కేరళ ముఖ్యమంత్రి తన అల్లుడు రియాజ్‌కు మంత్రిపదవిని కట్నంగా ఇస్తున్నాడు… వోకే… పాత వార్తే… సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తన భార్య బిందుకు మంత్రి పదవి ఇప్పించుకుంటున్నాడు… వోకే, ఇదీ పాత వార్తే… అంతా కొత్త మంత్రుల్ని తీసుకుంటున్నాడు… పాత వార్తే… ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఆరోగ్యమంత్రి శైలజకు మళ్లీ చాన్స్ ఇవ్వడం లేదు… పాత వార్తే… ఆగండాగండి… ఆమెను తీసేశారు సరే, కానీ ఆమె ప్లేసులో ఎవరు..? శైలజ ఖాళీ చేసిన కుర్చీ అంటే దాని రేంజ్ వేరు కదా… అందరి కళ్లూ ఆ కొత్త మంత్రి మీదే ఉంటయ్… ప్రత్యేకించి కరోనా నియంత్రణలో పనితీరు ఎలా ఉండబోతోందో అందరూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు… శైలజ వేసిన ముద్ర అలా ఉంది మరి… నిజానికి ప్రభుత్వ విధానాలు, ఆ రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి… ఆరోగ్య మంత్రి చేయగలిగేది అందరినీ సమన్వయం చేసుకుంటూ, యంత్రాంగాన్ని కాస్త నిద్రపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవడమే… దానికీ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉంటాడు, ఓ డైరెక్టర్ ఉంటాడు, వాళ్లపైన చీఫ్ సెక్రెటరీ ఉంటాడు… కానీ మంచి పేరొచ్చినా, చెడు పేరొచ్చినా ఫస్ట్ దేనికైనా రెడీగా ఉండాల్సింది ఆరోగ్య మంత్రే…
మొదట్లో నిపా వైరస్ నియంత్రణ విషయంలో గానీ, ఫస్ట్ వేవ్ కరోనా కంట్రోల్లో గానీ కేరళ అందరికీ ఆదర్శంగా నిలిచింది… కానీ ఏమైందో గానీ సెకండ్ వేవ్ వచ్చేసరికి ఆ స్పిరిట్ తగ్గిపోయింది… కేసులు విపరీతంగా పెరిగాయి… ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంది… సగటు పేదవాడికి పెద్ద రిలీఫ్ అది… కేరళ ప్రభుత్వ విధానాలు కూడా ప్రొపూర్ కావడం మరో అనుకూలాంశం… సో, కొత్త మంత్రికి పెద్దగా సవాళ్లు ఏమీ ఉండవు, ఉన్న సిస్టంను చెడగొట్టకుండా ఉంటే చాలు… ఆ శైలజ ప్లేసులో రాబోతున్నది వీణ… వీణాజార్జి… (కేరళ మీడియా వార్తల ప్రకారం… కొందరు ఆమెను కేరళ స్పీకర్‌ను చేయబోతున్నారు అని కూడా రాసేస్తున్నారు కానీ… బహుశా వీణ ఆరోగ్య మంత్రి కావచ్చు…) ఓహ్… ఎవరామె..?
Ads
45 సంవత్సరాల వీణ బాగా చదువుకున్నదే… ఫిజిక్స్‌లో మాస్టర్స్, బీఈడీ కూడా చేసింది… కొంతకాలం ఓ కాలేజీలో పనిచేసింది… తరువాత జర్నలిజంలోకి వెళ్లింది… దాదాపు పదహారేళ్లు వివిధ టీవీల్లో పనిచేసింది… ఇక చాల్లే అనుకుని, పాలిటిక్సులోకి అడుగుపెట్టింది… స్వతహాగా రాజకీయ కుటుంబం కావడం, ఈమె కూడా ఫస్ట్ నుంచీ సీపీఎం అనుబంధ విభాగాల్లో పనిచేస్తుండటం వల్ల రాజకీయాల్లో వేగంగానే ఎదిగింది… ఇప్పుడు ఆమె రెండోసారి గెలవడం… భర్త జార్జి జోసెఫ్ కూడా టీచర్… హయ్యర్ సెకండీ స్కూల్ టీచర్… కొంతకాలం మలంకర ఆర్తడాక్స్ సిరియన్ చర్చికి కార్యదర్శిగా కూడా చేశాడు… తనూ సీపీఎం లీడరే… వీణ యాక్టివ్… సో, శైలజ ఖాళీ చేసే ఆరోగ్య మంత్రి పోస్టుకు న్యాయం చేస్తుందనే ఆశించొచ్చు… పినరై విజయన్ కేబినెట్లో మరో ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉండబోతున్నారు… ఈ వీణ గాకుండా సీపీఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి భార్య బిందు… అలాగే సీపీఐ నుంచి చించురాణి కూడా మంత్రులు కాబోతున్నారు…
Share this Article