Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కండోమ్ మరిచిన భర్త… వదిలేసి వెళ్లిపోయిన భార్య… అదే కథ…

March 26, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. జయసుధ మార్క్ సినిమా ఇది . ఇల్లాలి కోరికలు టైటిల్… శృతిమించిన ఆత్మాభిమానాలు , ఇగోల కారణంగా భార్యాభర్తలు విడిపోవటం , వయసు వేడి తగ్గాక పిల్లలో , పెద్దోళ్ళో , ఏదో పరిస్థితుల్లో కలపడం వంటి కధాంశంతో కుప్పలుకుప్పలు సినిమాలు వచ్చాయి .

అలాంటి సినిమాయే అయినా మహిళా ప్రేక్షకుల అభిమాన హీరో శోభన్ బాబు సినిమా కావడంతో వంద రోజులు ఆడింది . పెళ్ళిచూపుల నాడే తన డిమాండ్లకు ఓకే చెప్పించుకుని పెళ్ళికి ఒప్పుకుంటుంది హీరోయిన్ జయసుధ .

Ads

ఆ డిమాండ్లకు భిన్నంగా హీరో ప్రవర్తించడంతో విడిపోతారు . కవలపిల్లల్లో ఒకరిని హీరో ఎత్తుకుపోయి పెంచుకుంటాడు . ఆరేళ్ళ తర్వాత ఇద్దరు కవలలు , హీరో ముసలి తల్లిదండ్రులు కలిసి భార్యాభర్తల్ని కలుపుతారు . టూకీగా ఇదీ కధ .

సందేశం ఏమిటంటే భర్తలు సిగరెట్లు కాలుస్తున్నా , అప్పుడప్పుడు మందు కొడుతున్నా భార్యలు చూసీచూడనట్లు వదిలేయాలి . సినిమా మధ్యలో జమున , హరనాథ్ లేత మనసులు సినిమా గుర్తుకొస్తుంది . కవలల్లో ఒకరు ఆ సినిమాలో కూడా అరవ కూచి . యాదృచ్చికంగా రెండు సినిమాలలోనూ డాక్టర్ సూర్యాకాంతమ్మే .

సినిమా కధను ఉషశ్రీ అందిస్తే డైలాగులను పరుచూరి బ్రదర్స్ వ్రాసారు . జి రామమోహనరావు దర్శకుడు . చక్రవర్తి సంగీతంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి .

హీరో తల్లిదండ్రులుగా సత్యనారాయణ , నిర్మలమ్మ నటించారు . ఇలాంటి పాత్రలు వాళ్ళిద్దరికీ కొట్టిన పిండే . ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ అంటూ సినిమా పాటలతో ఓ పాట కూడా పాడతారు . సరదాగా ఉంటుంది .

వేటూరి వ్రాసిన అమ్మ వినవే తల్లి వినవే బుధ్ధి వచ్చె నాకు బుజ్జగించవే , టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండయ్యింది , తొందరగుంది తొందరగుంది రావే ముద్దుల గుమ్మా డ్యూయెట్లు బాగుంటాయి . మూడు పాటల్నీ వేటూరే వ్రాసారు . ఆత్రేయ వ్రాసిన బాటలు వేరైనా బాటసారులు ఒకటే నడకలు పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది .

ఇతర పాత్రల్లో ప్రభాకరరెడ్డి , నూతన్ ప్రసాద్ , కె విజయ , శుభ , హరిబాబు , గిరిబాబు , రోహిణి , సువర్ణ ప్రభృతులు నటించారు . తరచూ టివిలో కూడా ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . సినిమా యూట్యూబులో ఉంది . శోభన్ బాబు , జయసుధ అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!
  • హరీష్ భయ్… నో గురుదక్షిణ, నో నిర్లక్ష్యం – ఇది సిన్సియర్ ఎఫర్ట్ !!
  • మిస్టర్ క్లీన్ ! మీడియాకన్నా చరిత్ర బాగా అర్థం చేసుకుంది !!
  • “రూమ్ నం. 39… మూడేళ్లుగా ఎవరికీ అర్థం కాని రహస్యం!”
  • రష్మిక, పూజా హెగ్డే, ఐటమ్ సాంగ్… తమన్ భలే కథలు చెబుతాడు!
  • ఈ పిల్లాడిని బలిగొన్నది కేవలం ఆ ఒక్క మార్కేనా? ఓ మథనం అవసరం!!
  • హోటల్ పనివాడుగా మొదలై… స్టార్ హీరోలకు దీటుగా స్టార్ విలన్!
  • విద్యా శాఖ మాత్రం ఇవ్వొద్దుట ! – మంత్రిగా ఉంటే పర్లేదుట !!
  • భక్తి తప్పు కాదు – ఇదుగో ఇలాంటి మూఢ భక్తే ‘మోక్షమార్గం’!
  • ప్చ్… చివరకు ఈ అనంత జ్ఞాన శ్రీరాముడూ చెప్పేవాడయ్యాడు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions