Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం సార్… సినిమా టికెట్ల రేట్లను మార్కెట్‌కు వదిలేస్తే పోలా..!!

November 30, 2024 by M S R

.

మార్కెట్‌లో కిలో బియ్యం ధర ఎంత..? రేషన్ బియ్యం జస్ట్, కిలోకు రూపాయి… అన్నపూర్ణ కార్డు ఉంటే ఫ్రీ… బయట కావాలన్నా 11 రూపాయలు ధర…

సన్నబియ్యం సోనా మశూరి కావాలంటే 55, సుగర్ ఫ్రీ అనే డొల్ల ప్రచారమున్న బియ్యమైతే 70, 80… జైశ్రీరాం, హెచ్‌ఎంటీ అయితే ఒక ధర… లాంగ్ గ్రెయిన్ ఒక ధర, బాస్మతి మరో ధర… బ్రాండ్‌ను బట్టి వేర్వేరు… చివరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే బ్లాక్ రైస్ ఎట్సెట్రా మరీ అధికాధికం…

Ads

అది మార్కెట్ కొనేవాడి స్థోమత, అవసరం, అమ్మేవాడి ధర… కదా… మార్కెట్‌లో ఏ సరుకైనా అంతే కదా… విద్య, వైద్యం, నివాసం ఎట్సెట్రా అన్నీ… మరి సినిమా టికెట్లకు ఎందుకు పరిమితులు, అనుమతులు..?

ఎంచక్కా అదీ మార్కెట్‌కే వదిలేస్తే పోలా..? ఎలాగూ సినిమా సిండికేట్లకు ప్రజాప్రయోజనం అనే కోణం ఎప్పుడూ పట్టదు… సినిమా సీన్ల దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా… డబ్బులు తప్ప మరో యావ లేదు… మరెందుకు ప్రత్యేకంగా సినిమా టికెట్ల రేట్లకు ఈ పెంపుదల జీవోలు… జనం కళ్లకు గంతలు కట్టడానికా..?

రేవంత్ రెడ్డి సర్కారుకు నిజంగానే పలు విషయాల్లో ఓ దిశ ఓ దశ లేనట్టు కనిపిస్తోంది… మరీ రాబోయే పుష్ప-2 సినిమాకు ఇచ్చిన రేట్ల పెంపు హాశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి…

డిసెంబర్ 4 న 9:30 PM షో టికెట్ రేట్లు… సింగిల్ స్క్రీన్స్ – రూ.1121 …. మల్టీప్లెక్స్ – రూ.1239 … దారుణం… ఎంచక్కా 1200, 1500 చేసేస్తే బెటర్ కదా సర్కార్… ఎలాగూ సినిమా సిండికేట్లకు దాసోహం అంటున్నప్పుడు ఇంకా మనకు వ్యవస్థలు, సిస్టమ్స్ అవసరమా…

ఒక స్మగ్లర్ హీరోయిన్‌ను, సమాజాన్ని ఐటమ్ సాంగ్స్‌తో, తనదైన స్మగ్లింగ్ తెలివితోె ఉద్దరిస్తాడు… మనం ఇలా వేలకువేలు తగలేసి కనీసం ఓ వెయ్యి కోట్లు అర్జెంటుగా తగలేయాలి… అంతేకదా…

అందుకే అనేది… మార్కెట్‌కు వదిలేయండి… చూసేవాడు చూస్తాడు… మీకెందుకు నడుమ రేట్ల పెంపు జీవోలు… సాధికారికంగా దోపిడీకి అనుమతులు… నాలుగు షోలకు మించి ప్రత్యేక షోలు ఏమిటి…? ప్రత్యేకంగా మళ్లీ ఈ బెనిఫిట్ షోల పరమార్థం ఏమిటి..?

ఆ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్… దెబ్బలు పడతయ్‌రో అని… అలా అనేవాళ్లు లేకనే కదా ఈ అరాచకం..? కనీసం ఇలాంటి విషయాల్లోనైనా కాస్త పీపుల్స్ గవర్నమెంట్ అనుకునేలా కాస్త కవర్ చేయండి సార్, నటించండి సార్… చూస్తే చూస్తారు, పిచ్చి ఉన్నవాడు చూస్తాడు, నడుమ మనకు ఏం నొప్పి అంటారా..? కరెక్టే… అందుకే మరోసారి……. మార్కెట్‌కు వదిలేయండి… నడుమ మీకెందుకు ఈ స్పెషల్ పర్మిషన్ల తలనొప్పి..!?

అవునూ, ఏపీలో అసలే మెగా హీరో పవన్ కల్యాణే డిప్యూటీ చీఫ్ మినిస్టర్… కానీ మెగాకూ బన్నీకీ నడుమ వార్ నడుస్తోంది… అక్కడ ఏం రేట్లు ఇస్తారో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మస్క్ ఓటమి- సోరోస్ గెలుపు… ఇండియాపై మిడ్ టరమ్ ప్రభావమెంత..?
  • New Alchemy – పరుసవేది – నిజంగానే పాదరసం బంగారం అవుతుందా?!
  • మనిషిని వెతుక్కుంటూ వెళ్లిన కుక్క… మనసును తాకే రెండు కథలు!
  • ‘Congestion Tax’…! A New Lesson for Hyderabad from New York..!!
  • ‘రద్దీ పన్ను’…! హైదరాబాద్‌కు న్యూయార్క్ చెప్పే ఓ కొత్త పాఠం !!
  • ఆన్‌లైన్‌లో ఏదో కొరియర్ ఆర్డర్ ఇచ్చి… దావూద్ ‘డ్రగ్స్ హ్యాండ్’ దొరికాడు…
  • పాకిస్థాన్ శునకానందం ! ఇండియాను గెలిచేసినట్టు ఓ ఫేక్ సంబురం !!
  • Ten Heads, Ten Minds: A Masterstroke or a Cinematic Mess?
  • పది తలలకు పది వేర్వేరు వ్యక్తిత్వాలట… పదింతల వెర్రితనం !!
  • ట్రంపరికి ఎదురుగాలి… ట్రెండ్స్‌పై అమెరికన్ మీడియా విశ్లేషణ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions