ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ప్రపంచం కదా… ఎవరికైనా బర్త్‌డే, మ్యారేజ్‌డే గట్రా విషెస్ చెప్పాలంటే…. వాళ్లు ఏయే వాట్సప్ గ్రూపుల్లో ఉన్నారో వాటిల్లో శుభాకాంక్షలు పోస్ట్ చేస్తుంటారు… ఫేస్ బుక్‌లో పోస్ట్ పెడతారు… మామూలుగా విషెస్ చెబితే ఏం బాగుంటుంది…? అందుకని ఇమోజీలు, జిఫ్‌లు, చిన్న వీడియోలు, గ్రాఫిక్స్ వెతికి మరీ యాడ్ చేస్తుంటారు… వాళ్ల ఫోటోలు పెడతారు… ఫోటోలు సమయానికి దొరక్కపోతే వాట్సప్ నుంచో, ఫేస్ బుక్ నుంచో డౌన్ లోడ్ చేసి మరీ పోస్టులకు యాడ్ చేసి, విష్ చేస్తుంటారు… కామన్ కదా… అంతా సదుద్దేశంతోనే కదా… ఆనందాన్ని, సందర్భాన్ని షేర్ చేసుకోవడం కోసమే కదా…… కాదు, కొన్నిసార్లు అది జైలుకు కూడా పంపే ప్రమాదం ఉంది… నమ్మడం లేదా..? ఓసారి మధ్యప్రదేశ్ దాకా వెళ్లొద్దాం పదండి, ప్రూఫ్ చూపిస్తాను… ఈరోజు భోపాల్ హైకోర్టులో ఆ బెయిల్ పిటిషన్ విచారణ కూడా జరగబోతోంది…
రత్లాం… అక్కడ ఓ అడ్వొకేట్ ఉన్నాడు… పేరు విజయ్ సింగ్ యాదవ్… మొన్న జనవరి 29న Judicial Magistrate First Class మిథాలీ పథకోన్కు ఓ మెయిల్, బర్త్ డే కార్డు పంపించాడు… ఓ ఫిర్యాదు దాఖలైంది… ఫిబ్రవరి 9న రత్లాం పోలీసులు సదరు వకీల్ సాబ్‌ను అరెస్టు చేశారు… ఎందుకయ్యా అంటే..? పర్మిషన్ లేకుండా ఆమె ఫోటోను ఫేస్ బుక్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నాడు… ఆమె ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్టులో కూడా తను లేడు… సో, అక్రమం, దుర్వినియోగం… ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్తిస్తుందట… Section 420 (Cheating and dishonestly inducing delivery of property), 467 (Forgery of valuable security ), 468 (Forgery for purpose of cheating), 469 (Forgery for purpose of harming reputation) of the Indian Penal Code and Section 41 read with 67(Punishment for publishing or transmitting obscene material in electronic form) of the Information Technology Act, 2000…. ఇలా ఇతర కేసులు కూడా పెట్టేశారు…
Ads
ఏదో బర్త్ డే విషెస్ చెబితే… ఇంత శిక్షిస్తారా అని లబోదిబోమంటూ సదరు లాయర్ బంధువులు నాలుగు రోజుల తరువాత బెయిల్ పిటిషన్ వేశారు, కానీ లోకల్ కోర్టు దాన్ని కొట్టేసింది… అదుగో ఇప్పుడు ఆ బెయిల్ పిటిషన్ ఏకంగా మధ్యప్రదేశ్ హైకోర్టుకు వచ్చింది… ఇదీ కథ… తన సోదరుడు వేశాడు పిటిషన్… అనవసరంగా ఈ సెక్షన్లలో ఇరికించారనీ, బర్త్ డే విషెస్ పంపించడంలో కుట్ర లేదా దురుద్దేశం ఏముంటుందనేది పిటిషిన్దారు ప్రశ్న… నిజమే కదా… ఆ ఫోటోను ఆమెకే పంపించాడు, శుభాకాంక్షలు చెప్పాడు, అందులో ఇన్ని సెక్షన్లు పెట్టే నేరం ఏముంది..? ఆమెను అప్రతిష్టపాలు చేసింది ఏముంది..? అందుకని సదరు జుడిషియల్ మేజిస్ట్రేటు మీద చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేటుకు ప్రైవేటు కంప్లయింట్ పంపించాడు లాయర్… నేను సోషల్ వర్కర్‌ను కూడా, జై కుల్ దేవీ సేవాసమితి అధ్యక్షుడిగా అందరినీ అలా విష్ చేస్తుంటాననీ చెబుతున్నాడు… సో, కాస్త వెనకాముందూ చూసుకుని ఫోటోలు డౌన్ లోడ్ చేయండి, విషెస్ పంపించేముందు కూడా కాస్త జాగ్రత్త సుమీ…
Share this Article