Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బురద వార్తల నడుమ ఈ ఆఫ్‌బీట్ స్టోరీ బాగుంది… బట్, సరిపోలేదు..!!

June 23, 2024 by M S R

సాక్షి ఫస్ట్ పేజీలో… (హైదరాబాద్ ఎడిషన్‌లో…) డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు హైదరాబాద్ ఎలా డెస్టినేషన్‌గా మారుతుందో ఓ వార్త కనిపించింది… ఆహ్లాదంగా అనిపించింది… తెల్లారిలేస్తే రాజకీయ బురద తప్ప మరేమీ కనిపించని పత్రికల ఫస్ట్ పేజీలో… వాడిని వీడిలా తిట్టాడు, వీడిని వాడలా తిట్టాడు బాపతు చెత్తా వార్తలే ప్రధాన పాత్రికేయంగా మారిపోయిన దుర్దినాల్లో… ఓ ఆఫ్ బీట్ వార్త ఫస్ట్ పేజీలో (అఫ్‌కోర్స్, ఈమధ్య స్లీవ్‌లెస్ జాకెట్ బాపతు నిలువు సగం పేజీలు వేస్తున్నారు కదా, అందులో…) కనిపించడమే ఆ ఆనందానికి కారణం…

పత్రికలు అంటేనే తాము తీసుకున్న పొలిటికల్ లైన్, తమ బాసులకు ఉపయోగపడేవి, ప్రత్యర్థులను తిట్టేవి, సొంత బాష్యాలు, వక్రీకరణ కథనాలే కదా… ఎవరూ తక్కువ కాదు… కాకపోతే ఆదివారం, పండుగల రోజుల్లో ఏ నెగెటివిటీ కనిపించకుండా ఆఫ్ బీస్ స్టోరీలను వేసేవాళ్లు… సరే, ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం పత్రికలు పాజిటివిటీని ఏమాత్రం స్ప్రెడ్ చేయవద్దనే సూత్రీకరణతో సాక్షి కూడా చాన్నాళ్లుగా అదే బాటలో పయనించింది…

ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈరోజుకూ ఈ బాటలోకి రాలేదు… అవి పూసుకున్న బురద ఇంకా దుర్వాసన వెదజల్లుతూనే ఉంది… నిజానికి మన జీవనంలోని అనేక కోణాలే వార్తలు… కానీ తెలుగు మీడియాకు రాజకీయమనే పైత్యం తప్ప మరేదీ వార్తగా కనిపించడం లేదు కదా… అందుకని ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ వార్త డిఫరెంటుగా బాగున్నట్టనిపించింది…

Ads

నిజానికి స్టోరీ సమగ్రంగా లేదు… పైపైన టచ్ చేసినట్టుగా మాత్రమే ఉంది…  ఆమధ్య ఎవరో ఇంటర్నేషన్ వెడ్డింగ్ ప్లానర్స్ మీటింగు ఏదో పెట్టుకున్నారట, దాన్ని చెబుతూ రాష్ట్ర పర్యాటక శాఖ ఏవో కొత్త ప్రణాళికలు వేస్తోందనే రొటీన్ స్టయిల్ కథనం ఇది… ఫ్యామిలీ పేజీల్లో గానీ, సండే సప్లిమెంటులో గానీ లేదా వీలయితే మెయిన్ పేజీల డబుల్ షీట్ గానీ కవర్ చేయగల స్టోరీ యాంగిల్ ఇది…

ధనికులు, సెలబ్రిటీలే కాదు… వాళ్లలా విదేశాలకు వెళ్లి కోట్లకుకోట్లు ఖర్చు చేయడం కూడా కాదు… మధ్యతరగతి కూడా దేశంలోని పలు ప్రాంతాలకు… అంటే గోవా, మహాబలిపురం, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు… వాస్తవానికి హైదరాబాద్‌లోనే బోలెడు రిసార్ట్స్ ఈ డెస్టినేషన్ వెడ్డింగులకు అనుకూలం… లక్నవరం, అనంతగిరి, సోమశిల అని ఏవేవో రాశారు గానీ… సరిపడా వసతి కష్టం… పైగా పూర్తి బాధ్యతలు తీసుకుని చక్కబెట్టే సంస్థలు దొరకవు పెద్దగా…

వివాహవేదిక, డెకరేషన్, ఫుడ్, అకామిడేషన్, పురోహితుడు, ఈవెంట్స్ చేసే ఏజెన్సీలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ… ఎన్ని కావాలి పెళ్లికి..! పైగా ముఖ్యులను తప్ప ఎక్కువ మందిని తీసుకెళ్లలేం… అందుకే బయట వేరే రాష్ట్రాలకు వెళ్లి డెస్టినేషన్ వెడింగ్స్ చేసుకుని వచ్చినా సరే, మళ్లీ తాము ఉండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా రిసెప్షన్లు పెట్టి, అందరినీ పిలుస్తున్నారు… అలాంటప్పుడు మరి ఎక్కడికో వెళ్లి వెడ్డింగ్స్ జరుపుకోవడం దేనికి అంటారా..? నిజం..!

డెస్టినేషన్ వెడ్డింగ్ హైదరాబాద్‌లోనే ప్లాన్ చేస్తే… అన్ని సౌకర్యాలూ ఉంటాయి, వెడ్డింగ్ ప్లానర్స్ దొరుకుతారు, అన్ని పద్ధతుల్లో వివాహాలు జరిపించే వెసులుబాటూ ఉంటుంది… అతిథులు అది లేదు, ఇది లేదు అని తప్పులు తీసే ప్రమాదమూ లేదు… అటువైపు ఇటువైపు కుటుంబాల ముఖ్యులు పనిభారం తగ్గి ఎంచక్కా వాాళ్లూ పెళ్లిసందడిని ఎంజాయ్ చేసే వీలుంది…

ఘట్కేసర్, శామీర్‌పేట, గండిపేట తదితర ప్రాంతాల రిసార్ట్స్ మాట్లాడుకుని పెళ్లిళ్లు చేయడం ఇప్పుడు ఎక్కువైంది… కొన్ని రిసార్ట్స్ మొత్తం వాళ్లే సమకూరుస్తారు… మధ్య, ఎగువ మధ్య తరగతి కూడా భరించే రేంజులోనే… ఒకవేళ హైదరాబాద్ కేంద్రంగా వెడ్డింగ్ జరిపించుకునేవాళ్లకు ఓ గైడ్ వంటి సమగ్ర స్టోరీ ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది… అఫ్‌కోర్స్, ఈమాత్రం రాయడమే ప్రస్తుత స్థితిలో ఆనందదాయకం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…
  • ఇది ఆ పాత కాంగ్రెస్ కాదు… ఈ జుబ్లీ గుట్టల్లో కొత్తగా స్ట్రాటజిక్ అడుగులు…
  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions