మన దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు బోలెడు… కానీ ఈ కొత్త గ్రూపు ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు… చివరకు ప్రపంచంలోకెల్లా నొటోరియస్ స్పై ఏజెన్సీగా ముద్రపడిన ఇజ్రాయిలీ మొసాద్ సైతం ఇప్పటికీ ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది… ఈ కొత్త గ్రూపు పేరు జైష్-ఉల్-హింద్… మొన్న రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం ఆంటీలియా ఎదుట ఓ వాహనం దొరికింది… అందులో డిటనేటర్లున్నయ్… అంబానీ, ఆయన భార్య పేరిట ఓ బెదిరింపు లెటర్ ఉంది… ఇది కేవలం ట్రయల్ మాత్రమే, ఈసారి పేలుడు వాహనం మీ పిల్లల కాన్వాయ్‌లో పేలుతుంది అంటూ బెదిరింపులు… తరువాత మేమడిగిన డబ్బును బిట్ కాయిన్లుగా చెల్లించాలని టెలిగ్రామ్ యాప్ ద్వారా సందేశాలు వస్తున్నయ్… మీకు చేతనైతే మమ్మల్ని ఆపండి చూద్దాం అనే సవాళ్లు కూడా విసురుతున్నది ఈ కొత్త గ్రూపు… అసలే పంజాబ్ ఆందోళనకారులు ఆమధ్య రిలయెన్స్ జియో ఆస్తుల్ని ధ్వంసం చేశారు… ఈమధ్య ఖలిస్థానీ గ్రూపులు-ఐఎస్ఐ కలిసి పనిచేస్తున్నాయనేది ఇంటలిజెన్స్ సమాచారం… ఢిల్లీ ఆందోళనల్ని ఇంకా ఎగదోయడానికి దేశం బయట శక్తులు పనిచేస్తున్నాయని కేంద్రం సందేహాలు… ఈ నేపథ్యంలో భారత రాజకీయాల్ని శాసించే ఓ మెయిన్ బిజినెస్ పిల్లర్‌కు ఈ లైఫ్ థ్రెట్ ఇండియన్ దర్యాప్తు సంస్థలకు ఓ సవాల్‌గా మారింది…
Ads
కచ్చితంగా అంబానీకి ఇవి ప్రమాద సంకేతాలే… అందుకే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ… ఎన్ఐఏ… సీరియస్‌గా తీసుకుంది… అది ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ సాయమూ తీసుకుంటోంది… నిజానికి ఇజ్రాయిల్ ఇందులో అడుగుపెట్టక పోయేది… కానీ కొద్దిరోజుల క్రితం ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ ఎదుట పేలుళ్లు జరిగాయి… అవి కూడా మా పనే అంటూ ఇదే జైష్ సంస్థ క్లెయిమ్ చేసుకుంది… అందుకని అది రంగంలోకి దిగింది… ఇప్పుడిక తాజాగా అంబానీ సంబంధ ఇన్సిడెంట్… ‘‘మీ మొహం, మీరేమీ చేయలేరు, మొసాద్తో కలిసి పనిచేస్తున్నా మీరు ఒక్క అడుగు వేయలేదు… వేయలేరు’’ అంటూ సందేశాలు, సవాళ్లు అందుతున్నయ్…
నిజంగానే ఎన్ఐఏ, మొసాద్ కలిసి దర్యాప్తు చేస్తున్నా ఈ కొత్త గ్రూపు ఆనుపానులేమీ అంతుచిక్కడం లేదు… కొత్త గ్రూపు… దాని నెట్వర్క్ ఏమిటో, ఎవరు ప్రధానంగా పనిచేస్తున్నారో తెలియదు… చిన్న క్లూ కూడా దొరకడం లేదు వాటికి… మొన్న అంబానీ ఇంటి ఎదుట దొరికిన వెహికిల్ ఛేసిస్ నంబర్, ఇంజన్ నంబరు కూడా జాగ్రత్తగా కనిపించకుండా రబ్ చేయబడి ఉన్నయ్… అంబానీ కాన్వాయ్‌లోని సెక్యూరిటీ వెహికిల్స్ బాపతు నంబర్లున్న ఫేక్ నంబర్ ప్లేట్లు దొరికినయ్… సో, దీన్ని అల్లాటప్పాగా తీసుకునే సిట్యుయేషన్ కాదు… అసలే తను అంబానీ… దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మ… అందుకని ఎన్ఐఏ తన సాధనసంపత్తి, బలగాన్ని రంగంలోకి దింపింది… కానీ ఇప్పటికైతే దర్యాప్తులో పురోగతి లేదు… ‘‘మేం నీకు ఇంతకుముందు చెప్పిన సొమ్ము ఇవ్వాల్సిందే’’ అనే వాక్యాలు కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి… ఆల్ రెడీ అంబానీకి మనీ గురించిన బెదిరింపులు వచ్చి ఉన్నాయన్నమాట… కేవలం మనీ బేస్డ్ టెర్రర్ గ్రూపు అయితే ఇజ్రాయిలీ ఎంబసీని ఎందుకు టార్గెట్ చేసినట్టు..? ఈ ప్రశ్నకూ జవాబు దొరకడం లేదు…!
Share this Article