దేత్తడి హారికను ఒక కోణంలో మెచ్చుకోవచ్చు…. తనను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై వచ్చిన వివాదం, విమర్శలపై మొన్న మీడియాతో మాట్లాడినప్పుడు… ఎక్కడా ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు… ‘‘ఇలాంటి ఆటుపోట్లు వస్తూనే ఉంటయ్’’ అని స్పందించింది… అయితే ఈ వివాదం చినికిచినికి గాలివాన అయిపోయింది… ప్రభుత్వ ముఖ్యుల అహాలు దెబ్బతిన్నయ్… చివరకు ఈ తగాదా పెంట పెంట అయిపోతుండేసరికి బుధవారం రాత్రి ఈ వివాదానికి తనే ముగింపు పలికింది… తనే ఫైనల్ ట్విస్ట్ ఇచ్చేసి, ఫుల్ స్టాప్ పెట్టేసింది… ఇప్పుడు కూడా ఎక్కడా పొల్లుమాట లేదు… ‘‘నేను ఆ పోస్టు నుంచి డ్రాప్ అవుతున్నాను…’’ ఎవరినీ తప్పుపట్టలేదు… వివాదం లోతుల్లోకీ వెళ్లలేదు… గుడ్… అయితే తనంతట తనే డ్రాప్ అయ్యిందా..? కావల్సి వచ్చిందా..? సపోర్ట్ దొరకలేదా..? ఎవరి ఇగో పాలిటిక్స్‌కు చివరకు బాధితురాలిగా మిగిలిపోయింది..? అవమానానికి గురైంది..? అవన్నీ యక్షప్రశ్నలు… కానీ హారిక ఎపిసోడ్ మరికొన్ని ప్రశ్నలకు మన ముందుంచుతోంది…
Ads
- నా నిర్ణయం కాదు అంటాడు కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా… అసలు హారిక ఎవరో నాకు తెలియనే తెలియదు అంటాడు సంబంధిత మంత్రి శ్రీనివాస్ గౌడ్… ఏమిటీ నియామకం అని గుస్సా అయిపోతుంది సీఎంవో… మరి ఎవరు నియమించినట్టు ఆమెను.? ఎవరిది నిర్ణయం..?
- తమ కార్పొరేషన్‌కు ఓ బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకునే అధికారం ఆ కార్పొరేషన్‌కు లేదా..? ఈ విషయాన్ని కూడా మంత్రికి చెప్పాలా..? అనుమతి తీసుకోవాలా..? ఇలాంటి నిర్ణయాలూ మంత్రిత్వ శాఖ చెబితేనే జరగాలా..? మరిక కార్పొరేషన్ దేనికి..? ఆంజనేయరెడ్డి సమయంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంత డైనమిక్, డేరింగ్ నిర్ణయాలు తీసుకున్నదో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి… ఓ కార్పొరేట్ కంపెనీ రేంజ్లో నడిపించాడు ఆయన…
- పోనీ, సదరు కార్పొరేషన్ అధికారగణమైనా సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వాలి కదా… ఓ ఫార్మల్ అనుమతి కోసం అడగొచ్చు గదా… మంత్రి కూడా హారిక ఎవరో నాకు తెలియదంటూ చేసిన వ్యాఖ్య సరిగ్గా లేదు… ఆగ్రహమో, దిద్దుబాటో లోలోపల సాగితే సరిపోయేది…
- అప్పుడే సీఎంవో ఆగ్రహం అన్నారు… వెంటనే మంత్రి ఆగ్రహం అన్నారు… ఆమెను తీసేశారు, వెబ్సైటులో ఆమె వివరాలు డిలిట్ చేశారు అన్నారు… తరువాత హరిత హోటళ్లకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ అన్నారు… చివరకు ఏమైందో గానీ… ఆమే తప్పుకుంది… మన సిస్టం ఎలా పనిచేస్తున్నదో… హారిక ఎపిసోడ్ కళ్లకుకట్టింది… పెద్దల అహాలు ఎలా కొట్లాడుకుంటాయో కూడా తెలిసొచ్చింది…
- అవునూ… ఇంతకీ ఈ ఫైనల్ ట్విస్ట్ వెనుక ఏం జరిగింది..? మంత్రి పంతమే నెగ్గడానికి కారణం ఏమిటి..? కార్పొరేషన్ చైర్మన్ తన నిర్ణయాధికారాన్ని సమర్థించుకోలేకపోయాడా..? తనకు ఏ సపోర్టూ దొరకలేదా..? నిజంగానే ఒక ప్రభుత్వ కార్పొరేషన్ కార్యవర్గానికి ఉన్న అధికారాలు ఏమిటి..? పరిధులు ఏమిటి..? అసలు ఏమైనా ఉన్నాయా..? నామ్కేవాస్తే ప్రొటోకాల్ పోస్టేనా..? ఈ ప్రశ్నలు కూడా హారిక ఎపిసోడ్ అంత క్లిష్టమైనవి… అసలు జవాబులే లేనివి కూడా…!!
Share this Article