ఈ ఎక్స్ అఫిషియో వోట్లతో గట్టెక్కాలనేదే ప్లాన్… (నిజానికి ఇది డెమక్రటిక్ స్పిరిట్ కాదనే వాదన కూడా ఉన్నదే) మరి ఈ ఎక్స్ అఫిషియో వోట్లతో సొంతంగానే గట్టెక్కే చాన్స్ ఉన్నా సరే… స్ట్రెయిట్ అవే మూడు పార్టీలు పోటీచేస్తే టీఆర్ఎసే బయటపడే చాన్స్ ఉన్నా సరే… మజ్లిస్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నట్టు..? ఎక్స్ అఫిషియో వోట్లను ఎందుకు వాడుకోలేదు..? ఇదీ చాలామందికి డౌట్… మజ్లిస్‌తో దోస్తీని మళ్లీ బీజేపీ బదనాం చేసే అవకాశం ఉందని తెలిసీ… మజ్లిస్‌తో దోస్తీ అంటే స్టీరింగ్ వాళ్లకు అప్పగించడమే అని తెలిసీ… కేసీయార్ ఎక్స్ అఫిషియో వోట్లను ఎందుకు పక్కన పెట్టి మరీ మజ్లిస్ సాయం తీసుకున్నాడు..?
Ads
‘‘అదే మరి కేసీయార్ అంటే..? ఈ ఎన్నికలో ఆ ఎక్స్ అఫిషియో వోట్లను వాడేసుకోకుండా… జీహెచ్ఎంసీకే వాళ్లను పరిమితం చేయకుండా… రాబోయే ఖమ్మం, వరంగల్‌కు వాడుకోవడమే… ఇక్కడ కొన్ని సెలెక్టెడ్ వోట్లు కేన్సిల్ చేసి, అక్కడ ఎన్రోల్ చేయిస్తారు… సో, సేఫ్, రిస్క్ లెస్… మజ్లిస్‌తో దోస్తీ మీద బీజేపీ ఏం రచ్చ చేస్తేనేం..? హైదరాబాదులో ఇప్పుడేమీ ఎన్నికలు లేవుగా…’’ ఇదీ ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడి అభిప్రాయం… ఒక్క ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక జరగాల్సి ఉంది… హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటుపై టీఆర్ఎస్కు పెద్దగా ఆశలేమీ లేనట్టున్నయ్… మజ్లిస్‌కు చాన్స్ ఇచ్చి, రుణం తీర్చుకుందామని చూసినా సరే, వాళ్లకూ పెద్ద ఇంట్రస్టు ఉన్నట్టు లేదు… అయితే కేసీయార్-ఒవైసీ దోస్తీని బీజేపీ ఈ ఎన్నికలోనూ బాగా వాడుకునే చాన్స్ ఉంది… ఏతావాతా తేలుతున్నదేమిటయ్యా అంటే..? ఇంతకుముందులాగా ‘‘మజ్లిస్ మా మిత్రపక్షమే, సో వాట్, తప్పేముంది..?’’ అని ఢంకా బజాయించి చెప్పే సీన్ కేసీయార్‌కు కనిపించడం లేదిప్పుడు… అందుకని సందర్భాన్ని బట్టి పావులు కదుపుతున్నాడు… అదీ సంగతి… బెంగాల్ ఎన్నికల తరువాత తెలంగాణ మీదే మా కాన్సంట్రేషన్ అంటున్నాడు అమిత్ షా… అంటే, కేసీయార్ మీద ముప్పేట దాడికి రెడీ అవుతున్నట్టేనా..?!
Share this Article