……. By ….. Ashok Vemulapalli……….. తప్పెవరిది..?
అవును … వాడిని చంపింది నేనే.. వాడు చేసిన పాపానికి ముక్కలు ముక్కలుగా నరికి, నా పొలంలో పూడ్చిపెట్టా.. ఇది తప్పే అయితే నన్నూ ఊరితీయండి.. కానీ ప్రేమ పేరుతో చిన్నపిల్లలని వల్లో వేసుకునే ఇలాంటి కామాంధుల్ని మాత్రం బతకనీయకండి.. ఒక ఆడపిల్లను కన్న తండ్రిగా ఆవేదనతోనే హత్య చేశాను.. చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసుల ముందు పెంగరకుంటకు చెందిన రైతు సున్నపుబాబు అన్నమాటలివి.. హత్య చేసేంత నేరం ఏం చేశాడు అతను అని అడిగారు పోలీసులు..16 ఏళ్ల వయసున్న నా కూతుర్ని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు.. నా కూతురు చిన్నపిల్ల, ఆమెని వదిలేయమని ఎన్నోసార్లు ప్రాధేయపడ్డాను.. బతిమాలాడాను.. బెదిరించాను, కానీ అతను వినలేదు.. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అతను నా కూతురుతో బెడ్ రూమ్ లో కనిపించాడు.. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్నిఆ పరిస్థితుల్లో చూసిన ఏ తండ్రైనా ఏం చేస్తాడు.. నేనూ అదే చేశాను.. కర్రతో తల పగులగొట్టాను. తెలిసీ తెలీని వయసులో మాయగాడి మాటలకు లొంగిపోయిన నా కూతురు ఏం చేయాలో అర్థంగాక పిచ్చిచూపులు చూస్తూ కూర్చుండిపోయింది…
Ads
చెప్పినా మాట వినని కూతురు, ఏకంగా తన ఇంటికే వచ్చేసి భర్త చేతిలో హత్య కుగురైన యువకుడు, కాలయముడిలా నిలబడి ఉన్న భర్తను చూసి ఆందోళనలో మునిగిపోయింది నా భార్య సుజాత.. అతను చనిపోయాడని నిర్ధారించుకుని శవాన్ని మూటగట్టి ట్రాక్టర్ లో వేసుకుని ఊరి చివర వ్యవసాయ బావిలో పడేశా.. రెండోరోజు శవం బావిలో తేలింది.. అందుకే మళ్లీ అక్కడి నుంచి శవాన్ని బయటకు తీసి పొలానికి తీసుకెళ్లా.. అక్కడ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికా.. ఆ ముక్కల్ని పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పూడ్చిపెట్టాను.. అప్పుడు నా మనస్సు శాంతించింది. ఒక మనిషిని ఈ రకంగా చంపేయడం తప్పేనని నాకు తెలుసు.. పోలీసులకు నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు.. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకన్నా ఏమీ చేయలేను.. నా జీవితం నాశనమయినా పర్వాలేదు… కానీ ఇంకో ఆడపిల్లను ఇంకే మగాడు వేధించాలన్నా ఇలా చంపేస్తారని భయపడాలి.. చదువుకుంటున్న ఆడపిల్లల్ని ప్రేమ పేరుతో వారి శరీరాలతో ఆడుకున్న ఇలాంటి దుర్మార్గులకు ఈ చావు గుర్తొచ్చి గుండెల్లో వణుకు పుట్టాలి.. అని సున్నపు బాబు అంటుంటే పోలీసులు ఆశ్చర్యపోయారు…
రెండురోజుల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరకుంట గ్రామంలో జరిగిందీ ఘటన.. అదే గ్రామానికి చెందిన ధనశేఖర్ అనే 24 ఏళ్ల యువకుడిని 16 ఏళ్ల బాలిక తండ్రి బాబు హత్య చేశారు. ఇది సంచలనం సృష్టించింది.. తన కొడుకు కనిపించడం లేదని అతను ఫలానా అమ్మాయి ఇంటికే వెళ్లాడని, అతని తండ్రి మీదే అనుమానం ఉందని ధనశేఖర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బాబుని విచారించడంతో ఈ వ్యవహారం బయకు వచ్చింది. బాబుకు చెందిన పొలంలోనే తవ్వితే ధనశేఖర్ శరీరం ముక్కలు దొరికాయి.. కాళ్లు, చేతులు, నడుము, తల ఇలా ఎనిమిది ముక్కలుగా నరికి పూడ్చిపెట్టాడు బాబు.. కన్నకొడుకు మృతదేహాన్నిచూసిన తండ్రి ఈశ్వర్ గౌడ్ కుప్పకూలిపోయాడు.. అతని బంధువర్గమంతా బాబు ఇంటిపైకి దాడికి వెళ్లారు.. అప్పటికే బాబు, అతని భార్య సున్నపు సుజాతను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.. ఈ కేసులో బాలికను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. హత్యకేసులో ఆమె పాత్ర లేకపోయినప్పటికీ ఆమె ధనశేఖర్ ను ఫోన్ చేసి ఇంటికి పిలిపించిందని తేల్చారు పోలీసులు..
Share this Article