పదేళ్లపాటు ఈ దేశ అల్టిమేట్ రాజకీయాధికారాన్ని శాసించిన మహిళకు అల్లుడు… కాబోయే ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులతో భావించబడే ఓ నాయకుడికి స్వయానా బావ… అవసరమైతే మరో ఇందిరాగాంధీ కాగలదని కీర్తించబడే ఓ యువతికి భర్త…. మరి అంతటి విశిష్ట వ్యక్తి ఆలోచనలు, అడుగులు కాస్త పరిపక్వంగా ఉంటాయని అనుకుంటాం కదా… కానీ రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ఓ వార్త చదివితే… ఓహ్, ఈయన కూడా రాహుల్ గాంధీకి సరైన బావ అనిపించాడు… నిజానికి ఈ వార్త చాలా చిన్నగా కవరైంది… ఏ మీడియా సంస్థ కూడా దీన్ని సీరియస్గా తీసుకోలేదు… రేప్పొద్దున రాహుల్ ఈ దేశానికి ప్రధాని అయితే, ఈ వాద్రా గారే కదా చక్రం తిప్పేది, మరి ఆయన ఆలోచనల గాఢత, నాణ్యత జనానికి తెలియకపోతే ఎలా..? ఇంతకీ ఆ వార్త ఏమిటంటారా..? ఇదుగో…
దేశమంతా అయోధ్య గుడికి విరాళాలు సేకరిస్తున్నారు… ఇప్పటికే దాదాపు 2100 కోట్లు దాటి విరాళాలు సమకూరినట్టు చెబుతున్నారు… ఎక్కడో కనిపిస్తే ఈ వాద్రాను కూడా అడిగి ఉంటారు… రశీదు కూడా ఇస్తాం బ్రదర్ అని చెప్పి ఉంటారు… కానీ ఆయన ఏమన్నాడు..? ‘‘నో, నో, నేను లౌకికవాదిని, అయోధ్యకు చందా ఇవ్వను, ఈ దేశంలో చర్చి, మసీదు, గురుద్వారా వంటి ఇతర మతాల నిర్మాణాలకు విరాళాలు సేకరించినప్పుడే రాముడి గుడికీ చందా ఇస్తాను… నేను ఆధ్యాత్మక యాత్ర చేపట్టాను… అన్ని మతాల ప్రార్థనా స్థలాలకు వెళ్తాను’’ అని ఈటీవీ భారత్తో చెప్పినట్టుగా ఈనాడు రాసుకొచ్చింది… వద్దనుకుంటే చందా ఇవ్వకు, అంతేతప్ప విచిత్ర బాష్యాలు, వింత వ్యాఖ్యలతో జనానికి షాక్ తినిపించడం దేనికి..? అయితే ఇక్కడ ఇంకొన్ని ప్రశ్నల వాద్రాకు…
Ads
‘‘అయ్యా, ఇప్పుడు 2100 కోట్లు ఇచ్చిన వాళ్లంతా మతవాదులేనా..? సెక్యులర్ కాదా..? ఇదేనా తమరి అవగాహన..? తెలంగాణలో పొన్నాల లక్ష్మయ్య లక్ష రూపాయలిచ్చాడు, దిగ్విజయ్ సింగ్ లక్ష ఇచ్చాడు, వాళ్లు సెక్యులర్ కాదా..? టీఆర్ఎస్ హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా చందాలిచ్చారు… వాళ్లు సెక్యులర్ కాదా..? దేశంలో బోలెడు మంది నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారులు… చివరకు నిరుపేదలు కూడా చందాలు ఇచ్చారు… వాళ్లంతా మత దురభిమానులా..? సెక్యులర్ కాదా..? పైగా చర్చికి, మసీదుకు, గురుద్వారాకు విరాళాలు సేకరిస్తేనే గుడికి చందా ఇస్తాననే మాటే విచిత్రం… వేరే మతాల ప్రార్థన స్థలాలకు విరాళాలు అడిగితే తప్పేముంది..? వాటికీ గుడికీ లింకేమిటి..? ఇతర ప్రార్థన స్థలాల నిర్మాణాలకు రామజన్మభూమి ట్రస్టు ఎందుకు చందాలు అడుగుతుంది..? ఆయా మతాలకు చెందిన ట్రస్టులు చూసుకుంటాయి కదా… దేవుడు, మతం అనేవి విశ్వాసాలు మాత్రమే… ఎవరి నమ్మకం, ఎవరి ఆచరణ వాళ్లది… జైపూర్లోని మోతీ డుంగరీ గుడికి వెళ్లావు… నీ మతం వేరు, నువ్వెందుకు వచ్చావు అని అడగలేదు కదా… అన్ని ప్రార్థనాలయాలకూ వెళ్తేనే లౌకికవాది అంటారా..? గురుద్వారాకు, చర్చికి, గుడికి ఒకేసారి చందాలు రాస్తేనే లౌకకవాదమా..? ఢిల్లీలో బోలెడుమంది పొలిటికల్ ట్యూటర్లు దొరుకుతారు వాద్రా సాబ్… జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్… చివరగా… అసలు దేవుడే లేడనే డీఎంకే పార్టీకి చెందిన మైనారిటీ సెల్ కార్యదర్శి ఎస్.మస్తాన్ 11 వేల చందా ఇచ్చాడు… మస్తాన్ చందా లౌకికం కాదంటావా చెప్పు..?
Share this Article