గుర్తుందా..? కరోనా విజృంభిస్తున్న మొదట్లో హైడ్రీక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని ఇండియా ప్రపంచదేశాలకు ఉదారంగా పంపిణీ చేసింది… ఏయ్, మాకు ఎక్కువ పంపించు అని అమెరికా మనల్ని బెదిరించింది కూడా ఓ దశలో… నిజానికి ఆ మందు కరోనాపై పనిచేస్తుందా, ట్రయల్స్ జరిగాయా..? ఎవరికీ అక్కర్లేదు… ప్రపంచం డెస్పరేటుగా ఉంది కాబట్టి, పనిచేస్తుందేమో అనే ఆశతో వాడింది… అది పనిచేయదు అని తేలిపోయింది… ఆ డ్రగ్ ముడిసరుకు మీద కూడా పంచాయితీయే… ఇప్పుడిక దాన్ని అడిగేవాళ్లు లేరు… మరి ఏ ప్రయోగ ఫలితాల్ని చూసి WHO దాన్ని వోకే అన్నది… అసలు WHO చైనా గుప్పిట్లో చిక్కి, ఆడుతున్నదని కదా ఆరోపణ… అందుకే కదా అమెరికా దానికి డబ్బు సాయాన్ని కూడా నిలిపేసింది… ఇప్పుడు ఆ WHO మళ్లీ తెర మీదకు వస్తోంది… దాని ఇష్టం, అది ఏది చెబితే అదే ఫైనల్… అత్యంత కారుచౌకగా పనిచేసే ఐవర్‌మెక్టిన్ అనే మందు వాడొద్దు అంటూ ప్రపంచదేశాలకు WHO చీఫ్ సైంటిస్టు సౌమ్యా స్వామినాథన్ ఆర్డరేసింది… సదరు ప్రపంచ ఆరోగ్యవేదిక మాత్రమే కాదు, దిగువ వరకూ విధాననిర్ణేతలు, అధికారులు, పరిశోధన సంస్థలు, వ్యాపారులు అందరూ ఒక్కటై ప్రపంచ మానవాళిని మరింతగా సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు… ఈ దిశలో మనం కొన్ని నిజాల్ని మాట్లాడుకుందాం…
WHO ఎందుకంత వేగంగా స్పందించింది..? ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా పట్టని ఆ సంస్థకు ఇండియా మీదే ఎందుకు కన్ను..? గోవా రాష్ట్ర ప్రభుత్వం ఐవర్‌మెక్టిన్ మాత్రల్ని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని పిలుపునిచ్చింది… అందరికీ అందుబాటులో ఉంచింది… 12 mg చొప్పున అయిదు రోజులు… వెంటనే WHO తెర మీదకు వచ్చేసి, ఛట్, అది పనిచేయదు, కేవలం క్లినికల్ ట్రయల్స్‌కు మాత్రమే పర్మిషన్ అని ఘట్టిగా హెచ్చరించింది… గత సంవత్సరం ఏప్రిల్ నుంచి, అంటే ఏడాది నుంచీ ట్రయల్స్ జరుగుతూనే ఉన్నయ్… అమెరికన్ మెడికల్ జర్నల్ థరపాటిక్స్లో పలు దేశాల సైంటిస్టులు ఈ మందు కరోనా మీద పోరాడగలదు అని చెప్పారు… కానీ WHO ఏమంటోంది..? చిన్న చిన్న స్టడీలు అవి, వాటిని గుర్తించబోం అంటోంది… ఇండియా కిమ్మనడం లేదు… ఎందుకంటే..? ఢిల్లీలోనూ కీలక ఔషధ, వైద్య ఉన్నతాధికారులు డ్రగ్ మాఫియా గుప్పిట్లోనే కదా చిక్కుకున్నది… నిజానికి ఐవర్‌మెక్టిన్ అయిదు రోజులు వేసుకుంటే నష్టమేముంది..? లాభం లేకపోయినా సరే..!
Ads
నిజానికి ఐవర్‌మెక్టిన్ మాత్రమే కాదు, డెక్సామెథసోన్, ఆస్పిరిన్‌తో కలిపి అనేక మంది డాక్టర్లు తమ పేషెంట్లకు వాడుతున్నారు… క్షేత్ర స్థాయిలో మంచి రిజల్ట్స్ ఉన్నయ్… కానీ ఏం జరుగుతోంది..? ఆస్పిరిన్ తక్కువ డోస్ మంచిది కాదని మరో ప్రతికూల ప్రచారం ప్రభుత్వ స్థాయిలో…! అది కారు చౌక ఔషధం… ఇప్పుడు ఎక్కువ కేసులు రక్తంలో క్లాట్స్, చిక్కబడటం వల్లే కాబట్టి ఆస్పిరిన్ పనిచేస్తుందనేది క్షేత్రస్థాయి డాక్టర్ల పరిశీలన… నో, నో, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నవారికి అది సేఫ్ కాదని మన ది గ్రేట్ డ్రగ్ కంట్రోల్ వాళ్ల అభ్యంతరం… నిజమే… ఒక ఐవర్ మెక్టిన్ గానీ, ఒక యాస్పిరిన్ గానీ మన చికిత్స ప్రోటోకాల్‌లో ఎందుకు అధికారికంగా చేరలేకపోయింది..? ఎందుకంటే..? వాటిని ఏ భారత్ బయోటెక్కో, ఏ డాక్టర్ రెడ్డీసో తీసుకుని, ఏ ప్రయోగ ఫలితాలూ లేకుండానే, అర్జెంటు వాడకం పేరిట అనుమతులు తీసుకోలేదు కాబట్టి..!! లేకపోతే వాటికీ అనుమతులు వచ్చేవి… మంచినీటి సీసా ఖరీదుకు వంద రెట్ల ధరతో వేక్సిన్ అమ్ముకునే భారత్ బయోటెక్ వాడు, టూడీజీ అనే మందు కనిపెట్టి ఒక పొట్లానికి ఏడెనిమిది వందల రేటు ఫిక్స్ చేయబోయే డాక్టర్ రెడ్డీస్ వాడో ఈ మందులను పట్టించుకోలేదు కాబట్టి..!! ఆ డ్రగ్స్ అమ్మితే వాడికి వచ్చేది ఏమీ లేదు కాబట్టి…!!
ఇది చదవండి… జైడస్ వాడు విరాఫిన్ అని డ్రగ్ కనిపెట్టాడుట, అర్జెంటుగా మన డ్రగ్ కంట్రోల్ వాడు పర్మిషన్ ఇచ్చేశాడు… ప్రయోగాలు, ఫలితాలు వదిలేయండి… ఇదంతా ఓ మాఫియా దందా… తేలికపాటి కరోనాకు ఉపయోగం అట, ఆక్సిజన్ అవసరం తగ్గిస్తుందట… ధర 12 వేలు అట… కుమ్మేయండి ఇక…! ఆమధ్య ఫావిపిరవిర్ డ్రగ్కూ ఇలాగే పర్మిషన్ ఇచ్చారు ఏమైంది..? ఏమీ జరగలేదు… ఇవేకాదు, వైరస్ కంట్రోల్ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ అనేక డాక్టర్లు వాడుతూనే ఉన్నారు… చివరకు ఎయిడ్స్ యాంటీ వైరల్ డ్రగ్స్ కూడా… అవి మన డ్రగ్ కంట్రోల్ వాడికీ, WHO వాడికీ అక్కర్లేదు… వాటితో వాళ్లకు లాభం లేదు కాబట్టి…!! క్యూబాలో ఎన్నో ఏళ్లుగా యాంటీ వైరల్ డ్రగ్‌గా వాడుతున్న అదేదో మందుపైనా ప్రచారం జరిగింది, ఇప్పుడు అదీ ఆగిపోయింది… కార్పొరేట్ దోపిడీ శక్తుల బ్యాకింగ్ లేదు కాబట్టి… ఇక వేక్సిన్ విషయానికి వద్దాం…
మన జనాభాకు తగినంత వేక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఒక భారత్ బయోటెక్ వాడికి లేదు… ఒక సీరం వాడికి (కోవిషీల్డ్) లేదు… వేరేవాళ్లను మన డ్రగ్ కంట్రోల్ వాడు రానివ్వడు… కారణం మోడీకి తెలియాలి… పోనీ, భారత్ బయోటెక్ వాడి రీసెర్చులో మన ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం కూడా ఉంది కదా… అవి జనం ఆస్తులే కదా… ఇప్పుడు మహావిపత్తు కదా… ఆ రాయల్టీ ఏదో చెల్లించేసేలా, అందరికీ ఆ టెక్నాలజీ బదిలీ చేస్తే, నెలల్లోనే పుష్కలంగా వేక్సిన్ చౌక ధరలకు లభిస్తాయి కదా… అబ్బే, మోడీకి అదిష్టం లేదు, అసలు మతలబు ఆయనకే తెలియాలి… అసలు సెకండ్ వేవ్ అనేది బూటకం అని ఓ ఆర్.నారాయణమూర్తి అనే నిరక్షరాస్యుడికీ, జయప్రకాష్ నారాయణ అనబడే మేధావికీ తేడా లేదు… వేక్సిన్ పేటెంట్ ఓపెన్ సోర్స్ చేస్తే ఇండియాకు నష్టం అంటాడు… ఇద్దరూ ఇద్దరే…
కరోనాతో తమ సహచరులు రాలిపోతున్నా సరే, రియల్ ఇంపీరియలిస్ట్ చైనా మీద ఈగ వాలనివ్వకుండా… ఇదంతా సామ్రాజ్యవాదుల కుట్ర అనే మావోయిస్టులకూ వీళ్లకూ తేడా లేదు… అన్నింటికీ మించి ఇలాంటి పెడధోరణులకు, దుష్పరిణామాలకూ తన ఏకపక్ష, అపరిణత పోకడలతో భారతీయ సమాజాన్ని సంక్షోభంలో నెట్టేసిన మోడీ అసలు బాధ్యుడు… మన సమాజం ఖర్మ… చివరకు ఒక గోవా ఆరోగ్య మంత్రికి ఉన్న ధైర్యం కూడా లేకపాయె… ఆక్సిజన్ ఉండదు, వేక్సిన్ ఉండదు, ఓ పాలసీ ఉండదు, డ్రగ్స్ ఉండవు… అసలు రెమ్‌డెసివర్, ప్లాస్మా థెరపీ, టోస్లిజుమాబ్ దోపిడీల మీద ఈ ప్రభుత్వానికి ఓ సోయి ఉందా..? ఆ డ్రగ్ మాఫియా గుప్పిట్లో ఇరుక్కున్న కేంద్రం మొత్తం భారతీయ సమాజాన్నే తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోందా..? అర్థమైన వాళ్లకు అర్థమైనంత…!! చివరగా :: ప్రస్తుతం భారతీయ సమాజానికి కావల్సింది డాక్టర్లే కాదు, సరైన సూచనలు, మార్గదర్శకత్వం ఇవ్వగల నిపుణులు, కౌన్సిలర్లు, రోగనిరోధకశక్తిని సహజంగా ఎలా పొందాలో తెలిపే నిజమైన సమాజసేవకులు… ఈ అధికారులు, ఈ పాలకులు సంక్షోభాన్ని పెంచేవాళ్లే తప్ప రక్షకులు కారు… కారు…! మరిచిపోయా… బూస్టర్ డోస్ దందాకు సిద్ధం కండి…! మరీ కరొనాని మించిన విపత్తు ఏమిటంటే… ఇలాంటి ఆలోచన ధోరణి… అమ్మా, మీకో దండం… మీకూ, మీ బాసుకూ…!!!
Share this Article