.
సుప్రీం కోర్టును కూడా తమిళనాడు విజయ్ ప్రభుత్వం ఒకరకంగా గేలిచేసింది… చాలా తెలివిగా డ్రామా ఆడింది… కార్తీకదీపం వివాదం తెలుసు కదా… ముందుగా వార్త చదవండి…
కార్తిక దీపం వివాదం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme Court)కు క్షమాపణలు చెప్పింది… తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగించారు…
Ads
ఇక్కడి కొండపై ఉన్న సిక్కందర్ దర్గా వద్ద పురాతన రాతి స్తంభంపై దీపాన్ని వెలిగించాలనే దానిపై వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది… అక్కడే దీపం వెలిగించాలని గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇవ్వగా అవి అమలు కాలేదు…
ఈ ఏడాది మాత్రమే రాతి స్తంభంపై కార్తికదీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది… ఆ ఉత్తర్వులనూ మంగళవారం పాటించలేదు… ఆలయ యంత్రాంగం అనుమతించకపోవడం వల్లే రాతి స్తంభంపై దీపం వెలిగించలేకపోయామని బుధవారం తమిళనాడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది…
కోర్టు ఉత్తర్వులు అమలు చేయడానికి తాను అన్నివిధాలుగా ప్రయత్నించానని మదురై కలెక్టర్ సుప్రీంకోర్టు వెల్లడించాడు… కొండపై ఉన్న రాతిస్తంభం వద్ద దీపాన్ని వెలిగించడం వల్ల తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు దెబ్బతింటాయని ఆలయ ట్రస్టీలు అభ్యంతరం వ్యక్తంచేసినట్లు పేర్కొన్నారు…
దాంతో తిరుప్పరంకుండ్రం కొండపై ఎప్పటిలానే ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపం వెలిగిందని చెప్పారు,,. ఇదిలా ఉంటే.. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ పిటిషనర్లు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు ( Supreme Court) తోసిపుచ్చింది…

1. ఆలయ ట్రస్టీలను ముందుబెట్టి ఆడుతున్న నాటకం ఇది… నిజంగానే ఆలయ ట్రస్టీల వల్ల దీపం వెలిగించకపోతే సుప్రీం కోర్టుకు క్షమాపణ ఎందుకు చెప్పడం..?
2. నిజంగానే ఆలయ ట్రస్టీలు టీవీకే విజయ్ ప్రభుత్వం ఒత్తిడికి గురై… అసలు ఆ దీప స్థంభం వద్ద దీపం వెలిగించే ఆచారమే లేదు అని చెబుతున్నారు కదా… మరి ఇన్నేళ్లూ హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ ఎందుకు చెప్పలేదు..? పక్కా పొలిటిషియన్లు ఉండే ట్రస్ట్ బోర్డు ఆలయ ఆగమాన్ని నిర్దేశించడం ఏమిటి..,? హఠాత్తుగా ఈ ట్రస్టును తెరమీదకు తీసుకురావడం ఏమిటి..,? వాళ్లు అనుమతించాల్సిన అవసరం ఏమిటి..?
3. అనేక విచారణలు, వాదనలు విన్నాకే… ఆధారాలన్నీ పరిశీలించాకే కదా మద్రాస్ హైకోర్టు అక్కడ దీపం వెలిగించాలని చెప్పింది… దాన్ని సుప్రీం కోర్టు కూడా అంగీకరించింది… మరిక కోర్టుల విచారణ, తీర్పులను విజయ్ ప్రభుత్వం అడ్డంగా ఖండిస్తున్నట్టేనా..?
4. అంతటి బాబ్రీ మసీదు కేసులోనే రాముడు గెలిచాడు… భవ్యమందిరం వెలిసింది… కానీ ఇక్కడ ఎందుకు విజయ్ ప్రభుత్వం గడగడా వణికిపోతోంది..? భయమా..? మైనారిటీ వోట్ల కన్సాలిడేషనా..? ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చేయాలి..?
5. సుప్రీంకోర్టు తీర్పునూ తుంగలో తొక్కే అధికారం ట్రస్టు బోర్డుకు ఉంటుందా..? ఎవరి అండ, ఎవరి నిర్దేశం మేరకు ఇలా వ్యవహరిస్తున్నారు..? చూస్తూ ఉండండి… ఇంకా కథ చాలా ఉంది…
…. మెజారిటీ మతస్తులు తమ విశ్వాసాలు, ఆచారాల కోసం పోరాడుతూ… భయపడుతూ… తమ ప్రభుత్వాలే తమను మోసగించే ఏకైక దేశం బహుశా ప్రపంచంలోనే ఇండియా ఒక్కటేనేమో..!!
Share this Article