ఒక ప్రాంతంలో ఒక మతం వాళ్లు అధికంగా ఉన్నారు… అంతే, ఇక ఆ ప్రాంతంలో ఇతర మతస్తులు తమ మతానికి సంబంధించిన ఏ ఉత్సవాన్ని చేసుకోకూడదా..? అసలు ఒక ప్రాంతం అంటే ఏమిటి..? ఒక గ్రామమా..? ఒక తాలూకా..? ఒక జిల్లా..? రాష్ట్రమా, దేశమా..? దేశంలో ఒక మతం వాళ్లే మెజారిటీ అయితే… మరి దేశంలో ఎక్కడా వేరే మతస్తులు ఉత్సవాలు జరుపుకోవద్దు అని వాదిస్తే చెల్లుతుందా..? అబ్బబ్బ, ఏమిటీ ప్రశ్నలు..? బుర్రెకెక్కడం లేదు అంటారా..? అయితే ఈ వార్త చదవండి… మన మెయిన్ స్ట్రీమ్‌లో పెద్దగా కనిపించవులెండి… వాటి ఇంపార్టెన్స్ తెలిస్తే కదా… ఏవో నాలుగు కరోనా భీకరవార్తలు రాసుకుంటే సరి… టైమ్స్‌లో వచ్చిన ఆ వార్తకు మిత్రుడు Chada Sastry తెలుగు అనువాదం ఇది…
“ఒక ప్రాంతంలో ఎవరు మెజారిటీని కలిగి ఉన్నారనే దానిపై మాత్రమే ఆధారపడి ఏ ప్రాంతంలోనైనా మతపరమైన ఉత్సవాలు లేదా ఊరేగింపులను నిషేధించలేము”… మద్రాస్ హైకోర్ట్ ధర్మాసనం తమిళనాడులోని, పెరంబలూర్ జిల్లాలోని, వి.కలతూర్లో ముస్లిం గ్రామస్తులు హిందువులు ఆలయ ఊరేగింపులు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆటంకాలు కల్పించడంపై హిందువులు పెట్టిన పిటిషన్ పై విచారణ జరిపింది… మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ఎన్.కిరుబకరన్ మరియు పి.వెల్మురుగన్లతో కూడిన ధర్మాసనం దీనిపై వాఖ్యానిస్తూ….”ఒక ప్రాంతంలో ఏ మతపరమైన వారు మెజార్టీగా వున్నారు అనే ఒక్క అంశం మీద ఆధారపడి ఆ ప్రాంతంలో జరిగే మత ఉత్సవాలను నిషేధించలేం” మూడు రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాన్ని 2011 వరకు శాంతియుతంగా నిర్వహించినట్లు ఆ ప్రాంత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు, అయితే 2012 సంవత్సరం నుండి ముస్లింలు కొన్ని హిందూ పండుగలను పాపాలుగా పేర్కొంటూ ఉత్సవాలను అడ్డుకుంటున్నారు. ఆలయ ఉత్సవాలు మరియు ఊరేగింపులు నిర్వహించడానికి రక్షణ కోరుతూ హిందువులు పోలీసులను ఆశ్రయించారు, పోలీసులు కొన్ని ఆంక్షలతో పర్మిషన్ ఇచ్చారు అని ఆయన కోర్టుకు చెప్పారు… దీనిపై ధర్మాసనం ఇంకా ఇలా వ్యాఖ్యానించింది :
“ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక మత సమూహం ఆధిపత్యం చెలాయిస్తున్నందున, మతపరమైన పండుగలను జరుపుకోవడం లేదా ఆ రహదారుల ద్వారా ఇతర మత సమూహాల ఊరేగింపులు తీసుకోవడం నిషేధించటానికి ఇది ఒక మైదానం కాదు… ఈ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో/ గ్రామంలోని వీధులు మరియు రహదారుల గుండా ఊరేగింపు నిషేధించబడాలని, హిందూ పండుగ లేదా ఊరేగింపు ఉండకూడదు అని, దశాబ్దాలుగా కలిసి నిర్వహించబడుతున్న ఉత్సవాలకు అభ్యంతరం చెప్పడం ఇక్కడ మెజార్టీగా ఉన్న ముస్లింలు అసహనం ప్రదర్శించడమే… ప్రైవేట్ ప్రతివాది (ముస్లిమ్స్) యొక్క వాదనను అంగీకరించాలంటే, అది మైనారిటీ ప్రజలు భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఎటువంటి పండుగ లేదా ఊరేగింపు నిర్వహించలేని పరిస్థితిని సృష్టిస్తుంది” అని ధర్మాసనం తెలిపింది. కొన్ని మత సమూహాలలో గల ఇటువంటి రాడికలైజేషన్‌కు వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా చెపుతూ ధర్మాసనం “ఒక మత సమూహం ప్రదర్శించిన ఇటువంటి ప్రతిఘటనను ఇతర మత సమూహాలు కూడా పంచుకుంటే దేశంలో గందరగోళం, అల్లర్లు, మతపరమైన పోరాటాలు, ప్రాణనష్టం మరియు ఆస్తులు నాశనం అవుతాయని’’ అభిప్రాయపడింది. ఇదీ టైమ్స్ వార్త లింక్… https://m.timesofindia.com/city/chennai/roads-are-secular-they-should-be-used-by-people-of-all-religions-madras-high-court/amp_articleshow/82583579.cms?fbclid=IwAR2sxWmt8bvaZZODNbDgn4B3k8TzMzf0tjF_rICBiwxxmvVYZrV9PC9BvKQ
Ads
Share this Article