బిగ్ బాస్ 8… లిమిట్ లెస్… జంటలుగా ఎంట్రీలు (విత్ బడ్డీస్)… ఈసారి ఏదో రొమాన్స్ మన్నూమశానం బాగానే ప్లాన్ చేస్తున్నారన్నమాట… సరే, మొదటి ఎంట్రీ ఎవరు… చాలామంది ఎదురుచూస్తున్న షో కదా… చెప్పుకుందాం…
ఇద్దరూ కన్నడ నటులే… మన తెలుగు టీవీ సీరియళ్లలో డామినేషన్ అంతా వాళ్లదే కదా… యష్మి గౌడ, నిఖిల్… వీరిలో యష్మి గౌడ బిర్యానీ లవర్… ఆల్రెడీ ఓసారి బ్రేకప్, తనే వెళ్లగొట్టిందట… ఓపెన్… నిఖిల్‌కు మరో టీవీ నటి కావ్యకూ నడుమ ఏదో ఉందని చాలాకాలంగా గాసిప్స్ ఉన్నవే… కానీ సర్లెండి, సింగిల్ అంటున్నాడు… గతంలో కొన్ని ఉన్నాయట… ఫస్ట్ పెయిర్ ఇన్ టు బిగ్ బాస్ హౌజ్… ఈ రెండు పేర్లూ చాన్నాళ్లుగా బిగ్‌బాస్ ఎంట్రీపై వినిపిస్తున్నవే…
తరువాత… అన్నపూర్ణ స్కూల్ విద్యార్థి… పెళ్లిచూపులు సినిమాతో కాస్త పేరొచ్చిన నటుడు… అభయ్… తెలంగాణ సాంస్కృతిక రాజధాని సిద్దిపేట నుంచి వచ్చినవాడు… ఊహించని పేరు… వివాహితుడు… ఎవరూ అంచనా వేయలేకపోయారు… తనకు జతగా హౌజులోకి ఎంట్రీ అయ్యేది ప్రేరణ… ప్రేరణ కంభం… వాగుడు కాయ, తమిళమ్మాయి, కానీ హైదరాబాదే తన అడ్డా ఇప్పుడు… వివాహిత… రష్మిక మంథాన ఫ్రెండ్, రూమ్మేట్ గతంలో… (ప్రేరణకన్నా యష్మి ఎక్కువ వాగుడుకాయ)…
Ads
ఇక్కడ రానా ఎంట్రీ… స్టేజ్ మీదకు… చాన్నాళ్లుగా గ్యాప్… నివేదా థామస్ కూడా వచ్చింది ఏదో సినిమా ప్రమోషన్ కోసం… బాగా లావైంది… ఆ మాటంటే కస్సుమంటారు, మా బాడీ మా ఇష్టం అని… కానీ చూడటానికి ఇబ్బందిగానే కనిపించింది… కొన్నాళ్ల క్రితం నిత్యా మేనన్లాగే… ఆ సినిమా ట్రెయిలర్ కూడా వేసేశారు… రాబోయే వారాల్లో ఇంకా చాలా ప్రమోషన్లు చూడాలి, బీ రెడీ…
రానా, నివేదా జంటగా హౌజులోకి వచ్చారు… మొదటి రెండు జంటలకే రానా, నివేదలు ఇచ్చే టాస్క్… ప్రేరణకు క్లెప్టోమేనియా… అంటే మాల్స్‌లో చిన్న చిన్న చోరీలు చేసే అలవాటు… చిన్నప్పుడు లెండి… అయిదో ఎంట్రీ ఓం ఆదిత్య… అప్పట్లో హీరో… పెద్ద పెద్ద మెరిటోరియస్ కాదు, ఈరోజుకూ తెలుగు సరిగ్గా రాదు… కొన్నేళ్లపాటు ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్… ఏదో వ్యథ, ఏదో బాధ… సినిమాకు డివోటీ.,. ఎంట్రీపై చాన్నాళ్లుగా వినిపిస్తున్న పేరే…
సినిమాల్లో రకరకాల పనులు… బతుకు కోసం… జనానికి ఏమైనా తిరిగి ఇవ్వాలనే తపన… రెండు తెలంగాణ ఊళ్లకు ఆర్థికసాయాలు… వోకే, తనకు జతగా ఆకుల సోనియా… చాన్నాళ్ల తరువాత ఆమె హఠాత్తుగా ఫేస్బుక్లో యాక్టివ్ అయిపోయింది, ఏదో జరుగుతోందని అర్థమైంది… ఇదే అన్నమాట… (నా ఫ్రెండ్ లిస్టులో ఉన్న అమ్మాయే)… అందగత్తె, ఓపెన్, కరాటే ఫైటర్… ఆర్జీవీ హీరోయిన్… తెలంగాణ, మంథని… తను సోషల్ వర్కర్ కూడా…
తరువాత ఎంట్రీ… బెజవాడ బేబక్క… అసలు పేరు మధు నెక్కంటి… ప్రముఖ యూట్యూబర్… యాక్టివ్… కాస్త లావు… అమెరికాలో కొన్నాళ్లు ఉండి, వాపస్ వచ్చేసింది… పెళ్లయి… అయి‘పోయింది’ అట… సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ చేస్తుంటుంది… (యష్మి, ప్రేరణలలాగే తనూ వాగుడుకాయ…) ఫుడ్ లవర్…
తరువాత కాకినాడ కేరక్టర్ శేఖర్ బాషా… రేడియో జాకీ… చాలా పాపులర్ ఆర్జే, యాక్టివిస్టు… స్పాంటేనియస్ హ్యూమరిస్టు… ఇదీ ఓ వాగుడుకాయే… బక్క ప్లస్ బేబక్క జంట… వోకే, తరువాత వచ్చింది కిర్రాక్ సీత… తనకు జతగా నాగ మణికంఠ… ఇద్దరి గురించీ ఇకపై హౌజులో తెలియాల్సిందే… ఏవీలు కూడా పెద్దగా ఏమీ చెప్పింది లేదు… కాకపోతే మణికంఠ ఓ విధివంచితుడని అర్థమైంది… దురదృష్ట జాతకుడు… బయటికొచ్చాక ఓసారి వేణుస్వామిని ఓసారి కలువు బ్రదర్…
ఫాఫం… నాని వచ్చాడు ప్రమోషన్ కోసం… సరిపోదా శనివారం సినిమా కోసం… హీరోయిన్ ప్రియాంకతో కలిసి వచ్చాడు… కానీ ఫ్లాపయింది కదా… పోనీలెండి… (నానిని ఎస్ జే సూర్య డామినేట్ చేశాడు అని చెప్పడానికి మరో నిదర్శనం… ప్రియాంక నానికి 100 మార్కులేస్తే, సూర్యకు 101 మార్కులేసింది…) ఏదో ఆట ఆడించాడు హౌజ్ మేట్స్‌తో… టిపికల్ బిగ్‌బాస్ తరహా టాస్క్…
తరువాత పృథ్వి… చూడబుల్ ఫేస్, లుక్కు… పర్లేదు… తనకు జతగా ఫాఫం, విష్ణుప్రియ… టీవీ సెలబ్రిటీ… హోస్ట్, నటి… చాలా యాక్టివ్… లిబరల్… కానీ ఓవరాక్షన్… తన ఐక్యూ లెవల్ ఎంత చిన్నగా ఉంటుందో మరోసారి స్టేజీ మీదే నిరూపించుకుంది… ఎలక్ట్రిక్ రైల్ కూడా పొగ విడుస్తుందని తప్పులో కాలేయడం ద్వారా… !
మరో కంటెస్టెంట్ నైనిక… డాన్సర్… యాక్టింగ్ మీద ఇంట్రస్ట్… నెట్లో పాపులర్… కో-పర్ఫామర్ సాయితో కలిసి చేసే వీడియోలు పాపులరే… తనకు జతగా ఎంట్రీ వరంగల్ కుర్రాడు… ఫేమస్ వరంగల్ డైరీస్ యూట్యూబర్… నబీల్ ఆఫ్రిది… దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చాడు, కాసేపు ప్రాంక్ సరదా… తనకు టీవీ రియాలిటీ షోలు అలవాటే… (ఎవరూ ఈ పూర్తి జాబితాను అంచనా వేయలేదు, లీకులు లేకుండా ఈసారి భలే సీక్రెసీ మెయింటెయిన్ చేశారు… గుడ్…)
సో, ఏడు జంటలు… తరువాత ఎలాగూ ఎలిమినేషన్లు జరిగేకొద్దీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి… ఎంజాయ్… అందరూ ఇన్ఫ్లుయన్సర్లు, టీవీ సెలబ్రిటీలు… భిన్నరంగాలకు చెందిన వేర్వేరు కేరక్టర్లను తీసుకురాలేకపోయారు… పోనీలెండి… ఈసారి మరీ పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ వంటి కూటములు ఉండకూడదనే ఆశిద్దాం…!! తెలుసు కదా, అసలే హైడ్రా సర్కార్… ఎవరైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తే… అన్నపూర్ణ స్టూడియోస్కే ప్రమాదం..!!!
Share this Article