ఐనా…. ఆ ఆనందయ్యతో తప్పు బ్రదరూ…. జనానికి సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ఇలాంటి ఆనందయ్యలు కొందరే మిగిలారు ఇక… వాళ్లకేమో కార్పొరేట్ స్టయిల్ రాదు… ఈయన ఏదో కరోనాకు మందు రూపొందించాడట…. అదీ ఉచితంగా జనానికి ఇవ్వడం మొదలుపెట్టాడు… ఎంత ద్రోహం.?. ఎంత మోసం..? అసలు ప్రభుత్వాల్ని, ప్రజాజీవితాల్ని, ప్రజల మనుగడనే శాసించే కార్పొరేట్ హాస్పిటళ్లు ఏమైపోవాలి..? డ్రగ్ మాఫియా ఏమైపోవాలి..? వేక్సిన్ దందా ఏమైపోవాలి..? కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లకు ఇదుగో ఇలాంటి వాళ్లే ద్రోహులు… అందుకే వీళ్లను ఏం చేసినా పాపం లేదు… అరె, ప్రభుత్వాల్ని, ప్రభుత్వ విధానాల్ని తుంగలో తొక్కేసి… పాలసీల్ని తామే రాసేసుకుని… పాలిస్తుంటే… ఆఫ్టరాల్, ఈ హోమియో వైద్యులు, ఈ ఆయుర్వేద వైద్యులు అడ్డంకులుగా, పంటిలో రాళ్లలా తయారయ్యారు…
నెల్లూరు జిల్లా, కృష్నపట్నం అట… బొనిగె ఆనందయ్య అట… ఏమీ లేదబ్బా… తనకు తెలిసిన పచ్చ కర్పూరం, మిరియాలతో ఓ మందు తయారు చేసి ఫ్రీగా పంచేయడం మొదలెట్టాడు… వేల మందికి ఓ భరోసా… ఆ ఏరియాలో అందరూ హేపీ… అరెరె, అలా హేపీగా ఉంటే లోకానికి ఎంత ప్రమాదం..? చైనా దగ్గర్నుంచి చాలా దేశాలు ఆల్టర్నేట్ మెడిసిన్ అంటూ పాత వైద్యవిధానాల వైపు మళ్లుతుంటే… మన మేధావుల బుర్రలేమో ఇంకా మోకాళ్ల నుంచి పైకి ఎదగడమే లేదు… అబ్బే, ఆ మందుకు ట్రయల్స్ ఏవీ..? శాస్త్రీయ నిరూపణ ఏదీ అంటారు..? సో, అధికారులు ఆనందుడి వైద్యాన్ని ఆపేయడం కరెక్టే అని తేల్చిపారేస్తారు… అయ్యా… ఏ ట్రయల్స్ ఉన్నాయని ప్లాస్మా థెరపీని వాడారు ఇన్నాళ్లు, ఇప్పుడెందుకు వద్దు అంటున్నారు… WHO చికిత్స ప్రోటోకాల్ నుంచే తీసిపారేశారు కదా… ఫావిపిరవిర్, రెమ్‌డెసివర్, స్టెరాయిడ్స్ ఏ బ్లాక్ ఫంగస్‌ను మోసుకొచ్చినాయో తెలుసా మీకు..? ఆ వ్యాధికి ఊపిరి పోసింది ఎవరు..? దేశదేశాలకు పంపిణీ చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఏమైంది ఇప్పుడు..? ఇప్పుడేస్తున్న వేక్సిన్ల మూడో దశ ప్రయోగాలే జరగలేదని తెలుసా..? 30 రూపాయల ఐవర్‌మెక్టిన్ చేసే పనిని లక్షల ఖరీదు చేసే రెమ్‌డెసివర్ చేయలేదు అని తెలుసా..? ఇలా బొచ్చెడు… దేశీయ వైద్యం మీద గుడ్డి వ్యతిరేకత తప్ప ఇంకేముంది వీళ్ల వాదనల్లో…!!
Ads
ఇప్పుడు ఆ మందు శాంపిళ్లు తీసుకుని శాస్త్రీయ పరీక్షలకు పంపించారట… ఎవరు నిర్ధారించాలి ఈ మందు కరెక్టే అని..? ఆయుష్ శాఖేనా..? దానంత కంపు ప్రభుత్వ శాఖ మన వ్యవస్థలో లేదని అందరికీ తెలుసు… మరి ప్రజోపయోగమైన మందుకు అసలైన సైంధవులు ఎవరు..? ఇంకెవరు..? మన అధికారులే…. బుర్రలు పనిచేయని ప్రథమ కేటగిరీ అదే కదా… పొరపాటున తాము జనానికి ఏమైనా మంచి చేస్తామో ఏమో అని ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి మరీ, ప్రజలకు వ్యతిరేకంగా వెళ్తుంటారు… పోనీ, ఈ నెల్లూరు ఆనందయ్య మందు వికటించిందా..? సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా… లేవు కదా… ఇవేకాదు… చాలాచోట్ల హోమియో మందులూ ఇస్తున్నారు…. అన్నీ కరోనా లక్షణాలకు చికిత్సలే కదా… దాదాపు అన్నీ రోగి నిరోధకశక్తిని పెంచేవే కదా… అల్లోపతి వైద్యమూ అదే కదా… మరెందుకు అభ్యంతరం..? ఫాఫం, ఆయన తప్పు ఏమిటంటే..? ఏ పతంజలి వాడికో తన ఫార్ములా ఏదో అమ్మేస్తే సరిపోయేది… దాన్నే ఏ టూడీజీ పేరిటో డెవలప్ చేసినట్టు నటించి, కేంద్ర మంత్రి ద్వారా ఆవిష్కరింపజేసేవాళ్లు… ఆనందుడికి అంత తెలివి ఎక్కడుంది..? కరోనా వదిలేయండి…. సమాజాన్ని పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ వైద్యానికి సరైన విరుగుడు ప్రత్యామ్నాయ వైద్యమే అనే సోయి ఎప్పుడొస్తుందో ఏమిటో…!! ఐనా అంత మంచిగా ఆలోచిస్తే అది ప్రభుత్వం ఎందుకవుతుంది..?! కాళ్లు మొక్కాల్సిన కేరక్టర్ల కాళ్లు విరగ్గొట్టడమే కదా ప్రభుత్వం అంటే…!!!
Share this Article