బహుశా ఒకటీరెండేళ్ల క్రితం… ఢిల్లీ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అంటే ఓ సంచలనం… అసలు ఆ యూనివర్శిటీయే పెద్ద యాంటీ నేషనల్ పోకడలకు కేంద్రం అనేది బీజేపీ ఆరోపణ… ఆ యూనివర్శిటీలోని పెడ పోకడల్ని చెప్పాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు గానీ… వాళ్లకు హీరో ఈ సారు… ఈ సారు బీహార్‌లో అప్పటికే పీజీ చేశాడు, కానీ పార్టీ అవసరాల కోసం జేఎన్‌యూలో చేరాడు… ఏదో పనికిమాలిన సబ్జెక్టు మీద పీహెచ్డీ… మన వర్శిటీల్లో పీహెచ్‌డీల తీరు తెలుసు కదా… పైసాకు కూడా కొరగావు… టాక్స్ పేయర్ల మనీని జాతి వ్యతిరేక ధోరణులకు ఖర్చు పెట్టడం… పరిశోధన లేదు, మన్నూ లేదు, ఆ పేరుతో వర్శిటీలో తిష్ట వేసి పార్టీ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోవడం, వర్శిటీని ఓ అడ్డాగా మార్చుకోవడం… అసలు దేశంలోని ప్రభుత్వరంగ వర్శిటీలన్నీ అంతే కదా… సరే, విషయానికొస్తే…
అప్పట్లో తను ఎక్కడికెళ్లినా బ్రహ్మరథం… మీడియా హైప్… (మన మీడియాకు అంతకుమించి పనేముంది..?) ఒక దశలో కన్హయ్య వస్తున్నాడంటే, తన రాక కోసం, తనకు స్వాగతం పలకడం కోసం సీపీఐ వింత కేరక్టర్ నారాయణ కూడా రోడ్డు పక్కన నిలబడి వెయిట్ చేసిన రోజులూ ఉన్నయ్… నారాయణను చూసి జాలిపడాల్సిన అవసరం లేదు… ఫాఫం, తన పార్టీ దురవస్థ, తన దుస్థితి అర్థం చేసుకోవాలి… పైగా తన విచిత్రమైన, హాస్యాస్పద కేరక్టరైజేషన్ సరేసరి… ఇక్కడ నారాయణ సబ్జెక్టు కాదు, కానీ సీపీఐ అనే పార్టీ ఎదుర్కుంటున్న దిక్కుమాలిన అవస్థ సబ్జెక్టు… సరే, ఇదే కన్హయ్య కుమార్ సంగతికొద్దాం… ‘‘వ్యక్తిత్వ నిర్మాణం’’ అనేది ఎప్పుడూ ఈ దేశ లెఫ్టు పార్టీలకు పట్టని సబ్జెక్టు కదా… ఈ దొరవారు అప్పుడెప్పుడో తన తోటి పార్టీ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించాడు అనేది ఆరోపణ…
Ads
చాలామందికి తెలియనిదీ, మన తెలుగు మీడియాకు పట్టని వార్త ఏమిటంటే…. మన హైదరాబాదులోనే కొన్నిరోజుల క్రితం ఇదే కన్హయ్యను అభిశంసిస్తూ పార్టీ తీర్మానించింది… ఒక లెఫ్ట్ పార్టీ ఒక నాయకుడిని జాతీయ కార్యవర్గ భేటీలో అభిశంసించిందీ అంటే… నీమొహం, నువ్వు అక్కరకురావు, పార్టీలో ఉంటే ఉండు, పోతేపో అని తేల్చి చెప్పడం అన్నమాట… నిజానికి ఆ లెవల్ నాయకుడిని అభిశంసించే పరిస్థితి వచ్చిందీ అంటేనే… సదరు పార్టీలో వ్యక్తిత్వ నిర్మాణం ఎంత దరిద్రమైన స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి… సరే, తాజా వార్త ఏమిటంటే..? ఈ గ్రేట్ నాయకుడు బీహార్‌లో జేడీయూలో చేరడానికి నానా ప్రయత్నాలూ చేస్తున్నాడు… మరి సీపీఐ పట్ల విధేయత, లెఫ్ట్ సిద్ధాంతాల మీద కమిట్మెంట్ ఏమైపోయాయి ఈ హీరోకు అంటారా..? భలేవారే… ఇప్పుడవన్నీ ఉత్త డొల్ల సిద్ధాంతాలు వాళ్లకు… పార్టీయే ఇష్టారాజ్యంగా పొత్తులు, టైమ్లీ బంధాలకు ఒడిగడుతుంటే… తనొక్కడూ ఎందుకు మడికట్టుకు కూర్చోవడం…? అందుకే జంపింగ్ జపాంగ్ అన్నమాట… ఈ దేశంలో లెఫ్ట్ బాగుపడాలంటే ముందుగా తమ నాయకుల్లో, కేడర్‌లో పార్టీ సిద్ధాంతాల మీద నిబద్ధత పెంచడం… కొత్తతరం ఎలాగూ రావడం లేదు… ఎహె, ఊరుకొండి, మరీ అత్యాశ అంటారా..? అంతేలెండి…!!
Share this Article