‘‘ఎవరైనా కరోనా వల్ల చనిపోతే, వాళ్ల వారసులకు ప్రభుత్వం 4 లక్షల పరిహారం చెల్లిస్తుంది… ఫలానా ఫారంలో వివరాలు నింపి కలెక్టర్లకు పంపించండి…’’ ఈ మెసేజ్ వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది… చాలామందికి డౌట్… నిజంగా ప్రభుత్వం ఇస్తుందా..? ఎవరికైనా ఇచ్చారా..? ఎవరిని అప్రోచ్ కావాలి..? ఎలా అప్లయ్ చేయాలి..? నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రభుత్వ వ్యవస్థలోనే చాలామందికి తెలియవు… ఓసారి ఆ వివరాల్లోకి వెళ్దాం…
మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఓ చట్టం ఉంది… అందులో సెక్షన్ 12(3) ప్రకారం ప్రభుత్వం విపత్తు మృతుల పేరిట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది… కరోనాను కూడా విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది… కాబట్టి కరోనా మృతులకు సంబంధించిన పరిహారాన్ని మృతుల వారసులకు చెల్లించాలి… అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే..?
Ads
- స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాలా.? సెంట్రల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి చెల్లించాలా..? ఎవరికీ క్లారిటీ లేదు…
- అసలు మన ప్రభుత్వ వ్యవస్థలో పరిహారాల చెల్లింపు, దరఖాస్తు, ఆమోదం తదితరాలకు ఎంత తిరగాలో, ఎంత అవస్థ పడాలో తెలుసు కదా… పైగా ఇప్పుడు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాలకు సరిగ్గా రావడం లేదు…
- కరోనా మృతులకు పోస్ట్ మార్టమ్స్ ఏమీ చేయడం లేదు.
- ఏకరీతి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు… డెత్ సర్టిఫికెట్ ఎలా ఉండాలనే విధానంపై కేంద్రానికి, రాష్ట్రాలకు నడుమ సమన్వయం లేదు, స్పష్టత లేదు…
- పలుచోట్ల మృతుల బంధువులు అడిగితే డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు కానీ గుండె సంబంధ సమస్య లేదా ఛాతీ ఇన్ఫెక్షన్ వంటి కారణాలు రాస్తున్నారు తప్ప అందులో కరోనా వల్ల మరణం అని రాయడం లేదు…
- గత ఏడాది ఈ పరిహారం స్కీం ఉండేది…
అందుకే ఎక్కడా ఈ పరిహారం చెల్లింపుల్లేవ్… కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిహారాల చెల్లింపులకు సంబంధించి ప్రతిపక్షాలు నిలదీస్తున్నయ్… దీని మీద సుప్రీంకోర్టులో కేసులు పడ్డయ్… నాలుగైదు రోజుల క్రితం విచారణ జరిగింది… జూన్ 11కు వాయిదా వేసింది… ఈలోపు డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయో, పరిహారాలకు సంబంధించి కేంద్రం కొత్త పాలసీ ఏమిటో తనకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది… చాలామంది పేదలు కరోనా వల్ల మరణిస్తున్నారు… వాళ్ల కుటుంబాలు బజార్న పడుతున్నయ్… అనాథలైన పిల్లలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు సొంతంగా ‘స్పెషల్ రిలీఫ్ స్కీమ్స్’ ప్రకటిస్తున్నయ్… ఆ పిల్లల చదువు, నెలకు కొంత భృతి బాధ్యతను తీసుకుంటున్నయ్… అభినందనీయం… కానీ ఇంకొన్ని రాష్ట్రాల పాలకులకు ఆ ‘హ్యూమన్ టచ్’ సోయి కూడా లేదు… (ఏపీలో అలాంటి అనాథ పిల్లలకు 10 లక్షల డిపాజిట్ అని జగన్ ప్రకటించాడు, ఇప్పటికే 78 మందికి ఈ పథకం అమలుచేశారు కూడా… తెలంగాణలో ఇలాంటి మానవీయ స్పర్శ ఏమీ కనిపించడం లేదు)… కేంద్రం కరోనా సంబంధమైన చాలా ఇష్యూల్లాగే ఇందులోనూ ఒక అమానవీయ స్తబ్దత ప్రదర్శిస్తోంది… ఈ స్థితిలో డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి గనుక మృతుల వారసులకు 4 లక్షల పరిహారం లభిస్తే, ఆయా కుటుంబాలకు కొంత ఆసరా అవుతుంది… సుప్రీం కోర్టు ఏం చెబుతుందో చూడాలి..!!
Share this Article