‘‘వేక్సినేషన్ అతి పెద్ద తప్పు… ఇప్పుడు వేక్సిన్లు వేసుకున్నవాళ్లందరూ రెండేళ్లలో చచ్చిపోతారు… అందరినీ బొందపెట్టడం తప్ప చికిత్స కూడా చేయలేం…’’… కరోనా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏమనుకుంటాం..? ఎవడో పిచ్చోడు, నాలుగు తగిలించండి లేదా పళ్లు రాలగొట్టండి అని తిట్టేస్తాం…. కానీ ఒక నోబెల్ ప్రైజ్ విజేత, ప్రఖ్యాత వైరాలజిస్టు, ఎయిడ్స్ వైరస్ కనిపెట్టిన వ్యక్తి ఆ మాట అంటే ఎలా ఉంటుంది..? భయమేస్తుంది… ఏమిటిలా అంటున్నాడు, వేక్సిన్ వేయించుకున్నాను ఇప్పుడెలా మరి అని గుబులు రేగుతుంది… వేక్సిన్ వేసుకోనివాళ్లకు మరింత దిగులు, టీకా వద్దంటే ఓ తంటా, వేసుకుంటే ఇదేం పెంట అన్నట్టుగా ఊగిసలాట… మూడునాలుగు రోజులుగా వాట్సపులో తెగ చక్కర్లు కొడుతున్నది ఆయన పేరిట ఉన్న మెసేజ్… ఓసారి చూడండి…
అసలు వాట్సప్ మెసేజులంటేనే ఫేక్ అని జనానికి తెలిసిపోయిందిగా… అందుకే ఫేకర్లు ఈమధ్య నమ్మేలా కొన్ని కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు… ఈ మెసేజులో చూడండి, వాడెవడో వార్త రాసినట్టుగా ఓ లింకు, ఓ వికీపీడియా లింకు ఇచ్చారు… అవెవరూ ఓపెన్ చేయరు, ఓహో, బాగా స్టడీ చేసి మెసేజ్ రాసినట్టున్నారు సుమీ అనుకోవాలనేది ఈ ఫేకర్ల ఎదవయిడియా… ఎస్.., లుక్ మాంటేనర్ పేరున్న ఈ వ్యక్తి ఓ ఫ్రెంచ్ వైరలాజిస్టు… హెచ్ఐవీ వైరస్ కనిపెట్టినందుకు 2008లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది… కానీ స్వతహాగా వేక్సిన్లకు వ్యతిరేకి… ఆయన కారణాలు ఆయనకున్నయ్… కానీ నోబెల్ ప్రైజ్ తరువాత అనేక అంశాల్లో యాంటీ-సైన్స్ వ్యాఖ్యలకు, వాదనలకు దిగాడు… చివరకు సైంటిఫిక్ సర్కిల్ ఆయన్ని దాదాపు వెలివేసింది… తరువాత ఇక ఆయన ఏమేం వ్యాఖ్యలు చేసినా సరే ఎవరూ పట్టించుకోవడం లేదు, వదిలేశారు… అదీ ఆయన కథ…
Ads
ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వాట్సప్ మెసేజ్ ఎలా ఫేక్ మెసేజో ఆల్ట్ న్యూస్ అనే నిజనిర్ధారణ (ఫ్యాక్ట్ ఫైండింగ్) సైటు సవివరంగా ఓ ఆర్టికల్‌లో తేల్చిపడేసింది… ఇదీ లింకు… https://www.altnews.in/whatsapp-hoax-claims-nobel-laureate-said-all-vaccinated-people-will-die-within-2-years/ ఆయన అనని మాటల్ని కూడా అన్నట్టుగా ఏదో ఒకటి రాసిపడేసినట్టు తేలిపోయింది… సో, టీకా తీసుకుంటే చచ్చిపోతామనే భయం అనవసరం… ఇదుగో, ఇలాంటి ఫేక్ మెసేజులకు వాట్సప్ ప్రసిద్ధి కాబట్టి.., ప్రమాదకరమైన ఇలాంటి ఫేక్ మెసేజులకూ అడ్డంకి లేదు కాబట్టి.., పైగా వాట్సప్ మెసేజులు ఎన్క్రిప్టెడ్ రక్షణలో ఉంటాయి కాబట్టి… ఎవడైనా కంప్లయింట్స్ చేసినా ఆ సంస్థ పట్టించుకోదు కాబట్టి… కేంద్ర ప్రభుత్వం వాట్సప్ మీద గుర్రుగా ఉంది… ఆమధ్య తీసుకొచ్చిన సోషల్ మీడియా గైడ్ లైన్స్‌కు అనుగుణంగా వ్యవహరిస్తానని చెప్పడం లేదు… కొన్నాళ్లు వాట్సప్ మీద నిషేధం విధించే అవకాశం కూడా ఉందనే ప్రచారం ఢిల్లీలో సాగుతోంది… ఆ సంస్థ గోప్యత పేరిట ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది… వేచి చూడాలిక…!! వాట్సప్‌కు పగ్గాలు వేయగలదా…?!
Share this Article