గెలిచే చాన్స్ కనిపించక కేసీయార్ హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పెట్టకపోవచ్చుననీ, సీపీఎం నాయకుడు నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటిస్తాడని ఆమధ్య బాగా ప్రచారం జరిగింది… ఆ సందర్భంగా… అది జరగకపోవచ్చుననీ, అదే చేస్తే కేసీయార్‌కు వచ్చే ఫాయిదా ఏమీ ఉండదనీ, పైగా నష్టం జరుగుతుందనీ ‘ముచ్చట’ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది… అదే జరిగింది… టీఆర్ఎస్ పోటీలో ఉండబోతోంది.., కేసీయార్ మాజీ ప్రధాని పీవీని మించిన చాణక్యాన్ని ఆయన కుటుంబం మీదే ప్రయోగించాడు… పీవీ కుమార్తె సురభి వాణిదేవిని తమ అభ్యర్థిగా ప్రకటించాడు… తెలివైన ఎత్తుగడ… బహుముఖం కూడా…!! ముందుగా నాగేశ్వర్‌కు మద్దతు అంశానికొస్తే… 1) పదే పదే ఒక విషయం బాగా చర్చలో ఉందంటే కేసీయార్ కచ్చితంగా దానికి భిన్నంగా చేస్తాడు… ఇది మరోసారి నిరూపితం ఇక్కడ… 2) నాగేశ్వర్ తటస్థ వోట్ల కోసం ఓ తటస్థ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాడు తప్ప తను ప్యూర్ సీపీఎం యాక్టివిస్టు… కేసీయార్‌కు ఏమాత్రం నచ్చని వామపక్షం… 3) సమర్థన లేకపోయినా సరే, తెలంగాణను ఔట్ రైట్‌గా వ్యతిరేకించిన ఏకైక పార్టీ సీపీఎం… 4) నాగేశ్వర్‌ను గెలిపించుకుంటే టీఆర్ఎస్కు ఏ అదనపు ఫాయిదా లేదు… 5) తనే గెలవలేని పరిస్థితి ఉంటే… బీజేపీ గెలిస్తేనేం, సీపీఎం గెలిస్తేనేం..? 6) అధికారంలో ఉన్న పార్టీ తనంతట తాను రాజధాని ఎమ్మెల్సీ బరిలో లేకుండాపోవడం అంటే అది నైతికంగా, రాజకీయంగా సెట్ బ్యాక్, డ్యామేజీ అవుతుంది… సో, ఆటోమేటిక్‌గా నాగేశ్వర్‌కు మ్యాండేట్ ఇవ్వడం యాంటీ-సెంటిమెంట్ అవుతుంది… అది టీఆర్ఎస్కు మరింత మైనస్ అవుతుంది… అందుకని నాగేశ్వర్ పేరును కొట్టేశాడు కేసీయార్ అనివార్యంగా…!!
మరి అకస్మాత్తుగా వాణిదేవి తెర మీదకు ఎందుకొచ్చింది…? ఇదీ ప్రశ్న… పీవీని ఓన్ చేసుకునే క్రమంలో శతజయంతి ఉత్సవాల్ని కేసీయార్ ప్రభుత్వం అధికారికంగానే నిర్వహిస్తోంది… ఉత్సవాల ప్రారంభ సమయంలోనే పీవీ కుటుంబానికి ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కేసీయార్ ఆఫర్ చేశాడనీ, బహుశా వాణిదేవికే ఆ చాన్స్ దక్కవచ్చుననీ అప్పట్లోనే వార్తలొచ్చినయ్… చెప్పి ఉండవచ్చు కూడా…! పీవీ పేరును వాడుకోవచ్చు, ఆమెకు డబ్బుంది, కాలేజీలు, స్కూళ్లున్నయ్… ఖర్చు పెట్టుకోగలదు… పైగా పీవీ కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నట్టు అవుతుంది… వేరే దీటైన అభ్యర్థులు కూడా కనిపించడం లేదు… సో, ఆమె పేరుకు టిక్ పెట్టేశాడు… గెలిస్తే… మన ఖాతాలోకి ఓ ఎమ్మెల్సీ సీటు… ఓడిపోతే… అది ఆమె దురదృష్టం అవుతుంది… అంతే…! దీన్ని గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అని ముద్రవేసినా సరే, కేసీయార్ లెక్కలు, ఎక్కాలు అంత త్వరగా బోధపడవు ఎవరికీ…! నిజంగానే పీవీ మీద అంత ప్రేమ ఉంటే ఏ ఎన్నికా అవసరం లేని కోటాలో ఆమెను మండలికి పంపించాలి కదా… ఐనా ఇన్నాళ్లూ ఏమీ చెప్పకుండా నామినేషన్ల రోజే ప్రకటించడం వల్ల ఆమెకు దొరికిన సన్నద్ధతా టైం ఏదీ..? ముందే చెబితే ఇప్పటికే ఎన్నికల రంగాన్ని ఆమె సిద్ధం చేసుకునేది కదా..? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు దొరకబడవ్… ఎవరూ చెప్పరు, అదంతే… మరి ఈ పరిణామం ఎవరికి నష్టం, ఎవరికి లాభం..? ఇప్పుడే ఎవరూ చెప్పలేరు… కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓ ఇరకాటం… నష్టం… మిగతా అభ్యర్థుల నడుమ మాత్రం ఓ ఆసక్తికరమైన పోరుకు తెర లేచింది… వేచిచూడాల్సిందే…!!
Ads
Share this Article