Subramanyam Dogiparthi…. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని సి నారాయణరెడ్డి వ్రాసి , ఘంటసాల పాడిన పాట గుర్తుకొస్తుంది తల్లా పెళ్ళామా సినిమా పేరు తలవగానే . తాను నమ్మింది ఏదయినా ధైర్యంగా అరవగల వాడు NTR . అది సమైక్యాంధ్ర అయినా , కుటుంబ నియంత్రణ విషయమైనా లేక భూ పరిమితి చట్టాలయినా , రావణుడిని దుర్యోధనుడిని హీరోలుగా చూపటమయినా , మరేదయినా . సినిమాలో ఈ పాట పెట్టడం వలన ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు రామకృష్ణ థియేటర్ అద్దాలు కూడా పగలకొట్టారని గుర్తు …
1970 లో వచ్చిన ఈ సినిమాలో గొప్ప నూతన సందేశం ఏమీ లేకపోయినా పాటల వలన , NTR వలన హిట్టయింది . NTR ఓ పాట మధ్యలో of course వంటి మాటలను పలకటం జనానికి నచ్చింది . Of course . ఆయన ఏం చేసినా నచ్చుతుంది అనుకొండి . నువ్వు నవ్వుతున్నావు ఖవాలీ మోడల్లో పాటని మహమ్మద్ రఫీ పాడారు . మమతలెరిగిన నా తండ్రి పాటను శాంతకుమారి ఆర్ద్రంగా , చాలా బాగా పాడారు .
తాగితే తప్పేముంది అఫ్ కోర్స్ తాగితే ఒకనాడు తప్పు మరి నేడో తాగకపోతే తప్పు పాట హుషారుగా ఉంటుంది . ఇక్కడ CM గా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి . అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్నారు ; చేసారు . Of course . ముప్పై సంవత్సరాల కింద పరిస్థితులు వేరనుకోండి .
ఓ బంగారు గూటిలోని చిలుకా పేద ముంగిట్లో వాలానని ఉలుకా పాటలో ఇంగ్లీషు మాటలు జనానికి గమ్మత్తుగా వినిపించాయి . బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది అనే పాట హరికృష్ణ మీద చిత్రీకరించబడింది . శ్రీకృష్ణావతారం సినిమా తర్వాత హరికృష్ణ బాలనటుడిగా ఈ చిత్రంలో ముఖ్య పాత్రే నటించారు .
ఆడపడుచు సినిమాలో చెల్లెలుగా నటించి మెప్పించిన చంద్రకళ ఈ సినిమాలో జోడీగా నటించి మెప్పించింది . శాంతకుమారి , రేలంగి , నాగభూషణం , దేవిక , నాగయ్య , ప్రభాకరరెడ్డి , సత్యనారాయణ ప్రభృతులు నటించారు . ఉమ్మడి కుటుంబం సినిమాలో సుబ్బయ్య పాత్ర వంటి పాత్రలో ముక్కామల కనిపిస్తారు . అప్పటివరకు హీరోయిన్లుగా నటించిన దేవిక , సావిత్రిలు వదినలు అయిపోయారు . దేవిక ఈ సినిమాలో వదినయింది .
మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు వీక్షించవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article