నిన్న చెప్పుకున్నాం కదా… తెలుగు మీడియా వార్ చివరకు సంపాదకీయాలు, సంపాదక పేజీ వ్యాసాల దాాకా విస్తరించిందని..! సంపాదకులకు రంగులు పూసేదాకా వెళ్లిపోయింది పరిస్థితి… తెలంగాణ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ పట్టభద్రులకు కొమ్ములు ఉంటాయా అని రాసుకొచ్చాడు… దానికి నమస్తే తెలంగాణలో పట్టభద్రులకు కొమ్ములుంటయ్ అని కౌంటర్ రాయించారు… ఈ కౌంటర్ల పంచాయితీ ఏమిటో, తెలుగు మీడియాలో ఈ వార్ నేపథ్యమేమిటో ‘ముచ్చట’ నిన్నటి కథనంలో చెప్పింది… ఈ పంచాయితీలోకి మరో మాజీ సంపాదకుడు తెలకపల్లి రవి దూరాడు తాజాగా… ప్రజాశక్తిలో శ్రీనివాస్‌కు బోలెడు రంగులు పూస్తూ సుదీర్ఘ వ్యాసం ఒకటి వదిలాడు… ఆయన బాధేమిటీ అంటే..? ‘‘ఈయన బీజేపీ గెలవనందుకు తెగబాధపడిపోయాడు… ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా..? మతతత్వ శక్తులపై ఇదేం అనుకూల ధోరణి..? ఆయ్ఁ తప్పు కదా…’’ అంటాడు… టీఆర్ఎస్ గెలిస్తే గెలిచింది, మేం ఓడిపోతే పోయాం, కానీ బీజేపీ రెండు చోట్ల ఓడిపోయినందుకు సంతోషిచాలి కదా అనేది ఈయన సుదీర్ఘ వ్యాస సారాంశం… అంతేకాదు, సదరు శ్రీనివాస్ బీజేపీ అనుకూలుడు అనే రంగు పూసేశాడు… ఫాఫం, తన మీద పడిన ఈ రంగు చూసి ఈ హోళీ వేళ శ్రీనివాస్ బాధపడుతుంటాడు…
ఇక్కడ తెలకపల్లి రవికి వచ్చిన అభ్యంతరమేమిటో అర్థం కాదు… శ్రీనివాస్ విశ్లేషణ అది… రెండో స్థానం దాకా వచ్చారు బీజేపీ రాంచందర్, కోదండరాం… ఇంకాస్త లాక్కొస్తే అధికార పార్టీ ఓడిపోయి, ప్రశ్నించే శక్తులు గెలిచేవి కదా అనేది శ్రీనివాస్ వ్యాసంలోని అసలు అర్థం… ఆ ఫీలింగ్ చాలామందిలో ఉంది… నో, నో, తప్పు, బీజేపీ అభ్యర్థి గెలవాలని కోరుకోవడం ఏమిటి అని నిలదీస్తాడు తెలకపల్లి..? కోరుకుంటే తప్పేమిటి అనేది ఇక్కడ అసలు ప్రశ్న… ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక సంపాదకుడు, రెగ్యులర్ కాలమిస్ట్, రాజకీయ పరిణామాల పరిశీలకుడు తన భావాల్ని, అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తే, అందులోనూ తూట్లు వెతకడం ఏమిటి..? ఏమీ రాయనివ్వరా..? రాయొద్దా..? నిజానికి శ్రీనివాస్ బీజేపీవాది కాదు… ప్రోగ్రెసివ్ పెన్… పోనీ, ఇదే సీపీఎం ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇదే బీజేపీపై ఎందుకు సీరియస్ పోరాటం చేయలేకపోయింది..? తీన్మార్ మల్లన్న గానీ, కోదండరాం గానీ బీజేపీ మీద విరుచుకుపడలేదు, ప్రత్యర్థిత్వం చూపలేదు అని నిందిస్తున్నాడు తెలకపల్లి… సీపీఎం ఏం చేయగలిగింది..? పోలింగ్‌కు ముందు నాగేశ్వర్లోని దూకుడు ఎందుకు చల్లబడింది..? వరంగల్, ఖమ్మం సరే, నల్గొండలో సీపీఎం పునాదులు బలమైనవే కదా, మరి ఆ స్థానంలో సీపీఎం సాధించిన వోట్లు ఎన్ని..? ఈ స్థితిలో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థులుగా బలంగా తెరమీదకు వచ్చిన కోదండరాం గానీ, బీజేపీ రాంచందర్ గానీ గెలవాలని కోరుకుంటే తప్పేముంది..?
Ads
నమస్తేలో వచ్చిన మరో వ్యాసం మీద కూడా ఇదేతరహా విమర్శ… చీమ తలకాయంత ఆత్మవిమర్శ లేదూ అని నింద… ఆ పత్రిక పరిమితే అది… అందులో ప్రతి అక్షరమూ కేసీయార్ భజన చేయాల్సిందే… ప్రజాశక్తి అక్షరాలు సీపీఎంకు డప్పు కొట్టినట్టే…! మరిక ఆత్మవిమర్శ ఎలా సాధ్యం..? దానికి కాలమిస్టును నిందించడం దేనికి..? పైగా ప్రతిపక్షాల్లో ఉన్న మనం తన్నుకుందాం, అధికార పార్టీ పదిలంగా ఉన్నా సరే… అన్నట్టుగా ఉంది సీపీఎం తీసుకున్న రాజకీయ ధోరణి… ఇలాంటిదే బెంగాల్లో నిండా ముంచేసింది… అయితే… ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యే రాతలపై తెలకపల్లి రవి తన అభిప్రాయాన్ని చెప్పడాన్ని తప్పుపట్టడం లేదు ఇక్కడ… కాకపోతే ఆ రాతగాడికి రంగులు పూసిన తీరే బాగున్నట్టు లేదు…!!
Share this Article