.
ఇప్పటిదాకా రామాయణ మూవీపై వచ్చిన వివాదాల్ని, విమర్శల్ని డిలిట్ కొట్టేయండి కాసేపు… గతంలో ఇండియన్ సినిమా దర్శకులు అనేకమంది తీసిన సినిమాలు చూసిన అనుభవాల్ని కూడా మరిచిపొండి కాసేపు… దేనితోనూ పోలిక వద్దు… ప్రిజుడీస్ మైండ్‌తో కాదు, ఓపెన్ మైండ్‌తో… థియేటర్‌కు వెళ్లండి… అత్యధిక ఖర్చుతో నిర్మించిన ఈ ఇండియన్ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు… అక్షరాలా పాన్- వరల్డ్ సినిమా…
త్రీడీ బెటర్, డాల్బీ బెటర్, బిగ్ స్క్రీన్ బెటర్. ఐమ్యాక్స్ బెటర్… ఏ హైఫై హాలీవుడ్ సినిమాకూ తీసిపోదు… మన పౌరాణికాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న సినిమా… ప్రచారం చేస్తున్న సినిమా… తలెత్తుకుని, కనులు విప్పార్చి చూడండి… అవును, గ్రాండియర్… వైభవంగా, రాజసంగా ఉంది సినిమా…
Ads

రణబీర్ రాముడిగా బాగున్నాడు… సాయిపల్లవి కూడా సీతగా బాగానే ఉంది… ఇక యశ్… సినిమాలో విశ్వరూపం తనది… ప్రతినాయక పాత్రలో అదరగొట్టాడు… అందరినీ డామినేట్ చేశాడు… విచిత్రంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ కూడా సరిగ్గా కుదిరింది ఆ పాత్రకు… శోభన, అరుణ్, రవి దూబే, లారా దత్తా తదితరులు తమకు అప్పగించిన పాత్రల్లో సరిగ్గా అమిరారు… పాపం, కాజల్ తప్ప…
ఇంతగా ఎందుకు చెప్పుకోవడం అంటే… కనులవిందు కాబట్టి… ఎన్నెన్నో వందల తరాలుగా తెలిసిన కథే… చిన్నప్పటి నుంచీ వినీ వినీ మెదడు పొరల్లో నిక్షిప్తం అయిన కథే… కానీ వర్తమాన, అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి, ఎంత గొప్పగా ప్రజెంట్ చేశారనేదే ఇక్కడ ప్రధానం… అందులో నిర్మాత- దర్శకులు ఫెయిల్ కాలేదు…

మన తెలుగులోనే బోలెడు రామాయణ సినిమాలు వచ్చాయి… ఒకరిని మించి మరొకరు కొత్తగా ప్రజెంట్ చేశారు… వాటితో పోలిక అక్కర్లేదు… ఈ రామాయణం ఖచ్చితంగా ప్రజెంట్ తరానికి తగిన కావ్య సమర్పణ… యాక్షన్ సీన్లు బాగున్నాయి… అసురుల యాక్షన్ సీన్లు కొన్ని ఇంగ్లిష్ సినిమాలను తలపించినా సరే, బాగున్నాయి…
అన్నింటికన్నా హైలైట్ జటాయువు సీన్లు… ఏ హాలీవుడ్ సినిమాకు తక్కువ లేదు… ఈ ధగధగల వెనుక కొంత నిరాశ కలిగించే చీకటి సంగీతం… కాదు, హన్స్ జిమ్మర్ సమకూర్చిన బీజీఎం సినిమా రేంజ్‌కు తగినట్టు బాగుంది… ఎటొచ్చీ రెహమాన్ పాటలే నిరాశపరుస్తాయి… పాపం, దర్శకుడు తనదైన చిత్రీకరణతో కవర్ చేయాలని ప్రయత్నించాడు గానీ నాట్ ఇంప్రెసివ్… ‘ముందు విమర్శిస్తారు, తరువాత మెచ్చుకుంటారు’ అని రెహమాన్ ఏదో కవర్ చేసుకున్నాడు మొన్న… కానీ తప్పు… మెచ్చుకునేంత సీన్ ఏమీ లేదు పాపం…

బీజీఎం జిమ్మర్‌కు వదిలేసి, ఏ కీరవాణితోనో పాటలు చేయించుకుంటే బాగుండేది అనిపిస్తుంది… ఇక గ్రాఫిక్స్ వర్క్ గురించి చెప్పటానికి ఏముంది..? టాప్ రేంజ్… అసలు నిర్మాతల ఒరిజినల్ వృత్తే అది కదా… ఈ రోజుల్లో 3 గంటల నిడివి, అక్కడక్కడా స్లో అనిపించినా… పర్లేదు… పెద్దగా విసిగించదు… సినిమాటోగ్రఫీ బాగుంది… ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది…
మరీ హిందీ నుంచి తెలుగులోకి డబ్ చేసినట్టు గాకుండా… తెలుగులోనే పాత్రధారులు పలుకుతున్నంత సహజంగా టెక్నాలజీతో లిప్ సింకింగ్ చేశారు… కుదిరింది… ఈ మొదటి భాగం సీతాపహరణం వరకు మాత్రమే… రాముడు, రావణుడి కథల్ని సమాంతరంగా నడిపిస్తాడు దర్శకుడు..!! రెండో భాగానికి లీడ్ కూడా బాగానే ఉంది…!!
చివరగా… పిల్లలకు చూపించండి… వాళ్లు ఇష్టపడే గ్రాఫిక్స్‌తో… వాళ్లకు మన సాంస్కృతిక ఇతిహాసం పరిచయం చేయండి… అదీ గ్రాండ్‌గా… ఇది ఆదిపురుష్ వంటి పరమనాసిరకం కాదు… అది మాత్రం గ్యారంటీ..!!
Share this Article