Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీటీడీ కొత్త ఈవో గారూ… మీకీ దుర్లభదర్శనం విషయం తెలుసా..?

June 24, 2024 by M S R

తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే మూడు నెలల ముందుగానే టిటిడి వారి వెబ్ సైట్లో స్పెషల్ ఎంట్రీ స్లాట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి

స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా ముందుగానే ఛానెల్స్ ద్వారానూ.. వెబ్ సైట్ ద్వారానూ తెలియపరుస్తారు

సైట్ ఓపెన్ చేసి స్పెషల్ ఎంట్రీ పేజి క్లిక్ చేసి, మనకు కావాల్సిన రోజులో కావాల్సిన టైము స్లాట్ సెలెక్ట్ చేసుకు,ని ఆధార్ డీటైల్స్ ఇస్తే పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది

Ads

అక్కడ క్లిక్ చేసి పేమెంట్ చేస్తే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం అలాట్ అవుతుంది

ఇది కాగానే ఇదే మాదిరిగా అకామడేషన్ పేజిలోకి వెళ్లి రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు

ఇది చాలామందికి తెలిసే ఉంటుంది

ఇప్పటిదాకా నాక్కూడా ఇదే తెలుసు

అయితే చాన్నాళ్ళ తర్వాత ఈ రోజు ఆ సైట్లోకి వెళ్లిన తర్వాత నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలిసింది

గతంలో టిటిడి వెబ్సైట్ లాగిన్ అవ్వాలంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఈజీగా లాగిన్ అయ్యేవాళ్ళం

ఇప్పుడు కొత్తగా మొబైల్ ఓటిపి సిస్టమ్ పెట్టారు

అంటే మనం వెబ్సైట్ లాగిన్ అవ్వాలంటే ముందుగా మన మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యాలి

అటు పిమ్మట ఓటిపీ వస్తుంది

వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది

అయితే ఇక్కడే చాలా గమ్మత్తులు జరుగుతాయి

ఒకేసారి లక్షలాది మంది టైమ్ స్లాట్ కోసం లాగిన్ అవటంతో లోడ్ ఎక్కువై ఇచ్చిన ఐదు నిమిషాల గడువులోగా మన మొబైల్ కు వెంటనే ఓటీపీ రాదు

ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ‘ అరేయ్ బాబూ నీకు ఇచ్చిన టైములో ఓటీపీ రాలేదు కాబట్టి మల్లోసారి ట్రై చెయ్యవోయ్ ‘ అని మెసేజ్ వస్తుంది

మనం మళ్ళీ గింజుకుని రెండో సారి మన మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే తిరిగి అదే పరిస్థితి

అలా మూడు నాలుగు సార్లు గింజుకుంటే మెల్లిగా పెళ్లి నడకలు నడుచుకుంటూ ఓటీపీ మన ఒళ్లో సారీ సెల్లో దిగబడుతుంది

అమ్మయ్య ఎలాగైనా ఓటీపీ దొరికేసింద్రా యురేకా తకమికా అని చాలెంజ్ లో చిరంజీవిలాగా పాడేసుకుంటూ ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే తూచ్, నువ్ ఎంటర్ చేసిన ఓటీపీ రాంగ్, ఇది కాదు, మళ్ళీ ట్రై చెయ్ అని మెసేజ్ ప్రత్యక్షం అవుతుంది

అంటే అంతకుముందు మనం ఎంటర్ చేసిన మన మొబైల్ తాలూకూ గింజుడులో ఇది ఎన్నో గింజుడో (ఓటీపీనో) తెలీదు,
సరే, ఏతావాతా బాగా గింజుకున్న తర్వాత లక్ బాగుండి ఓటీపీ మ్యాచ్ అయితే మెల్లిగా సైట్ ఓపెన్ అవుతుంది

అప్పటికే సగం పుణ్య కాలం గడిచిపోతుంది

ఇక్కడ ఇంకో తమాషా జరుగుతుంది

బాబూ నీకన్నా చాలామంది ముందే సైట్లోకి దూరి కుస్తీలు పడుతున్నారు గావున ఓ ఐదు నిమిషాలు వెయిట్ చెయ్యవోయ్ అంటూ ఓ భూ చక్రం మెల్లిగా తిరుగుతూ కనిపిస్తుంది

అలా ఐదు నిమిషాలు భూ చక్రం వంక కనులు తిప్పుకోకుండా చూసిన పిదప స్పెషల్ దర్శనం 300 రూపాయల స్లాట్ ఓపెన్ అవుతుంది

అందులో గ్రీన్ బాక్సుల్లో డేట్లు ఉంటే అవైలబుల్ అని అర్థం

ఎర్ర బాక్సుల్లో డేట్లు ఉంటే సభకు నమస్కారం అని అర్థం

ఫలానా తారీఖున ఫలానా టైము స్లాట్ కి ఇన్ని ఖాళీలు ఉన్నాయి చూస్కో అని స్లాట్స్ కనపడతాయి

ఇక్కడ ఇంకో సర్కస్ ఉంటుంది

ఓ పక్క స్లాట్స్ హాట్ కేకుల్లా అయిపోతుంటాయి

ఇంకో పక్క వేగంగా మనం ఎంతమందిమి అయితే అంతమందిమి స్లాట్ సెలెక్ట్ చేసుకుని ముందుకెళ్తే నీ ఆధార్ డీటైల్స్ ఇవ్వవోయ్ అంటుంది. సరే అవన్నీ ఎంటర్ చేశాక డబ్బులు కట్టవోయ్ అంటుంది

డబ్బులు కడదామని క్లిక్ చేస్తే సారీనోయ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ ఫుల్ అయిపోయింది.. ఇంకోటి ట్రై చేసుకో అని మేసేజ్ వస్తుంది

మళ్ళీ బండిని రివర్స్ గేర్ లో వెనక్కి ఇందాకటి ప్లేసులోకి వెళ్లి ఇంకో స్లాట్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వస్తే మళ్ళీ సారీనోయ్ ఇవి కూడా ఫుల్ అయిపాయే అని మేసేజ్ వస్తుంది

వెయ్యి మందికి దర్శనం ఖాళీలు ఉన్నాయన్న స్లాట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా, సారీ బాస్, ఇవి కూడా నిల్లే అని మేసేజ్ వచ్చిందంటే లీలలు కాక మరేమిటి ?

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ,

టిటిడి వారి సైట్ నిర్వహణ అధ్వాన్నంగా ఉంది

నిజం చెప్పొద్దూ ,

టెక్నాలజీ ఉపయోగించి కొంతమంది స్లాట్స్ ను బ్లాక్ చేసి బ్లాకులో అమ్ముకుంటున్నారేమోనన్న సందేహం కూడా వచ్చింది నాకు. సాంకేతిక పరంగా ఎంతో డెవెలప్ అయిన ఈ రోజుల్లో కూడా టెక్నికల్ ఎర్రర్ పేరిట భక్తులు ఇబ్బంది పడటం బాధాకరం

అంచేత కొత్తగా బాధ్యతలు స్వీకరించిన టిటిడి ఈవో గారికి విన్నవించేది ఏంటంటే ,

టిటిడి వెబ్ సైట్ ఆన్లైన్ పోర్టల్ మీద దృష్టి పెట్టండి

టెక్నికల్ ఎర్రర్స్ ను సరిచేయండి

లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవుతారు కాబట్టి సర్వర్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్

ముఖ్యంగా లాగిన్ అవ్వాలంటే ఓటీపీ సిస్టమ్ బదులు యూజర్ ఐడి పాస్వర్డ్ విధానాన్నే కొనసాగించండి

అధికారులు కొద్దిగా శ్రద్ధ పెడితే ఇవన్నీ సరిచేయటం ఏమంత కష్టం కాదు ….. ఓం నమో వేంకటేశాయ …… (పరేష్ తుర్లపాటి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions