Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్రమ బంధం..! రేవంత్ కిషన్‌రెడ్డిని కొడితే కేటీఆర్‌కు వాతలు..!

June 16, 2026 by M S R

.

1) రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎంత..? టూ ఎప్పుడూ కాదు..! సమీకరణాలు, ఎక్కాలు, లెక్కలు మారుతూ ఉంటాయి… ఎందుకంటే, వర్తమాన రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్… స్టాటిక్ కాదు..!

2) ఒక పార్టీలో ఉంటూ, మరో పార్టీ నాయకుడికి కన్నుగొడుతూ బతికేయడం ఈ కాలంలో కొత్తేమీ కాదు, నిజానికి అదే నూతన రాజకీయ సంస్కృతి… ఏ ప్రధాన పార్టీ నాయకుడూ దీనికి మినహాయింపు కాదు…

Ads

3) కోర్టు ఏం చెప్పింది..? పెళ్లయ్యాక, ఇంకెవరితోనో సంతానం కలిగితే, ఆ పిల్లలకు అధికారిక భర్తే జెనెటిక్ తండ్రి అవుతాడు, బాధ్యతలు వహించాల్సిందే…

4) రాజకీయాల్లో ఒకచోట స్విచ్ వేస్తే అక్కడే లైట్ వెలగదు, ఇంకెక్కడో వెలుగుతుంది… సేమ్, ఒకరిని కొడితే, ఇంకెక్కడో ఇంకెవరికో తలుగుతుంటాయి దెబ్బలు, తేలుతుంటాయి వాతలు…

5) బీజేపీలో కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించి కీలకం… కానీ తను మాస్ లీడర్ కాడు, క్రౌడ్ పుల్లర్ కాడు, అన్నామలైలాగా దూకుడు లేదు, ఎంతసేపూ తెలంగాణ పార్టీ ఏదో ఒక పార్టీకి తోకలాగా ఉండటాన్నే ఇష్టపడతాడు…

6) దశాబ్దాల ఉద్యమాలు, బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడ్డాక… కేసీయార్ ఫస్ట్ ప్రయారిటీ నిర్ణయాలు ఏమిటో తెలుసా..? మెట్రోకు సంబంధించిన రాయదుర్గంలోని సుమారు 4 ఎకరాల 19 గుంటల భూమిని మై హోమ్ గ్రూప్‌కు ధారాదత్తం చేయడం..!!

…. సరే, ఇవన్నీ కాసేపు వదిలేయండి, రేవంత్ రెడ్డి పదే పదే కిషన్‌రెడ్డినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? రేవంత్ రెడ్డి వెళ్లి కేంద్ర మంత్రుల వద్ద పలు ప్రాజెక్టులపై దరఖాస్తులు, విజ్ఞప్తులు ఇచ్చి వచ్చిన వెంటనే కిషన్ రెడ్డి వెళ్లి ఎందుకు పుల్లలు పెడుతున్నాడు..? మోడీకి ఇదెందుకు అర్థం కావడం లేదు..?

కేసీయార్ కోసం, కేటీయార్ కోసం… నాలుగు పనులకు కేంద్రం సాయం చేస్తే రేవంత్ రెడ్డికి పేరొస్తే, అది బీఆర్ఎస్‌కు నష్టం కాబట్టి… బీఆర్ఎస్‌కు నష్టం కలిగితే కిషన్ రెడ్డి ఓర్చుకోలేడు కాబట్టి… జుబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీని కేటీయార్ కాళ్ల దగ్గర పడేసిన తీరు గుర్తుంది కదా…

అందుకే ‘దొంగది కాదు, దొడ్లోకి రాదు’ అని రేవంత్ రెడ్డి నేరుగానే కొడుతున్నాడు… ‘నువ్వు ఎవరెవరిని కలిసి ఏమేం పుల్లలు పెడుతున్నావో మొత్తం తెలుసు, ఎవరి కోసం పనిచేస్తున్నావో తెలుసు’ అని కిషన్‌రెడ్డిని టార్గెట్ చేశాడు… తనకు తెలుసు, తను అడుగుతున్న మూసీ, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ అన్నీ కిషన్‌రెడ్డి నియోజకవర్గానికీ సంబంధమున్నవే… తను కార్నర్ కావడమే కాదు… ఎక్కడో స్విచ్ వెలుగుతుందని తనకు తెలుసు…

ఎస్, అనుకున్నట్టుగానే… ఫుల్లు డిఫెన్సులో పడిన కిషన్ రెడ్డి నోటి వెంట మాట లేదు… (ఈ కథనం రాసే సమయానికి)… కానీ కెేటీయార్ స్పందించాడు… ఏవేవో పొంతన లేని మాటలు… పాలన వైఫల్యాలతోనే కేంద్రం మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వలేదు, వేల కోట్ల రియల్ ఎస్టేట్, మెట్రో భూముల కోసమే ఎల్‌అండ్‌టీని బెదిరించి టేకేవర్ చేశాడు అని ఆరోపణ…

నిజానికి నష్టాల్లో ఉన్నాం, మీరే తీసుకొండి అని మొరపెట్టుకున్నది ఎల్‌అండ్‌టీ కంపెనీయే… (కాళేశ్వరం పనుల్లో దాని నిర్వాకం మరోసారి చెప్పుకుందాం… దానికి ఎప్పుడూ రేవంత్‌తో కైలాట్కం…) నిజంగానే వేల కోట్ల ఆస్తులు, లాభాలు ఉంటే.,.. కేసీయార్ హయాంలోనే తనే స్వాధీనం చేసుకునేవాడు కదా… ఏ పుష్పరాజో లేక రాజపుష్పో తెర మీదకు వచ్చేవాడు కదా…

ఆ డీల్ 30 వేల కోట్లు కాదు, 15 వేల కోట్లకు కొన్నాం అని రేవంత్ చెబితే… దాసోజు శ్రవణ్‌తో 30 వేల కోట్ల కుంభకోణం అని ప్రెస్ మీట్ పెట్టిస్తారు… ఏదో ఒకటి, అప్పటికప్పుడు నోటికి ఏది తోస్తే అదే చెప్పేయడం, ఎప్పుడూ తెలంగాణ భవన్‌లో రెడీగా ఉండే టన్నుల కొద్దీ బురదను జల్లడం…

మెట్రో విస్తరణ చేతకాదని చెప్పింది ఎల్అండ్‌టీ… దాన్ని నష్టాల్లోకి నెట్టింది కేసీయార్… కేంద్రాన్ని అడిగితే ఫిఫ్టీఫిఫ్టీ అన్నది… ఐఆర్ఎఫ్‌సీ రుణమిచ్చింది… తీరా చూస్తే కేంద్రం కిమ్మనదు, కేవలం కేసీయార్- కిషన్ రెడ్డి అక్రమ సంబంధం కోసమేనని రేవంత్ ఆరోపణ… పోనీ, మేమే చేపడతాం, ఎన్వోసీ ఇవ్వమంటే అదీ ఇవ్వదు కేంద్రం… అక్కడా కిషన్ రెడ్డే కారణం…

అవునూ, అమిత్ షా జీ… ఇక ఏ రాష్ట్రంలోనూ ఎవరితోనూ పొత్తులుండవ్, సొంతంగా పోటీలే అన్నావు కదా… సంఘ్ నేపథ్యముంటే అబద్ధాలు ఆడకూడదు, ఆడిన మాట మీద నిలబడాలి… నిలబడతావా..? అవసరమైతే కిషన్‌రెడ్డిని వదిలించుకోగలవా…?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏసీబీ ఎవడిని తన్నినా వందల కోట్లు! ఈ భీముడి వాటా 300 కోట్లు !?
  • ఆహా… ఏం చెప్పితివి జగ్గన్నా… నువ్వు సిసలైన ఇరిగేషన్ మేస్త్రీవి…
  • ఫాఫం తమన్! కామియోకు ఎక్కువ- కేరక్టర్ ఆర్టిస్టుకు తక్కువ!!
  • మరో అసందర్భ ప్రేలాపి – నాగదుర్గపై ఏడుపు కూతలు!
  • అక్కడ ఒక యోగీ సీఎం కాదు- ఒక సజ్జనార్‌ అసలే లేడు… మరి..?!
  • ప్రపంచ బ్యాంకు కాకిలెక్కల్లోనే ‘బలుపు’ – జబ్బలు చరుచుకుంటే ఎలా?
  • కృష్ణ నిజంగా సాహసి – మొండి … అందుకే ఎన్టీయార్‌తో ఢీకొట్టాడు…
  • ఈ మీసం ఫోటో గుర్తుంది కదా! – కేటీయార్ జుట్టు దొరికినట్టేనా..?!
  • ఇంతమందికి ఉరి ఇదే తొలిసారి! సరైన తీర్పు- ఇప్పటికే లేటైంది!!
  • సబాంగ్ పోర్ట్! చైనా సముద్ర వ్యూహాలకు ఇండియా తెలివైన చెక్!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions