ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పబడుతున్న ఆయన భార్య సునీత సమక్షంలోనే, తన ఇంట్లోనే తన ఆప్ పార్టీ నాయకుడు వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ తన పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌ను కొట్టాడు… జుట్టు పట్టుకుని దభీ దభీ మని…
జస్ట్, ఇలా ఎన్నికల రిజల్ట్స్ రానివ్వండి, ఇండి కూటమిదే అధికారం, ఇలా జైలు నుంచి బయటికి వచ్చేస్తాను అంటున్నాడు కేజ్రీవాల్… ఏమిటీ భరోసా..? ఆయన తాత్కాలిక బెయిల్ మీద బయటికి రాగానే పలుచోట్ల ఖలిస్థానీ శక్తులు జెండాలు ఎగరేసి పండుగ చేసుకున్నాయి… ఏమిటీ అరాచకం..?
బెయిల్ మీద బయటికి ఎన్నికల ప్రచారం పేరిట వచ్చినా సరే, ఈ పార్టీ నాయకురాలిపై దాడి చేయించడం ఏమిటి..? మద్యం స్కాంలో నిందితుడు, మరో రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో భేటీ వేయడం ఏమిటి..?
Ads
అసలు ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు… కేజ్రీవాల్ వెనుక ఎవరున్నారు..? ఇంతకీ ఎవరీ స్వాతి మలీవాల్..? ఆమె ఆప్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు… ఢిల్లీ టాబ్లాయిడ్ల కథనాల మేరకు… ఆమె కేజ్రీవాల్‌కు బాగా సన్నిహితురాలు… అందుకే రాజ్యసభ సభ్యత్వం ఇప్పించాడుట…
బెయిల్ మీద బయటికి వచ్చిన కేజ్రీవాల్ ను కలవడానికి వెళ్ళింది స్వాతి మాలీవాల్ ఆయన ఇంటికి… కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూమ్‌లో కేజ్రీవాల్, ఆయన భార్య సునీత, కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిబవ్ కుమార్ ఉన్నారు స్వాతి మలివాల్ వెళ్లిన సమయంలో…
అక్కడ ఏం వాగ్వాదం జరిగిందో గానీ కేజ్రీవాల్ PA బిబవ్ కుమార్ స్వాతి మలీవాల్ జుట్టు పట్టుకొని కొట్టాడు… వెంటనే స్వాతి ఢిల్లీ పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఎమర్జెన్సీ కాల్స్ చేసింది రెండు సార్లు… కొద్దిసేపటి తరువాత ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ నివాసానికి వచ్చి స్వాతిని తీసుకెళ్లారు… ఇది అన్ని ప్రధాన మీడియాలలో వచ్చిన కథనం!
స్వాతి మలీవాల్ తన భర్త నవీన్ జైహింద్‌కి విడాకులు ఇచ్చింది… ఒంటరిగా ఉంటున్నది… సునీత కేజ్రీవాల్‌కి స్వాతి మలీవాల్ అంటే కోపం… అందుకని బిబవ్ కుమార్‌ను ఉసిగొల్పిందా..?
మరో కథనం ప్రకారం… తాను (కేజ్రీవాల్) మనీ లాండరింగ్ కేసులో జైలుకి వెళ్ళిన తరువాత మౌనంగా ఉంది తప్పితే ఎలాంటి నిరసన తెలపలేదు APP రాజ్యసభ సభ్యురాలి హోదాలో… అదీ కాక బెయిల్ మీద బయటికి వచ్చిన రెండు రోజుల తరువాత కలవడానికి వచ్చింది అని కేజ్రీవాల్‌కే కోపం…
ఇంకొక కథనం ఏమిటంటే… కేజ్రీవాల్ జైలుకి వెళితే తన భార్య సునీత ముఖ్యమంత్రి అవకుండా స్వాతి మలీవాల్ కూడా పోటీకి రావొచ్చు అనే అనుమానం బలంగా ఉంది తనలో… సో, స్వాతితో ఇప్పుడు కేజ్రీవాల్‌కి సరైన రిలేషన్స్ లేవు అని AAP క్యాడర్‌కి ఒక బలమయిన సందేశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందట…
ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో మరో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కి తెలుసు కానీ మౌనంగా ఉండిపోయాడు… ఎందుకంటే, కేజ్రీవాల్ జైలుకి వెళితే ముఖ్యమంత్రి అవాలి అనే ఆశతో ఉన్నవాళ్లలో సంజయ్ సింగ్ కూడా ఉన్నాడు…
.
సీన్ కట్ చేస్తే… అమెరికన్ స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ డోనాల్డ్ లూ, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు ( Donald Lu, Assistant Secretary State for South and Central Asian Affairs) 5 రోజుల పర్యటన కోసం భారత్ , శ్రీలంక, బంగ్లాదేశ్ పర్యటనకి వచ్చాడు…
రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా (Maria Zakharova) అమెరికా భారత పార్లమెంట్ ఎన్నికలలో జోక్యం చేసుకుంటున్నది అని విమర్శించింది! డోనాల్డ్ లూ పర్యటన భారత్‌లో ఏదో చిచ్చు పెట్టడానికే అని డౌట్ ఇప్పుడు… జఖరోవా చెప్పిందీ అదే… తను అమెరికా తరపున దక్షిణ, మధ్య ఆసియా దేశాలలో ప్రభుత్వాలని అస్థిర పరిచే పనులు చేస్తుంటాడు!
పాకిస్ధాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడానికి, పెట్టీ కేసులలో జైలుకి వెళ్లి ఎన్నికలలో నేరుగా పాల్గొనకుండా చేయడంలో డోనాల్డ్ లూ ప్రముఖ పాత్ర… పాకిస్ధాన్‌కి డాలర్లు కావాలి కాబట్టి అమెరికా చెప్పినట్లు నడుచుకుంది. ఇది గత ఏడాది జరిగింది! అప్పట్లో డోనాల్డ్ లూ పాకిస్ధాన్ పర్యటన తరువాతే ఇమ్రాన్ ఖాన్ పతనం మొదలయ్యింది!
ఇప్పుడు ఇండియాకు వచ్చాడు… విదేశీ సంస్థలు మన స్టాక్ మార్కెట్‌లో వేలాది కోట్లను అమ్మేసుకుంటున్నాయి… సూచీలు పడిపోతుంటాయి… బీజేపీ విజయం మీద దేశంలో సందేహాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి… ది ఎకనమిస్ట్ వంటి పత్రికలు మోడీ తరువాత ఎవరు అనే పిచ్చి కథనాలను వెలువరిస్తూ ఉంటాయి… వాటిని యాంటీ బీజేపీ మీడియా కళ్లకద్దుకుని హైలైట్ చేస్తుంటాయి… ఇదంతా ఉద్దేశపూర్వకంగా సాగుతున్న ఏదో ప్రణాళిక… అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..!! (పోట్లూరి పార్థసారథి ఇన్‌పుట్స్ ఆధారంగా…)
Share this Article