మండలి రద్దు, పార్లమెంటు వోకే చెప్పాలి……… నో, చెప్పలేం, చెప్పబోం
స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డకు షాక్ ఇవ్వాలి…. నో, ఇవ్వలేం, ఇవ్వబోం
ప్రత్యేక హోదాపై ఓ క్లారిటీ ఇవ్వాలి… నో, హోదా ప్రసక్తే లేదు. ఇవ్వలేం
Ads
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు… నో, అమ్మేసి తీరతాం, రాజీ పడబోం
…… కనీసం ఆ జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం చీఫ్ జస్టిస్ కానివ్వొద్దు, తన ప్రభావం మా హైకోర్టు మీద విపరీతంగా ఉంది, భూముల స్కాములు మన్నూమశానం చాలా ఉన్నయ్……… నో నో, సారీ, మన తదుపరి చీఫ్ జస్టిస్ రమణే…. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బాబ్డే కూడా ఆయన పేరే ప్రతిపాదించాడు…
.
.
అంటే..? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా ఒక సుప్రీం కోర్టు జడ్జి మీద చేసే ఫిర్యాదులకు విలువ లేదా..? విచారణలుండవా..? పైగా కిరీటాలు పెడతారా..?……… ఇదేనా మీ ప్రశ్న..? ‘‘జగన్, బీజేపీ ఒకటే… కేంద్రంలో మోడీకి జగన్ మద్దతు… రాష్ట్రంలో జగన్కు ఇబ్బందుల్లేకుండా మోడీ మద్దతు…’’ ఇవే కదా ఇన్నేళ్ల ప్రచారాలు, కనిపించే దృశ్యాలు… అంతేనా..? అది నిజమేనా..?……….. కాదు… అంతకుమించిన పొలిటికల్ సమీకరణాలు నడుస్తుంటయ్… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీయే కదా… తన వ్యూహాలు తనకుంటయ్…
హమ్మా, అంతదాకా వచ్చారా..? మా సపోర్ట్ అవసరం లేదా మీకు..? రానీ, రేప్పొద్దున పార్లమెంటులో ఏదైనా కీలక బిల్లు రానీ, చెబుతా మీ సంగతి…….
వోకే జగన్, నీ ఇష్టం… మాకు వ్యతిరేకంగా వెళ్తావా..? వెళ్లు, మేం వద్దన్నామా ఏం..? నువ్వూ కేసీయార్ కలిసి గత ఎన్నికల ముందు ఏం చేశారో… మేఘా డబ్బులు ఏయే మార్గాల్లో ఎవరికి వెళ్లాయో… ఇప్పటికీ స్టాలిన్, కుమారస్వామి తదితరులు ఏం చేస్తున్నారో, మీతో సంబంధాలు ఏమిటో అన్నీ తవ్వుదాం, సరేనా…? అవునూ, నీ బెయిల్ రద్దు గురించి ఈడీ, సీబీఐ బాగా పట్టుపడుతున్నాయి మాస్టారూ, ఏం చేద్దామంటావ్…? వోకే, వోకే… చంద్రబాబు మరీ నొటోరియస్, మాకు తెలుసు, నయాపైసా క్రెడిబులిటీ లేని మనిషి, మాకు తెలుసు, తనను పైసా కూడా నమ్మలేం, మాకు తెలుసు…. బట్, అవన్నీ నీకు టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ కావు కదా…
జస్టిస్ ఎన్వీ రమణ మీద నేను కంప్లయింట్ చేశాను, ఎంక్వయిరీ ఆశించాను, మీరేమో ఏకంగా చీఫ్ జస్టిస్ చేయడానికి వోకే అంటే, రేప్పొద్దున తను నాపై కక్షకడితే ఎలా సారూ..? ………..
కథ రక్తికడుతుంది మిత్రమా… ప్రొటోకాల్, ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం… ఏపీలో జగన్ బీజేపీయే కాదు, బాబు బీజేపీ కూడా ఉంది కదా… పైగా మా పవన్ సరేసరి… రకరకాల వైరుధ్యాలు… ఏపీలో మాకు పైసా ప్రయోజనం లేదు, పైసాకు పనికొచ్చే నాయకుడు కూడా లేడు… కథ ఇలా కొన్నాళ్లు నడవనీ, చూద్దాం…….
అంటే..? చంద్రబాబు ప్రణాళికలు, వ్యూహాలు మాత్రమే పనిచేస్తున్నాయా..? మరి నా అధికారం దేనికి ఇక..? మీకు బేషరతు మద్దతు ఎందుకివ్వాలి…?……….
చంద్రబాబు మీద కూడా మా ప్రణాళికలు మాకున్నాయి..? కాస్త ఓపిక పట్టు జగన్… రాజకీయాలు అంటేనే అనేక సంక్లిష్టతల సమీకరణాలు… చీఫ్ జస్టిస్ అయినంతమాత్రాన రేప్పొద్దున అవసరమైతే అభిశంసనకు అతీతుడేమీ కాదు కదా… చూద్దాంలే… చూద్దాంలే… ఇప్పటికి ఇలా కానిద్దాం,…!!
Share this Article