సోషల్ మీడియా అంటేనే ఎక్కువ శాతం ఫేక్…. ఖాతాలు, ప్రచారాలు, పోస్టులు, వీడియోలు, ఫోటోలు… అంతా క్యాంపెయిన్, కౌంటర్ క్యాంపెయిన్ల పెయిన్… ఎవడో ఏదో స్టార్ట్ చేస్తాడు, మొత్తం నెటిజనం రెండుగా చీలిపోతారు… తన్నుకుంటూ ఉంటారు… ఆవేశాలపాలవుతారు… తీరా చూస్తే ఏమీ ఉండదు, వడ్లగింజలో బియ్యపుగింజ… కానీ సమస్య ఎక్కడొస్తుందంటే… పార్టీలు, నాయకులు, మతాలు, కులాలవారీ పోస్టుల దగ్గర సంయమనం పాటించకపోతే అనేక దుష్పరిణామాలుంటయ్… దిగ్విజయ్‌సింగ్ వంటి నేతలకు ఇది అర్థం కాదు… అందుకే ఒక ఫోటో యాడ్ చేసి, ఓ ట్వీట్ పెట్టేసి చంకలు గుద్దుకున్నాడు… విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఉద్దేశించిన ఆ ట్వీట్ ఏమన్నదంటే… ‘‘డాక్టర్ జైశంకర్జీ, ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా… మా మోడీ ప్రతిష్టను దిగజార్చకండి ప్లీజ్ అని ఓసారి న్యూయార్క్ టైమ్స్ వాళ్లను రిక్వెస్ట్ చేయి, ఎందుకంటే, మోడీకి తన ప్రజలకన్నా తన ఇమేజీ మాత్రమే ముఖ్యం కదా… సరైన సమయంలో సరిగ్గా ఏడ్వటం ఆయన తెలిసిన ఆర్ట్ కదా…’’… దానికి ఆయన పెట్టిన ఫోటో ఏమిటంటే… ఇదీ…
చూడగానే ఏమనిపించింది..? అది న్యూయార్క్ టైమ్స్ పత్రిక, ఫస్ట్ పేజీలో ‘భారత ప్రధాని ఏడ్చాడు’ అనే లీడ్ స్టోరీ… వెక్కిరింపుగా మొసలి కన్నీళ్లు కారుస్తున్న ఫోటో పెట్టాడు అనిపిస్తున్నది కదా… ఒక దేశ ప్రధాని మీద ఈ రేంజ్ సెటైర్ వేశాడేమిటబ్బా అని కూడా అనిపిస్తున్నది కదా… కానీ ఇది న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీ కాదు… ది డెయిలీ న్యూయార్క్ టైమ్స్ అనబడే ఓ సైటు వాడు వేసిన సెటైర్… పాఠకుల అటెన్షన్ పొందటానికి ఇలాంటి వేషాలు వేస్తుంటాడు… తీరా ఎవరో అలర్ట్ చేసినట్టున్నారు, అసలు కథేమిటో… దాంతో నాలుక కర్చుకుని, చెంపలేసుసుకుని ఆ ట్వీట్ డిలిట్ కొట్టేశాడు దిగ్విజయ్ సింగ్… సదరు సైటులోకి వెళ్లి, జనం కాస్త గట్టిగానే బెదిరింపులు షురూ చేసినట్టున్నారు… ఆ సైటు వాడు కూడా సేమ్ దిగ్విజయ్ సింగ్‌లాగే… అబ్బెబ్బె… అది కేవలం సెటైర్ మాత్రమే, సీరియస్‌గా తీసుకోవద్దు ప్లీజ్’ అని ఓ ట్వీట్ కొట్టాడు… ఇలా…
Ads
ఇక్కడ మోడీ ఏడ్వటాన్ని కూడా (నిన్న ఏదో కరోనా సంబంధం వర్చువల్ భేటీలో కన్నీళ్లు పెట్టుకున్నాడు) వెక్కిరించి, రాజకీయానికి వాడుకోవడం అనేది వేరే సంగతి… అదేదో దిగ్విజయ్ సింగ్ తనే నేరుగా ఏడవొచ్చుగా… ఈ ఫేకులు, సెటైర్లను ఎందుకు ఆధారంగా తీసుకోవడం..? మరి ఈ కథనాన్ని మనమెందుకు చెప్పుకుంటున్నాం అంటే…? తెలుగు సోషల్ గ్రూపుల్లో కూడా ఈ ఫోటో విరివిగా వాడుతూ, మోడీ మీద విమర్శలు చేస్తున్నారు… చూశారా, మోడీ మొసలి కన్నీళ్లను ప్రపంచమే ఇలా చీదరించుకుంటున్నది, ఇండియా ప్రతిష్టను దిగజారుస్తున్నాడు అంటూ పోస్టులు కనిపిస్తున్నయ్… అందుకని ఆ ఫస్ట్ పేజీ మొసలి కన్నీళ్ల ఫోటో వెనుక అసలు కథ చెప్పుకోవడం…!
Share this Article