సాధారణంగా ముఖ్యమంత్రి ఎటైనా వెళ్లాలంటే..? మొత్తం ఆ రూట్లో ట్రాఫిక్ నిలిపివేత… కిలోమీటరుకు ఒక పోలీస్ గ్రూపు… బుల్లెట్ ప్రూఫ్ అత్యాధునిక వాహనాల కాన్వాయ్… ముందూ వెనుకల్లో భారీ పోలీస్ సెక్యూరిటీ… కాదంటే హెలికాప్టర్, మరీ కాదంటే ప్రత్యేక విమానం… ఆ కాన్వాయ్ వెంటబడి చెమటలు కక్కుతూ పరుగులు తీసే వందిమాగధుల వాహనాలు…… అబ్బో, చెబుతూ పోతే ఒడవదు, తెగదు… కానీ మన దేశంలోనే ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు… పేరు పెమాఖండూ… అరుణాచల్ ప్రదేశ్… వయస్సు నలభై ఏళ్లు… అసలు ఆ రాష్ట్రమే గుట్టలు, కొండలు, ప్రవాహాలు, చెట్లు… అనేక గ్రామాలకు రోడ్డు ఉండదు… పలు గ్రామాల జనం తమ సమీప పట్టణాలకు వెళ్లాలంటేనే రోజుల తరబడి నడక సాగించాల్సిందే… ఈయన ఆమధ్య చాంగ్లాంగ్ ప్రాంతం, అంటే విజయనగర సర్కిల్‌కు స్వయంగా వస్తానని వాగ్దానం చేశాడు… 2021 మార్చిలోనే వస్తాను అన్నాడు… అక్కడ కొన్ని బ్రిడ్జిలు, రోడ్ల పనులు స్వయంగా పర్యవేక్షిస్తానూ అన్నాడు… 2022 మార్చికల్లా వాహనాల్లో అక్కడికి చేరేలా మౌలిక వసతులు కల్పిస్తాను అన్నాడు… ఇక బయల్దేరాడు…
ఈ మ్యాప్ చూశారు కదా… బర్మా దేశంలోకి చొచ్చుకుపోయినట్టుగా ఉంటుంది ఈ సర్కిల్… మొత్తం 16 గ్రామాలు… 4400 జనాభా… బర్మాలో రాజకీయంగా కల్లోల పరిస్థితులున్నయ్… సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత… మన ముఖ్యమంత్రి ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బయల్దేరాడు… తను ఉండే ప్లేసు నుంచి 157 కిలోమీటర్లు… కొంతదూరమే వాహనాలు వెళ్తాయి… బోర్డర్ రాష్ట్రం కదా… రక్షణ ఏర్పాట్లు తప్పవు… వాహనశ్రేణి వెళ్లేంతవరకూ వాటిల్లో వెళ్లి, ఇక అక్కడి నుంచి నడక… ఆ గుట్టల్లో పడి, ఆ చెట్లల్లో పడి… వాగులు, వంకలు దాటుతూ… ఏ వాగు ఒడ్డునో, ఏ చెట్టు నీడనో కాసింత విశ్రాంతి… మళ్లీ నడక… ఈ ట్రెక్కింగులూ, రిస్కులు, సాహసాలు ఎంజాయ్ చేస్తాడు… To Reach Unreachable Remote Areas అని ఓ ట్వీట్ పెట్టేసి మరీ బయల్దేరాడు… దిగువన ఉన్న ట్వీట్లు చూస్తే, వాటిల్లో ఫోటోలు, వీడియోలు చూస్తే… ఈ జర్నీ ఎలాంటిదో పాఠకులకు క్లారిటీ వస్తుంది… ‘‘నువ్వు నిజమైన లీడర్వురా బాబూ’’ అనాలనిపిస్తుంది…
Today begins my journey of 157km Miao-Vijaynagar road (Myanmar border) on foot & car. I have promised people of Arunachal that motorable road will reach Vijaynagar by March 2022. Inspected the construction of RCC bridge over Mpen river. Ensuring work is being expedited on ground. pic.twitter.com/HcYqKkIqEk
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) March 25, 2021
Ads
ఇది 25వ తేదీ తను పెట్టిన ట్వీట్… జర్నీ స్టార్ట్…
Reaching the unreached…
More visuals from the day 1 of journey from Miao to Vijaynagar (157km). For many years, the work on entire stretch of road laid incomplete despite the project receiving green signal on several occasion.
The road will be motorable by March 2022! pic.twitter.com/7eQ5fbJ4Z4
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) March 27, 2021
ఇది 27న పెట్టిన ట్వీట్… ఆ కాన్వాయ్, భద్రత సిబ్బందితోపాటు తన ప్రయాస, పాట్లు గమనించొచ్చు…
A story of our journey to reach the unreached…
It took us two days to reach #Vijaynagar from #Miao travelling 157km through mud and jungle.
Vijaynagar is a beautiful valley surrounded on three sides by Myanmar. @PMOIndia @HMOIndia @adgpi @MDoNER_India @MyGovArunachal pic.twitter.com/cqgtI5PK80
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) March 28, 2021
ఇది 28న పెట్టిన ట్వీట్… ఆ బురదల్లో పడుతూ లేస్తూ వాహనాలు సాగిస్తున్న ఫీట్లు చూడొచ్చు… ఇక ఇప్పుడు మన మైదాన ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఓసారి పోల్చుకొండి… అట్టహాసాలు, ఆడంబరాలు, డంబాచారాలు, అతిశయాలే కదా మొత్తం… అసలు నాలుగు అడుగులు నడిస్తే కదా… కదిలితే చాలు కాన్వాయే కదా… ఈ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూతో అసలు పోల్చవచ్చా వీళ్లను..? అసలు ఇదే కాదు, కొన్నాళ్ల క్రితం 120 కిలోమీటర్ల దూరం ఓ బైక్‌పై ఒంటరిగా ఆ ఘాట్ రోడ్లపై ప్రయాణం చేశాడు… తరువాత మంత్రి కిరణ్ రిజిజును వెంబడేసుకుని ఏటీవీలో (All Terrain Vehicle) వంద కిలోమీటర్లు తనే డ్రైవ్ చేశాడు… అదీ 15 వేల అడుగుల ఎత్తులో… భలే కేరక్టర్… అందులో చైనా బోర్డర్ వెళ్లి, అక్కడి సరిహద్దు జవాన్లతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు ఆ ఇద్దరూ… అన్నట్టు ఆ ఏటీవీ ఫోటోలు చూస్తారా..?
Share this Article