………….. Ganga Reddy A……….. వీలైనంత మందికి ఆ injections సంబంధించిన details ఇచ్చాను. కానీ అందరికీ ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నాను. వచ్చిన మెసేజెస్ బట్టి , కాల్స్ బట్టి బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుందని అర్థం అవుతుంది. వారందరు అటూ ఇటూ ఇంజెక్షన్స్ కోసం పరుగెడుతున్నారని అర్థం అవుతుంది . బాధితులని , వారి బంధువులని చూస్తే బాధ పడటం తప్ప, ఏమి చేయలేని పరిస్థితి . మాటలు లేవు .
బ్లాక్ ఫంగస్ వచ్చిన ఇద్దరి పేషంట్లకు సంబంధించి , సహాయం విషయంలో అనుకోకుండా ఇన్వాల్వ్ కావడం జరిగింది . అలాగే వారికి కావాల్సిన injections విషయంలో కంటిన్యుగా వీలైనన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. స్టాక్ ఎక్కడా లేదు. ముందే మాయం చేశారు. వాళ్లకు తెలుసు, కొత్త జబ్బులు ! ప్రాణాంతకం అనే మాటలు ! So చచ్చినట్టు కొంటారు అని . అందులోని మాఫియా లోతులు తెలిసి కళ్ళు తిరగడం తప్ప ఇంకో దారి లేదు. ” ఇంత దారుణమా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వారి vigilance ఏమైంది? “, ఇలాంటి ప్రశ్నలు అందరు వేసి వేసి అలసిపోయారు. కొత్తగా మాట్లాడటానికి ఏం లేదు.
బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ లో భాగంగా, డాక్టర్ల సజెషన్స్ తో, కొన్ని injections కోసం , బాధితుల బంధువులందరు మెడికల్స్ , ఏజెన్సీల చుట్టూ అటూ ఇటూ పరుగెడుతున్నారు. అందులో ముఖ్యoగా ఇది .
Lipsomal Amphotericine B (injection )-50 mg
ఇపుడు అది మార్కెట్ లో దొరకట్లేదు. దాని actual కాస్ట్ Rs. 6,500
బ్లాక్ ల, దాని కాస్ట్ : 40,000 నుండి – 50 వేల వరకు చెప్తున్నారు .
(ఇంతనా అని అడగడంతో, స్టాక్ ఎక్కడా లేదు, అయినా ఇపుడు బ్లాక్ లో కూడా ఈ ఇంజక్షన్ దొరకట్లేదు అని చెబుతున్నారు )
డాక్టర్లేమో, వాళ్ళ infection తీవ్రతను బట్టి, ఒక్కో పేషంట్ కి, 40 నుండి 90 వరకు injections ను సూచిస్తున్నారు. రోజుకు మూడు ఇవ్వాలి , అలా నెలకు రోజులకు 90 ఇంజెక్షన్స్ అవసరం పడుతుంది అంటున్నారు .
ఈ కాస్ట్ లో, లెక్కేసుకుంటే, ఒక్కో పేషంట్ కి only ఇంజక్షన్స్ కే – సుమారుగా 15 to 30 లక్షలు పెట్టాలి. ఇదో వ్యధా ప్రయాణం .
ఇన్ని బాధలు పడేకంటే : ఒకవేళ కరోనా వస్తే మాత్రం, వీలైనంత వరకు home isolation లో చికిత్స పొందాలి . తప్పని పరిస్థితులు వచ్చి , హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే పరిస్థితులే వస్తే , స్టెరాయిడ్స్ వాడాల్సిన పరిస్థితే వస్తే మాత్రం , షుగర్ లెవల్స్ ని కంట్రోల్ ఉంచుకోవాలి.
దయచేసి గమనించండి , ఈ ఇంజక్షన్ దొరకట్లేదు అని చెబుతున్నారు .
Amphotericine B (injection )-50 mg అనే నార్మల్ ఇంజక్షన్ కాస్ట్ , original cost Rs. 315, కానీ వాళ్ళు Rs . 10,000 లు చెబుతున్నారు. ముప్పై రెట్లు అన్నమాట. మేం ప్రయత్నించిన వారిద్దరికీ, డబ్బులు ఇబ్బంది ఉండడంతో ,డాక్టరు సలహా వలన,ఇప్పడికైతే ఈ ఇంజక్షన్స్ కొన్నింటిని తీసుకున్నారు. అవి కూడా ఇపుడు దొరకట్లేవు అంటున్నారు .
వీటికీ వాటికి తేడా ఏమిటీ అని అడిగితె , ఇదైతే infection ను పెరగకుండా అడ్డుకుంటుంది , Lipsomal Amphotericine B , అయితే infection ను చంపుతుంది, most effective injection అని ఓ ENT సర్జన్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో ,ఇప్పడికైనా : ఏ మందులు అత్యఅవసరం పడుతున్నాయిని తెలుసుకుని , వైద్య రంగంలోని నిపుణులతో కమిటీ వేసి , బ్లాక్ కాకుండా చూసి , ఒకవేళ దొరకకపోతే ప్రొడక్షన్ పెంచే పనులు తొందరగా మొదలు పెట్టేలాగా ప్రభుత్వం వెంట వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రాక్టికల్ గా ఏమి జరుగుతుందో, ENT హాస్పిటల్స్ తిరిగి కనుక్కోవాలి . లేదంటే బాధితుల బాధలు చెప్పనలవి కావు …
Share this Article