జగన్ రాజకీయ పాచికలు తన చుట్టూ తిరిగేవాళ్లకు కూడా అనేకసార్లు అంతుపట్టవు… సైలెంట్ ఆపరేటర్… అబ్బే, షర్మిల పార్టీ గురించి కాదు… సుబ్రహ్మణస్వామిని ఏవిషయానికి సంబంధించి రంగంలోకి దింపాడు..? ఇది బీజేపీకి, ఆంధ్రజ్యోతికి మాత్రమే కాదు… ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం వర్గాలకూ అంతుచిక్కడం లేదు… నిజం చెప్పాలంటే జగన్ కోటరీకే సరిగ్గా తెలియదు… అప్పుడెప్పుడో 16 నెలల క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక స్టోరీ మీద 100 కోట్ల పరువు నష్టం కేసు వేయడం కోసం స్వామి ఇక్కడి దాకా వచ్చాడంటే ఎవరూ నమ్మడం లేదు… నమ్మబుల్‌గా లేదు కూడా…! అయితే ఎందుకు వచ్చాడు మరి..? ఈ ప్రశ్నకు జవాబు ఎవరికీ తెలియదు… ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం కేసు వేయడానికి అంతటి స్వామి ఏమీ అక్కర్లేదు… టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తమ టీటీడీ లీగల్ కౌన్సిల్‌తోనే టాకిల్ చేయగలడు… తనకు పెద్ద ఇష్యూ కాదు అది… పోనీ, కేంద్రానికీ జగన్‌కూ మధ్యవర్తిత్వం వహించే సీన్ స్వామికి లేదు… మోడీ అండ్ కో తనను ఏమాత్రం విశ్వాసంలోకి తీసుకోదు… మోడీ క్యాంపు దృష్టిలో తను లిటిగెంట్… మరి ఎవరికీ అంతుచిక్కని ఆ ఆపరేషన్ ఏమై ఉంటుందబ్బా..? మెదడుకు మేత…
మొన్న, నిన్న ఆంధ్రజ్యోతి స్వామి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంది… నాటి వార్తలో మేం చేసిన తప్పేమిటి అనడుగుతోంది… నిజమే, ఈ వీర వెంకటేశ్వర భక్తుడికి ఒక్క ఆంధ్రజ్యోతి వార్తే అభ్యంతరకరంగా కనిపించిందా..? అదీ తెలుగులో వచ్చిన వార్త…! వాస్తవానికి లోకల్ బీజేపీ నేతలే జుత్తు పీక్కుంటున్నారు ఈ స్వామి వైనం అర్థం గాక..! ఆంధ్రజ్యోతి అంటే జగన్‌కు కోపం ఉన్నమాట నిజమే కావచ్చు గాక… కానీ దానిపై పరువు నష్టం కేసులు వేయాల్సి వస్తే రోజుకొకటి వేయాలి తను… పోనీ, 16 నెలల క్రితం నాటి వార్త ఆంధ్రజ్యోతి సృష్టి ఏమీ కాదు… సోషల్ మీడియా రాసింది… దానిపై బీజేపీ నాయకులు స్పందించారు… ఇష్యూ అయింది… దాన్నే జ్యోతి రిపోర్ట్ చేసింది తప్ప కావాలని ఏదీ క్రియేట్ చేయలేదు కదా… ఆ తరువాత కూడా చాలా అంశాల్లో టీటీడీపై జ్యోతి వార్తలు రాసింది… ఇతర పత్రికలూ రాశాయి… టీటీడీ సుబ్బారెడ్డి కూడా వివరణలు ఇచ్చాడు… అంతెందుకు..? అన్యమతప్రచారాలు, టీటీడీలో అన్యమతస్తులు, ఆస్తుల అమ్మకం వంటివి టీటీడీపై వార్తలు వస్తూనే ఉంటయ్… ఐనా అంతకుముందు సాక్షి రాయలేదా చంద్రబాబు హయాంలో..? దీక్షితులు, సాయిరెడ్డి మీద పరువు నష్టం కేసులు కూడా వేశారు కదా అప్పట్లో… అప్పటికింకా ఈ సుబ్రహ్మణ్యస్వామి వెంకటేశ్వర భక్తుడు కాలేదా..? అవునూ, పాత పరువు నష్టం కేసు ఏమైనట్టు..? ఇప్పుడు తాజాగా మళ్లీ ఈ కేసుకు సంబంధించి భక్తుల సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుందా..? సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే… మరి స్వామిని ఆగమేఘాల మీద ఎందుకు రప్పించినట్టు..? జగన్ వేస్తున్న పాచిక ఏమిటి..? రాజకీయమా..? ఆర్థికమా..? ఏమై ఉంటుందబ్బా..?! బాబు గారూ… ఏమైనా ఉప్పు అందిందా..?!
Ads
Share this Article