సేమ్, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో పీవీ బిడ్డ వాణిదేవి ఎంపికలాగే… నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలోనూ కేసీయార్ తెలివైన ఎత్తుగడ వేశాడు… నోముల నరసింహయ్య కొడుకు భగత్ ఎంపిక కేసీయార్ కోణం నుంచి కరెక్టు… 1) మరీ దుబ్బాకలో రామలింగారెడ్డి భార్యకు పెద్దగా చదువు లేదు, మాట్లాడలేదు, ఆమెను పక్కన నిలబెట్టుకుని, హరీష్‌రావు తనే పార్టీ అభ్యర్థి తనే తరహాలో కష్టపడాల్సి వచ్చింది… కానీ సాగర్‌లో భగత్ B.E., M.B.A., L.L.B, L.L.M… ఆల్రెడీ రాజకీయ వ్యవహారాలు, ఎన్నికల కథలు తెలిసినవాడే… 2) నియోజకవర్గంలో యాదవుల వోట్లు ఎక్కువ… కులం కోణంలో జానారెడ్డికి పోటీ అంటే యాదవులే… 3) ఎంతోకొంత నరసింహయ్య మరణం తాలూకు సానుభూతి… 4) పాత లెఫ్ట్ సానుభూతిపరులు… నిజానికి ఇవి కూడా కావు… కేసీయార్ వ్యూహం ఎప్పుడూ డబుల్ ఎడ్జ్… 1) ఒకవేళ భగత్ గెలిస్తే గుడ్, మాకు తిరుగులేదు అని చెప్పుకోవచ్చు, మా పాలనకే తెలంగాణ సమాజం వోటు అని చెప్పుకోవచ్చు… సీటు నిలబెట్టుకున్నట్టు అవుతుంది… 2) ఒకవేళ జానారెడ్డి గెలిస్తే… ఇంకా గుడ్, పెద్దలు జానారెడ్డి గారే కదా… మన ఆత్మీయుడు, పైగా రాష్ట్రంలో బీజేపీ దూకుడు తగ్గాలంటే కాంగ్రెస్ కాస్త బలపడాలి… మన ప్రధాన ప్రత్యర్థి మరీ బలహీనంగా ఉన్నా కష్టమే… 3) జానారెడ్డి గెలిస్తే పీసీసీలో మళ్లీ తన ప్రాబల్యం పెరుగుతుంది, రేవంత్‌రెడ్డి పీసీసీ అవకాశాలు మరింత మూసుకుపోతాయి… అదీ కేసీయార్‌కు ఆనందమే కదా…
సో, ఏ కోణం నుంచి చూసినా కేసీయార్‌కు భగత్‌ను బరిలో దింపడమే సరైన చాయిస్… నిజానికి తనెప్పుడో ఫిక్సయ్యాడు.., కానీ, కావాలని ఏవేవో పేర్లు ప్రచారంలో పెట్టేసి… మరీ ఓ దశలో వాణీదేవిని మండలి ఛైర్మన్‌ను చేసేసినట్టు, గుత్తా సుఖేందర్‌రెడ్డిని సాగర్ బరిలో దింపుతున్నట్టు కూడా ప్రచారాలు సాగించారు… ఇక కాంగ్రెస్ కోణం పరిశీలిస్తే జానారెడ్డిని మించిన చాయిస్ లేనేలేదు… తను పార్టీ మారుతున్నట్టు, కొడుకును టీఆర్ఎస్లోకి పంపుతున్నట్టు, కొడుకే నిలబడనున్నాడని మొదట్లో ప్రచారం… తరువాత బీజేపీలోకి జంప్ అవుతున్నట్టు ప్రచారం… ఇప్పటికీ జానారెడ్డి పట్టు తెలంగాణ కాంగ్రెస్ మీద తక్కువేమీ కాదు… అందులోనే కొనసాగడానికి ఫిక్సయ్యాడు, మళ్లీ తనే నిలబడుతున్నాడు… గెలిస్తే తన ప్రాధాన్యం పెరుగుతుంది… ఇజ్జత్ వెలుగుతుంది… ఓడితే కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు… పైగా పార్టీ సపోర్ట్ పెద్దగా ఉన్నా లేకపోయినా సరే వ్యక్తిగతంగా మంచి పోటీ ఇవ్వగలడు… టీఆర్ఎస్ తన సాధనసంపత్తిని మొహరిస్తుందని తనకూ తెలుసు… ఐనాసరే తను ఢీకొట్టగలడు బలంగానే…
Ads
ఎటొచ్చీ బీజేపీకే ఓ వ్యూహం అంటూ లేకుండా పోయింది… నిజానికి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత పార్టీలో ఓరకమైన స్తబ్దత వచ్చింది ఎందుకో… అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూలంగా పనిచేసింది… వరంగల్ స్థానంలో మరీ ఆ స్థాయి ఓటమి పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది… పార్టీలో అంతఃకలహాలు ఇలాగే ఉంటే పార్టీ మరింత నష్టపోవడం ఖాయం… తెలంగాణ మీద కన్నేసిన బీజేపీ హైకమాండ్ చేతులు ఇంకా కాలిపోవడమూ ఖాయం… సాగర్‌లో నిజానికి ఓ ఎస్టీ అభ్యర్థిని గనుక పెట్టి ఉంటే పార్టీకి బాగా ప్లస్ అయ్యేది… గెలుపు, ఓటమి అని కాదు… స్థూలంగా రాష్ట్ర పార్టీకి ఉపయోగకరం అయ్యేది… ప్రస్తుత అభ్యర్థి నివేదితకు గతంలో పోటీచేస్తే చాలా చాలా తక్కువ వోట్లు వచ్చాయి… చెప్పుకునే రేంజ్ వోట్లు కూడా కావు… మళ్లీ ఆమెనే నిలబెట్టడం కులం కోణంలో ఎక్కాలు తప్పిన లెక్క… వాస్తవంగా రవి నాయక్ అని ఓ అభ్యర్థి గురించి ఆలోచించారు కూడా… ఎక్కడ ఎవరి రాజకీయం పనిచేసిందో, ఏమైందో గానీ మళ్లీ నివేదితే ఫైనలైంది… ఆల్రెడీ బాపూరావు ద్వారా ఆదివాసీల్లోకి పార్టీ సింక్ అవుతోంది… సాగర్ ఎంపికపై కాస్త తెలివిగా అడుగులేస్తే బంజారాలను కూడా చేరదీసినట్టయ్యేది… ఎస్సీ, ఎస్టీల వోట్లు కూడా ఎక్కువే… బీజేపీ తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లోకి బాగా వెళ్లగలిగితేనే దానికి భవిష్యత్తు… కేవలం కాపు అనే ఫ్యాక్టర్ బీజేపీని పరుగులు పెట్టించదు… సాగర్‌లో ఒక అవకాశాన్ని వదిలేసింది… దాని వ్యూహరాహిత్యాలు ఇలాగే ఉంటే రాష్ట్రం మీద ఆశలు పెంచుకోవడం దండుగ… కాదు, దండుగన్నర…!! తాజాకలం : బీజేపీ అభ్యర్థిత్వంలో ఊహించని మార్పు… ఆ స్టోరీ ఇక్కడ చదవండి….
Share this Article