Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కథలో ఆదర్శం మరీ ఎక్కువైపోయి… ప్రేక్షకులు ఫోఫోవోయ్ అనేశారు…

August 27, 2024 by M S R

దానే దానే పర్ లిఖా హై ఖానే వాలే కా నామ్ . మన పెద్దలు చెపుతుంటారు . డ్రమ్ము నూనెలో మునిగినా డ్రమ్ము నూనె ఒంటికి పట్టదు . ఒంటికి ఎంతయితే పట్టుతుందో అంతే పట్టుతుంది . ఈ సినిమా నిర్మాత యం యస్ గోపీనాథ్ విషయంలో అక్షరాలా నిజం అనిపిస్తుంది . సినిమాలో కధ బాగుంటుంది . ANR , శారద వంటి తారాగణం . పాటలు బాగుంటాయి . సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు . 1976 లో ANR నటించిన మూడు సినిమాలలో ఒకటి ఈ మహాత్ముడు సినిమా .

సినిమా కధ కూడా నిర్మాత గోపీనాధే వ్రాసుకున్నారు . ఓ జమీందారిణికి ఇద్దరు కొడుకులు . ఒకరు వేణుగోపాల్ , మరొకరు నందగోపాల్ . ఆమె ఇద్దరినీ గోపాల్ అనే పిలుస్తుంది . ఆ పిలుపే సినిమాకు మూలం . వేణుగోపాల్ని ప్రేమిస్తుంది హీరోయిన్ శారద . జమీందారిణి గారు గోపాల్ అంటే తాను ప్రేమించిన వేణుగోపాల్ అనుకుని పెళ్లికి అంగీకరిస్తుంది . Mistaken identity . ఒకే పోలికలతో వుండే హీరోలను చూసి పొరబడ్డ హీరోయిన్లను మామూలుగా సినిమాలో చూస్తుంటాం.కానీ ఒకే పేరుతో పిలవబడే అన్నదమ్ములను పేరు విని భంగపడ్డ హీరోయిన్ని ఇందులో చూస్తాం.ఇదొక విడ్డూరం..

హీరో ఒప్పించి పెళ్లి జరిపిస్తాడు . విలన్ అల్లు రామలింగయ్య వాళ్ళ పెళ్ళిని పెటాకులు చేస్తాడు . హీరో దేశం మీద పడి , దోపిడీ దొంగల్ని సంస్కరించి , కుటుంబాన్ని చక్కదిద్ది , పెళ్ళీ గిళ్ళీ లేకుండా మహాత్ముడై సమాజసేవ చేస్తాడు . ఇదీ కధ .

Ads

సినిమాలో ఆత్రేయ డైలాగులు చాలా బాగుంటాయి . సి నారాయణరెడ్డి , కొసరాజు పాటలు బాగుంటాయి . రామకృష్ణ , సుశీలమ్మలు పాడిన ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని రాగాలో పాట గొప్ప హిట్ సాంగ్ . ఎంత మధురం , మనిషి మనిషిగా , చిట్టి పాపా , పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ఎంతగా చూస్తున్నా వింతగానె ఉంది పాటా బాగుంటుంది , పాటలో ANR , శారదల ఏక్షనూ బాగుంటాయి . జయమాలిని డాన్స్ పాట రంభ లాగా బాగుంటుంది .

యం యస్ గోపీనాథే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ANR , శారదలతో పాటు సత్యనారాయణ , జి వరలక్ష్మి , గిరిబాబు , ప్రభ , అల్లు రామలింగయ్య , ధూళిపాళ , రోజా రమణి , మురళీమోహన్ , కాంతారావు , ముక్కామల , త్యాగరాజు , ఝాన్సీ ప్రభృతులు నటించారు .

ఈమధ్య కూడా టివిలో వచ్చింది . యూట్యూబులో ఉంది . ఈ సినిమా ఇప్పటివరకు చూడని ANR అభిమానులు ఎవరయినా ఉంటే చూడండి . సినిమాలో సంగీత ప్రియులు పాటల వీడియోని మిస్ కాకండి . ముఖ్యంగా ఎదురుగా నీవుంటే , ఎంతగా చూస్తున్నా వింతగానె ఉంటుంది , ఎంత మధురం పాటలు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !
  • పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నయ్ ! అసలు గేమ్ షురూ !!
  • ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ఏమాత్రం సరిపోదు… అంతకుమించి..!!
  • మరీ గోకకు పవన్ !! నువ్వు వేళ్లు పెడితే… రేవంత్ కాళ్లు పెడతాడు !!
  • ఒక భూమనకూ- ఒక నాయుడికీ …. ఒక జగన్‌కూ ఒక బాబుకూ తేడా ఏమున్నట్టు..?!
  • ఏడుపుగొట్టు ట్రోలర్లు… చివరకు జానకమ్మ మనమరాలినీ వదల్లేదు !!
  • వనపర్తి ఆటో భరత్‌కు బండి సంజయ్ మాత్రమే ఎందుకు గుర్తొచ్చాడు..?!
  • మినిమం పీహెచ్‌డీ చేసినా… ఈ మార్పులు అర్థం కావడం కల్ల !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions