Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…

September 11, 2025 by M S R

.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలీ కర్కి పేరు వినవచ్చింది కదా… వారణాసిలో చదువుకున్న ఆమెకు ఇండియా అంటే అభిమానం, మోడీ అంటే గౌరవం…

కానీ ఆ పేరు ఇప్పుడు వెనక్కి పోయింది… రాజ్యాంగం ప్రకారం మాజీ న్యాయమూర్తులు ఈ పదవికి అర్హులు కారు, పైగా ఆమెకు 70 ఏళ్లు, ఈ జెడ్ జనరేషన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు అని జనరేషన్- జెడ్ తాజాాగా ఆమె పేరును తిరస్కరించింది… (అసలు ప్రధాని పదవి ఎవరిదో నిర్ణయించడానికి ఈ టీమ్ అర్హత ఏమిటి..? అదే పెద్ద ప్రశ్న…)

Ads

ప్రస్తుతం ఇంజినీర్ కుల్మన్ ఘీషింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది… బహుశా తనే తాత్కాలిక ప్రధాని అవుతాడేమో… కానీ బాలెన్ షా పేరు తాజా ప్రతిపాదనల్లోకి రాకపోవడం ఆ దేశానికే ఊరట… ఎందుకంటే, తను ఓ పర్వర్టెడ్… పక్కా భారత వ్యతిరేకి… పారిపోయిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిలాంటోడే…

నిన్నటిదాకా నేపాల్ కాబోయే ప్రధానమంత్రి అంటూ బాలెంద్ర షా అనే వ్యక్తిని మీడియా గొప్పగా ప్రచారం చేసి చూపించింది… బాలెన్ షా ఒక రాప్ సింగర్… ఇతడు నేపాల్ రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై పాటలు కట్టి పాపులర్ అయ్యాడు… నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ గుర్తింపు పొందాడు…

అంతే, అంతకు మించిన సపరేట్ రాజకీయ చరిత్ర లేదు తనకు… ఈ పాపులారిటీతోనే నేపాల్ రాజధాని కాఠ్మాండూ మేయర్ పదవికి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాడు… నగరాభివృద్ది కోసం పెద్దగా చేసిందేమీ లేదు… తనకు అంత పరిణతి, జ్ఞానం కూడా లేవు…

జెన్-జడ్ ఉద్యమానికి బాసటగా నిలవడంతో నిన్నామొన్నా తాజా తాత్కాలిక ప్రధాని అభ్యర్థిగా ప్రచారం పొందాడ… ‘బాలెన్‌ దాయ్‌.. టేక్‌ ద లీడ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు… ఇప్పుడదంతా తిరస్కరించబడింది…

బాలెన్ షా పచ్చి భారత వ్యతిరేకి… అతని గదిలో ‘గ్రేటర్ నేపాల్’ అనే మ్యాప్‌ కనిపిస్తుంది… ఇందులో మన దేశంలోని హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు సిక్కిం రాష్ట్రం మొత్తం నేపాల్‌లో భాగంగా చూపించారు…

బాలెన్ షా ‘ఆది పురుష్’ సినిమా కాఠ్మాండూ నగరంలో ఆడకుండా మేయర్ హోదాలో నిషేధించాడు… కారణం ఏమిటంటే… అందులో జానకి భారత పుత్రిక అనే సంబోధన ఉందట… సీతమ్మ జన్మస్థలం తమ దేశంలో ఉంది కాబట్టి తమ ఆత్మగౌరవానికి ఆదిపురుష్ సినిమా వ్యతిరేకం అని తన వాదన… అయితే నేపాల్ సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని కొట్టి పారేసింది…

(రామాయణ కాలంలో నేపాల్, భారతం ఇలాగే ఉన్నాయా… తన పిచ్చి, పైత్యం కాకపోతే…) కాఠ్మండూ ఎన్నికల్లో వోట్లేసినా సరే, తరువాత బాలెన్ షా పనులను సాటి నేపాలీలే వ్యతిరేకిస్తున్నారు… కారణం, తన భారత వ్యతిరేకత…

దాదాపు నేపాల్ ఇండియాలోని ఒక రాష్ట్రంగా ఉండేది… సరిహద్దు ఆంక్షలు ఏమీ లేకుండా స్వేచ్ఛగా రాకపోకలు ఉండేవి… మన రూపాయికే చెల్లుబాటు ఎక్కువ… నేపాలీలు మన దేశంలో ఎక్కడైనా కొలువులు చేసుకుంటారు… మనకు ప్రత్యేకంగా ఓ గూర్ఖా రెజిమెంట్ కూడా ఉంది… మన గుర్తింపు పొందిన భాషల్లో నేపాలీ కూడా ఒకటి…

నేపాల్‌తో మనది రోటీ- భేటీ అనుబంధం… నిజానికి నెహ్రూకు కాస్త వివేచన ఉండి ఉంటే నేపాల్ మన దేశంలో అంతర్భాగమై ఉండేది… రోటీ అంటే ఉపాధి, భేటీ అంటే ఆ దేశంతో మన దేశస్థులకు వైవాహిక, ఇతర బంధుత్వ సంబంధాలు… థాంక్ గాడ్… ఇండియాలోనే చదువుకున్న ఈ బాలెన్ షా ప్రధాని కాకపోవడం ఆ దేశానికే మంచిది…!! లేకపోతే చైనా చేతిలో ఓ పనిముట్టు అయ్యేవాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?
  • నేపాల్ జనాగ్రహం వెనుక ఇది మరో కోణం… మనకూ డేంజరే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions