Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ‘ముగ్గురూ’ ప్లస్ ఆదానీ… విజయ్‌తో త్రిష… ఫోటో బాగుంది మాస్టారూ..!!

November 6, 2026 by M S R

.

ఒక ఫోటో తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయిపోయింది… అందులో ఎవరెవరు ఉన్నారంటే… తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్… ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… తెలంగాణకు జెర్రంతలో సీఎంగా మిస్సయిన కేటీ రామారావు… ప్లస్ ఆదానీ… ఇందులో అందరూ తమ భార్యలతో కనిపిస్తున్నారు… ఒక్క విజయ్ తప్ప… తనకూ జెర్రంతలో భార్యగా మిస్సయిన త్రిష ఉంది… తనూ భార్యనే అన్నట్టుగా…

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు జార్జి రెడ్డి కొడుకు పేరు అనిల్ రెడ్డి… ఆయన కూతురి పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్ అది… చెన్నైలో… అనిల్ రెడ్డితో విజయ్‌కు బాగా సాన్నిహిత్యం ఉంది… తన ద్వారా జగన్ మోహన్ రెడ్డితోనూ సత్సంబంధాలున్నాయి విజయ్‌కు… అదీ నేపథ్యం… రాబోయే రోజుల్లో అవసరానికి తగినట్టు వైసీపీ, టీవీకే సహకరించుకుంటాయి… అది క్లియర్…

Ads

ఇక ఆదానీ..? జగన్‌కు అంబానీ ఎలా ముఖ్యమో, ఆదానీ కూడా అంతే… రాజకీయ- ఆర్థిక కోణాల్లో చూస్తాడు… అంబానీ అడగ్గానే తన ప్రతినిధి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇచ్చాడు కదా జగన్… (వైఎస్ మృతి- అంబానీపై ఆరోపణలను పక్కకు పెట్టేసి మరీ…) సీఎం విజయ్ కూడా కమర్షియలే… తనకు కూడా ఆదానీ కావల్సినవాడే… అఫ్‌కోర్స్, ఆదానీలోని వ్యాపారవేత్తకు విజయ్, కేటీయార్, జగన్… అందరూ కావల్సినవాళ్లే…

cm vijay

ఇక కేటీయార్, జగన్… తెలంగాణ ఏర్పడక ముందు ఒకరు వీర సమైక్యవాది, మరొకరు తెలంగాణవాది… ఇద్దరి ప్రభుత్వాలు ఏర్పడ్డాక జాన్ జిగ్రీ అయిపోయారు… కలిసి ‘ఇరిగేషన్ ప్రాజెక్టులు’ కట్టి ఉమ్మడిగా ‘ఫాయిదా’ పొందాలని అనుకున్నారు… ఒకరికొకరు ఎన్నికల్లో సహకరించుకుంటారు… రేప్పొద్దున అవసరమైతే, పొలిటికల్ ఈక్వేషన్లు, పరిస్థితులను బట్టి టీవీకే, బీఆర్ఎస్, వైసీపీ కలిసి నడుస్తాయి… వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు సమీకరణాలు అయినా సరే… పరస్పర సహకారం…

ఆల్రెడీ టీవీకేకు పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త కపిల్ సాహూ ఇప్పుడు వైసీపికి కూడా పనిచేస్తున్నాడు… సంధానకర్త అనిల్ రెడ్డే… (బీఆర్ఎస్‌కు కూడా పనిచేస్తాడేమో చూడాలి…) సో, ఇవన్నీ వోకే, మరి త్రిష..? ఈ ఫోటోలో ఆడ్‌గా కనిపిస్తున్నది చూడటానికి… ఎందుకంటే..?

విజయ్ భార్య పేరు సంగీత స్వర్ణలింగం… విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది… ఏవో మనస్పర్థలు, విడివిడిగా ఉంటున్నారు… త్రిషతో విజయ్ బంధం నచ్చలేదు ఆమెకు, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు కూడా అప్లయ్ చేసింది, మొన్నటి ఎన్నికలకు ముందు..! విజయ్ సీఎం అయ్యాక ఆమె విడాకుల కేసు వాపస్ తీసుకుంది…

కారణాలు తెలియవు… ఆమె స్వతహాగా ఆస్తిపరురాలే, మరి భరణం- మనోవర్తి- నివాసహక్కుల ఇష్యూల్లో ఓ రాజీకి రాలేకపోయారా..? మరేమైనా ఇతర కారణాలున్నాయా తెలియదు గానీ… అధికారికంగా వాళ్లిద్దరూ భార్యాభర్తలే… విడివిడిగా ఉన్నప్పటికీ… ఒక దశలో ఈ విడాకులు అయిపోగానే త్రిష- విజయ్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి…

కానీ విడాకులు తీసుకోకుండా చేసుకోలేడు… కానీ త్రిషతో ప్రతి ఫంక్షన్‌కూ వెళ్తాడు… భార్యాభర్తల్లాగే… దాపరికం ఏమీ లేదు… అంతా బహిరంగ రహస్యమే… ఈ అనిల్ రెడ్డి బిడ్డ ఫంక్షన్‌కూ అలాాగే వచ్చారు… సమాజం ఏమనుకుంటే మనకేం..? వాళ్లు పట్టించుకోరు- ఆ ‘ప్రేమ జంట’ లోకనిందకు భయపడదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ ‘ముగ్గురూ’ ప్లస్ ఆదానీ… విజయ్‌తో త్రిష… ఫోటో బాగుంది మాస్టారూ..!!
  • మన DNA లోనే రామాయణం ! – మన కుటుంబాల్లోనూ అవే పాత్రలు !!
  • తమన్ ఏమిటిది..? శివమణి ఏదో అంటున్నాడు..? ఏం జరుగుతోంది..?
  • రామాయణం నాకు ఎక్కడ నచ్చింది..? ఎక్కడెక్కడ నచ్చలేదు..?
  • సల్మాన్ ఖాన్.., ముక్తిధామ్ గుడికొచ్చి క్షమాపణ చెప్పు… మన్నిస్తాం..!!
  • రామాయణం… ఓ గ్రాండియర్..! మహారాజసం… పాన్-వరల్డ్ వైభవం !!
  • ఈ ఇంగ్లిష్ వేరు..! పదాలు సేమ్- సందర్భాన్ని బట్టి వ్యక్తీకరణే వేర్వేరు..!!
  • ఓ వైరల్ పోస్టు- అంబానీల ఫోటోలు- సంధించిన ఓ విలువైన ప్రశ్న!!
  • హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత అంత పెద్ద నేరమా..?!
  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions