.
ఒకండు… ఆ ధూర్త నమస్తే తెలంగాణ అనబడు బహుస్వార్థ కరపత్రికాలో రాస్తాడు… పహల్‌గామ్, ఆపరేషన్ సిందూర్ ఎట్రెట్సా అంతా జస్ట్ కాలసర్ప దోషం అని…
అసలు కాలాన్ని సర్పంతో పోల్చి, ఓ దోషంగా ఎంచి ఆస్ట్రానమీలో బంధించడం మీద శాస్త్రీయ జ్యోతిష్కుల్లోనే బోలెడు విమర్శలున్నాయి… సరే, ఆ తిక్క, తలకుమాసిన కరపత్రికలో ఎవడేం రాస్తే ఏమిటిలే గానీ…
Ads
ఫాఫం, మరొకాయన భీకరంగా చెబుతున్నాడు… షష్ట గ్రహ కూటమి ప్రభావమే అని… సరే, ఆయన లెక్కలు ఆయనవి… కాస్త పక్కన పెట్టండి… నిజమో అబద్ధమో… మరొకాయన ఏం చెబుతున్నాడో తెలుసా..?
అరె, నమ్మండి, నమ్మకపొండి… ఓ ఫాంటసీ కథలాగానైనా స్వీకరించరా..? అసలు బాబా వంగా ఏం చెప్పిందో ఎవడికీ తెలియదు, ఎవడేం రాస్తున్నాడో కూడా వాడికే తెలియదు… పాపం, ఆమె బతికి ఉంటే ఏమయ్యేదో…
ఎవడెవడో రాసి పారేస్తున్నాడు… నిజానికి ఆమెకు హిందూ పంచాంగ గణన బాపతు గ్రహచార స్థితిగతులు ఏం తెలుసు..? అసలు నిజంగా ఆమె ఏం చెప్పిందో ఎవడికి తెలుసు… మన యూట్యూబర్లు, సైట్లు దంచి కొడుతున్నారు… ఆమె ముందే చెప్పింది, ఇంకా చెప్పింది అంటూ… ఉత్తదే సొల్లు, నమ్మినవాడి దరిద్రం… నమ్మించినవాడికి నాలుగు డబ్బులు…
అరె, కాల సర్పదోషం గురించి కదా చెప్పుకోవల్సింది… విశ్వవసు నామ సంవత్సరం… వస్తూ వస్తూ ఒక షట్ గ్రహ కూటమిని తీసుకొచ్చింది కదా… ఇప్పుడు ప్రభావాలు స్టార్టయ్యాయట…
డోనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు వేసి ప్రపంచదేశాలలో ఓ కుదుపు తీసుకు రావడం.., పాకిస్తాన్ తప్పు చేసి భారత్ చేతిలో చావు దెబ్బలు తినడం…, టర్కీ, పాకిస్తాన్, చైనాలలో భూకంపాలు.., టర్కీ, అజర్ బైజాన్ బైకాట్ అవడం…
వావ్, యాదృచ్ఛికం కాదన్నమాట… గ్రహ ఆగ్రహమే అన్నమాట… మరి వాడెవడో దాచిన అణ్వస్త్రాల పేలుడు తాలూకు కంపనాలు అంటాడేమిటి..? వోకే వోకే… టర్కీలో కూడా కంపనాలు అంటే ఏదో నిగూఢ కారణమే ఉందన్నమాట… సరే…
బెలూచిస్థాన్ అనే దేశం పురుడు పోసుకునే ప్రయత్నాలు జరుగుతుండటం.., జూన్ కల్లా ఈ దేశం ఉంటుందా ఉండదా తేలనుంది.., బెలూచిస్థాన్ గానీ ఏర్పడితే చైనాకు భయంకర నష్టం… ఆల్రెడీ బొచ్చె పట్టుకుని, దేశవిదేశాలకు బెగ్గర్లను కూడా సరఫరా చేస్తున్న పాకిస్తాన్‌దేముంది..? దానికి కొత్తగా పోయేదేముంది..?
అదే బెలూచిస్తాన్ ఏర్పడితే… CEPEC కారిడార్… అంటే చైనా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఆగిపోతుంది, బలూచ్ బంగారం గనిని కోల్ గ్యాస్ మెయిన్లను గ్వదర్ పోర్ట్‌లను చైనా వదిలేసుకోవలసి ఉంటుంది, చైనాకి ఎటుచూసినా నష్టాలే… కాబట్టి…
చైనా భారత్ పై ప్రచ్ఛన్న యుద్ధం, పరోక్ష యుద్ధం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.., డోక్లామ్‌పై అటాక్ చేయడం, అరుణాచల్‌పై ఇప్పటికే కవ్వింపులు మొదలు పెట్టింది…, బంగ్లా- బర్మాలను కలుపుకుని బర్మా బార్డర్‌లో మళ్లీ మణిపూర్, మిజోరాం, ఆయా రాష్ట్రాలలో గొడవలు చేయొచ్చు,.. బంగ్లాదేశ్‌తో సిలిగురి కారిడార్‌పై అటాక్ చేయించవచ్చు… అని తాజా కాలసర్ప దోషవాదుల ప్రిడిక్షన్స్…
అంతే కాదండోయ్… బంగ్లా సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ ని అమెరికాకి ఇప్పించి, బంగ్లాని అమెరికాకి దగ్గర చేసి, అమెరికా చైనాలు బంగ్లా వెనుక ఉండి భారత్‌పై ఒత్తిడి చేయొచ్చు.., చైనా ముఖ్యంగా అబద్ధాల ప్రచారం మెండుగా చేస్తుంది.., ఇక్కడి ఎంగిలిమెతుకులకు ఆశపడే మీడియ చైనా తానా అంటే వీళ్ళు తందాన అంటారు…
భారతీయులు 80 % మంది వీటిని నిజమని నమ్మి గొర్రెల్లా మోడీని నిందించే అవకాశాలు బోలెడున్నాయి… తర్వాత అవి అబద్దాలని తెలిసి సైలెంట్ అవుతారు వీరు, కానీ వీరి తొందరపాటు వలన దేశానికి అపకీర్తి వచ్చేస్తుందని సదరు జోస్యాలు చెబుతున్నాయి… నమ్మితే నమ్మండి, ఐనా నమ్మాలని ఎవడు అడిగాడు మిమ్మల్ని…
కోపాలతో ఊగిపోవద్దు, భయంతో వణిపోవద్దు, ఇంకా మరిన్ని భూకంపాలు రాబోతున్నాయి… సునామీ కూడా లిస్ట్ ఉన్నట్టుంది, వరదలు కూడా, పిడుగుపాట్లు కూడా ఉన్నట్టున్నాయి… ఈ ఏడూ విపత్తు మరణాలు ఎక్కువే కాబట్టి ప్రజలారా జాగ్రత్త…. అని ఈ తాజా జోస్యాలు చెబుతున్నాయి… కనుక… అదీ సంగతి…
Share this Article