ఆంధ్రజ్యోతి న్యూస్ సైటులో ఒక వార్త… కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును కార్యకర్తలు ఓ కోరిక కోరారు… కాదు, డిమాండ్ చేశారు… ఏమనీ అంటే..? ప్రచారానికి జూనియర్ ఎన్టీయార్‌ను తీసుకురావాలి అని..! ఇలాంటి డిమాండ్తు అప్పుడప్పుడూ తెలుగుదేశం శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్నయే కాబట్టి ఇందులో పెద్దగా కొత్త వార్తావిశేషం ఏమీ లేదు అనుకోవాలి… కాన చంద్రబాబు మౌనంగా తలూపాడు అని ఆ వార్తలో ఉన్న వాక్యమే కాస్త నవ్వు పుట్టించింది… ఎందుకంటే..? చంద్రబాబు ఆదేశించగానే జూనియర్ ఎన్టీయార్ వచ్చి, మైకు పట్టుకుని ప్రచారం చేస్తాడా..? అసలు తను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడా..? చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్నాడా..? చంద్రబాబు చెప్పగానే పరుగుపరుగున వచ్చి జై తెలుగుదేశం అని నినదిస్తాడా…? మరి చంద్రబాబు ఎందుకు అంగీకారసూచనగా మౌనంగా తలూపాడు..? అందుకే ఈ వాక్యానికి నవ్వొచ్చింది…
జూనియర్ ఎన్టీయార్ ఒకప్పటి ఎన్టీయార్ కాదు… అప్పుడెప్పుడో 2009లో తెలుగుదేశం కోసం ప్రచారం చేశాడు… అప్పటికే తను పాపులర్ హీరో… అప్పటిదాకా హరికృష్ణ అధికారికంగా జూనియర్‌ను అధికారికంగా తన కుటుంబసభ్యుడు అని అంగీకరించేదు… తను నందమూరి కుటుంబ సభ్యుడినే అని అధికారికంగా అనిపించుకోవాలనేది జూనియర్ ఆరాటం… న్యాయమైన కోరిక… దానికి చంద్రబాబు ఉపయోగపడ్డాడు… ఆ కృతజ్ఞతో, తాత పెట్టిన పార్టీ అనే అభిమానమో, ఏం పనిచేసిందో గానీ ఆ ఎన్నికల్లో కష్టపడి ప్రచారం చేశాడు, తిరిగి హైదరాబాద్ వస్తుంటే ప్రమాదానికి కూడా గురయ్యాడు… ఇది అప్పటి కథ… సీన్ కట్ చేస్తే… చంద్రబాబు సాధారణంగా యూజ్ అండ్ త్రో ధోరణికి బద్దుడు… జూనియర్ ఎప్పటికైనా తన వియ్యంకుడు బాలయ్యకు, ఆ బాలయ్య అల్లుడు లోకేష్‌బాబుకు థ్రెట్ అవుతాడనే సందేహంతో జూనియర్‌ను దూరం పెట్టేయడం స్టార్ట్ చేశాడు… అంతే ఇక… ఆ దూరం మళ్లీ తగ్గలేదు, పెరుగుతూ పోయింది…
Ads
2009 నుంచి ఈరోజుకు జూనియర్ ఎక్కడా రాజకీయ తెర మీద కనిపించలేదు… తన సినిమాలు, తన లోకం… హరికృష్ణ కుటుంబంతో, కల్యాణరామ్ తదితరులతో మంచి సంబంధాలే ఉన్నా… అప్పట్లో తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికలో కూడా జూనియర్ ప్రచారం చేయలేదు… తనకు పొలిటికల్ యాస్పిరేషన్లు ఉండవచ్చు… కానీ ఇది సరైన సమయం కాదనీ, తను రాజకీయాల్లో రావడానికి ఇంకా కొంత టైమ్ ఉందనీ ఆలోచిస్తుండవచ్చు… అత్తింటి వైపు నుంచి ఆస్తులు… తన సొంత ఆదాయం… ప్రస్తుతానికి జూనియర్‌కు ఏ ఢోకా లేదు… రాజకీయం పూసుకుంటే అదనంగా ఇప్పుడు వచ్చేదీ లేదు… సో, ఈ స్థితిలో చంద్రబాబు చెప్పగానే జూనియర్ ఎందుకొస్తాడు…? ఎందుకు రావాలి..? పైగా జూనియర్‌ను చేరదీసి, ప్రచారం చేయించి, ప్రాధాన్యం ఇచ్చి, పైకి లేపితే… అటు బాలయ్యను గానీ, ఇటు లోకేష్‌ను గానీ ‘‘తక్కువ చేసినట్టే’’ అవుతుంది… అది లోకేష్‌కు రాబోయే రోజుల్లో చాలా ఇరకాటం అవుతుంది… ఒక్కసారి తెలుగుదేశం గనుక జూనియర్ చేతుల్లోకి పోతే, ఇక దాన్ని తప్పించడం చాలా కష్టం… అందుకని జూనియర్ ప్రస్తుతానికి పచ్చచొక్కా వేసుకుని, మైకు పట్టుకుని… జై చంద్రబాబు, జైజై తెలుగుదేశం అని నినదించే అవకాశాలు లేవు… లేవు…!!
Share this Article