మందు..! అది మందే…! ఎవరెంత వెక్కిరించినా, విషం కక్కినా సరే… కొన్ని వేల మందిని కరోనా కోరల నుంచి బయటికి తీసుకొచ్చిన మందే… ఇప్పటికీ తీసుకురాగల మందే… టీవీ9 వాడు ఉద్దేశపూర్వకంగా వెకిలిగా వెక్కిరించే నాటు మందు, పసరు మందు కాదు… సిద్ధవైద్య ప్రమాణాల మేరకు రూపొందిన మందే… భారతీయ సంప్రదాయ వైద్యం పరంపరగా నేర్పించిన విద్యతో రూపొందిన మందే… ఫీల్డ్ నుంచి వచ్చిన సమాచారమే ఇది… మంచి చేయకపోయినా సరే, చెడు చేయని మందు… అదే కృష్ణపట్నం ఆనందయ్య మందు… ప్రభుత్వం పంపిణీని ఆపేసిన మందు… తిరిగి ఎప్పుడు స్టార్టవుతుంది..? ఎప్పుడు స్టార్టవుతుంది..? దేవుడే చెప్పాలి… జగన్ సానుకూలంగా ఉన్నాడు అనే మాట పదే పదే చెబుతున్నారు… ప్రజలంతా అదే కోరుకుంటున్నారు… కానీ అధ్యయనం తరువాతే మందు పంపిణీ అంటున్నాడు… దానిపైరె ఈనాడు ఏమంటున్నదంటే..?
రెండుమూడు నెలలు పట్టవచ్చునట అధ్యయనానికి… (నిజానికి వార్త మహా గందరగోళంగా ఉంది… ఇందులో కబాసుర కుడనీర్ ప్రస్తావన ఎందుకు..? ప్రస్తుతం 16 ప్రాజెక్టులపై పరిశోధనలు సాగుతున్నాయట… వాటికీ ఈ కృష్ణపట్నం మందుకూ లింకేమిటి..?) ఎందుకంటే..? ముందుగా 500 మంది నుంచి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించి, క్రోడీకరించి, మొదట జంతువులపై ప్రయోగిస్తారట… అది ఆయుర్వేద ప్రమాణాల మేరకు ఉంటే తరువాత దశలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ సాగిస్తారట… ఆ తరువాత మిగతా ప్రొసీజరంతా పూర్తి చేసి, ఆయుష్ మంత్రిత్వ శాఖకు పంపిస్తే, వాళ్లు దయతో ఆమోదిస్తే, అప్పటికి ఈ మందు ఎలా పంపిణీ చేయాలనేది ఆలోచిస్తారన్నమాట… సరే, మంచిదే… అప్పటివరకూ ఆనందయ్యను పోలీసు రక్షణలో ‘హోం క్వారంటైన్’లోనే ఉంచేస్తారా..?
Ads
ఈ మందు పంపిణీపై హైకోర్టు ఒక పిటిషన్పై విచారణ జరపడానికి అంగీకరించింది కదా… ఆ పిటిషన్లోని ఓ పాయింట్ ఇంట్రస్టింగుగా ఉంది… ఈ సంజీవని మందు వేల మంది కరోనా రోగులకు దక్కకుండా ఆగిపోయిన తీరుకు ఆరంభం ఏమిటంటే… ఎవరో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారట… లోకాయుక్త వెంటనే ఇదేమిటో చూడండి అని ఆదేశించిందట… వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది… అసలు లోకాయుక్త పరిధి ఏమిటి..? ఒక మందు పంపిణీకి లోకాయుక్త అధికారాల పరిధికీ ఏమైనా లంకె ఉందా..? అదీ పిటిషన్లోని పాయింట్… సరే, ఏదో జనం మంచి కోసం ఏదో సూచించింది అనుకుందాం… అధికార యంత్రాంగం చకచకా రంగంలోకి దిగిపోయి, ఆనందయ్య మందుకు అడ్డంపడిపోయి, మళ్లీ మేం చెప్పేదాకా మందు పంపిణీ చేస్తే బాగుండదు అని చెప్పేసింది…
అప్పటికప్పుడు ఓ ఆర్డీవో, ఓ డీఎంహెచ్ఓ, ఓ డీపీవో, ముగ్గురు కన్సర్డ్ డాక్టర్లతో ఓ కమిటీ వేసింది… వాళ్లు కూడా అంతా బాగానే ఉంది, ఇది ప్రమాదకరమైన మందు కాదు అని నివేదించారు… నిజానికి మందు పంపిణీని ఆపేయాలని లోకాయుక్త చెప్పిందా..? మరెవరు ఈ నిర్ణయం తీసుకున్నది..? ఎందుకు తీసుకున్నారు..? ఎవరైనా కలెక్టర్కు గానీ, ఆర్డీవోకు గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేశారా..? ఈ దశలో నీపని నువ్వు చేసుకోవయ్యా ఆనందయ్యా అని వదిలేస్తే సరిపోయేది… ఎమ్మెల్యే రంగంలోకి వచ్చాడు… ఏదో క్రెడిట్ ఆశించాడు… తీరా జనం విపరీతంగా పోటెత్తారు… పంపిణీ మళ్లీ ఆగిపోయింది… ఈ దశలో అధికార యంత్రాంగం తెలంగాణలో చేప మందుకు సహకరించినట్టుగా సహకరిస్తే సరిపోయేది… దానికి ప్రభుత్వంలో ఏ స్థాయిలో, ఎవరు, ఎందుకు అడ్డుపడ్డారో గానీ… హఠాత్తుగా మందును వివాదంలోకి లాగారు… ఎవరు వాళ్లు..? ఎందుకు..?
ఐసీఎంఆర్ పరిశీలన తప్పనిసరి అన్నారు, ఆయుష్ అధ్యయనం అన్నారు… ఆయుష్ విభాగం పెద్దమనిషి కూడా ఈ మందు మంచిదే అన్నాడు… కానీ పంపిణీ పర్మిషన్ నాకు సంబంధం లేదు అంటాడు… ఇప్పుడేమో ఆయుర్వేద వైద్యసంస్థ ఆధ్వర్యంలో జంతువుల దగ్గర మొదలుపెట్టి, మనుషులపై క్లినికల్ ప్రయోగాల దాకా అధ్యయనం చేస్తారట… చేయడం మంచిదే, కానీ అప్పటివరకూ ఆపడం దేనికి అనే ప్రశ్నకు ఎవరి దగ్గరా ఏ సమాధానమూ లేదు… ఇప్పుడిక కోర్టు… అది సంప్రదాయ వైద్యానికి రక్షణగా నిలబడుతుందా..? రిస్క్ మాకెందుకు అనుకుంటుందా..? ఏ దశలో తప్పు జరిగిందో గానీ ఇప్పుడిది ఓ చిక్కుముడి… మనం పెట్టుకున్న రూల్సే, కట్టుబాట్లే మన రోగాల్ని తగ్గించకుండా మనకే అడ్డుపడటం అంటే ఇదే…!!
ఆహా… ఇదీ అరుణారుణ ప్రజా పాత్రికేయం అంటే..? రెమ్డెసివర్ ఫ్లాపులు, ప్లాస్మా థెరపీ ఫెయిల్యూర్లు, వేక్సిన్ల దందాలు, స్టెరాయిడ్ల వాడకం నష్టాలు, రంగుల ఫంగసుల సృష్టి, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీ, డ్రగ్ మాఫియా పడగ, బ్లాక్ మార్కెట్ పంజా… వీటి మీద ఏం చేసిందో, ఏం రాసిందో గానీ ఆనందయ్య మందు మీద మాత్రం విషాన్ని పరుస్తోంది… కురిపిస్తోంది… ఏ పత్రికకూ, ఏ టీవీకి అందని రీతిలో అద్భుతమైన సమాచారం సేకరిస్తోంది… ఆరుగురు మరణించారట, ఒక్కరి పేరూ తెలియదుట, మరి మృతుల బంధువులు ఎందుకు మాట్లాడలేదట..? ప్రత్యేకంగా ఈ మందు బాధితుల కోసం వార్డు ఏర్పాటు చేశారట, కానీ ఒక్కరి పేరూ తెలియదట… ఒకటి, రెండు, నాలుగో ఫ్లోర్లలో ఈ కేసుల్ని ప్రత్యేకంగా చూస్తున్నారట… ఒక్కరోజే 20 మంది, మొత్తం 36 మంది ఇప్పటికి బాధితులట, ఇంకా ఇంకా పెరుగుతున్నారట… వాళ్ల వివరాలు కూడా తెలియవట… ఆరుగురు అప్పటికే మరణించి ఉన్నారు కాబట్టి, హాస్పిటల్లో చేర్చుకోలేదు కాబట్టి వాళ్ల వివరాలు లేవట… పాత్రికేయానికి కొత్త అడుగులు నేర్పిస్తున్న ప్రజాశక్తీ, నీ ప్రజాపాత్రికేయం ఇలాగే ఇంకా ప్రజ్వలించుగాక..!! అవునూ, ఈ బాధితుల వివరాల పరిశీలన కోసం చైనా తన వుహాన్ నుంచి నిపుణులను ఏమైనా పంపించే చాన్స్ ఉందా..? WHO నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఇప్పటికే రహస్యంగా వివరాలు సేకరిస్తోందా..? అవి కూడా కాస్త బయటపెట్టవా ప్లీజ్..!!
Share this Article