.
ఇది ఐపీఎల్… మ్యాచు మ్యాచుకూ పాయింట్లలో తేడా వస్తూ… పాయిట్ల టేబుల్‌లో ప్లేసు మారుతూ పోతుంది… రాజస్థాన్ రాయల్స్‌లో మంచి ఆటగాళ్లు లేరా..? ఉన్నారు… కానీ ఎంతసేపూ ఆ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ మీదే ఆధారపడి, తప్పులు చేస్తోంది… రాత్రి గుజరాత్ టైటాన్‌తో జరిగిన మ్యాచులో కూడా అదే కనిపించింది… బుడ్డోడు బుల్‌డోజరే… కానీ ప్రతిసారీ క్లిక్ కావాలని ఏమీ లేదు… తనేమీ పరుగుల యంత్రం కాదు, మనిషే…
పైగా ఇతర జట్లు తన బలహీనతల్ని క్రమేపీ కనిపెడుతూ దాడి చేస్తున్నాయి… నిన్నటి మ్యాచు చూస్తే… తను ఆడుతున్నంతసేపు జైస్వాల్ ఎంతసేపూ తనకే స్ట్రయిక్ ఇచ్చేశాడు, కానీ వైభవ్‌కు సరైన తోడు కాలేకపోయాడు… ఎదురుగా గుజరాత్ జట్టు ఏకంగా 229 రన్స్ టార్గెట్ పెట్టింది… ఫస్ట్ వికెట్‌కు సాయి సుదర్శన్, గిల్ కలిపి 118 పరుగుల పార్టనర్‌షిప్‌తో మంచి పునాది వేశారు…
Ads
కానీ రాజస్థాన్ జట్టులో వైభవ్ 36 పరుగులకే ఔటయినా సరే, పవర్ ప్లేను బాగానే వాడుకున్నాడు… 16 బాల్స్‌లోనే ఆ పరుగులు చేసి, పునాది బాగానే వేశాడు… కానీ ఏం ఫాయిదా..? వరుసగా వికెట్లు పడుతూ పోయాయి… రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు, 152 రన్స్‌కు ఆలౌట్, కనీసం మొత్తం 20 ఓవర్లు కూడా ఆడలేకపోయారు…
అంతకుముందు రాజస్థాన్ ఫీల్డింగ్ కూడా పేలవంగా ఉంది… బౌలింగులో కూడా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేశారు… ఒక దశలో రెండో ప్లేసులో ఉన్న రాజస్థాన్ తరువాత నిలకడ ఆటతీరు చూపించలేక… ఇప్పుడు గుజరాత్ కొట్టిన దెబ్బతో ఐదో ప్లేసులోకి పడిపోయింది… మరోవైపు అంతంతమాత్రం ఆటతీరుతో పడుతూ లేస్తూ ఉన్న గుజరాత్ వరుసగా నాలుగు విజయాలతో ఏకంగా రెండో ప్లేసుకు వెళ్లిపోయింది…
కాస్త నెట్ రన్ రేట్ తక్కువైంది గానీ… ఫస్ట్ ప్లేసులోకి వెళ్లిపోయేది హైదరాబాద్ జట్టును దాటేసి… అంతా రాజస్థాన్ స్వయంకృతమే… ఐపీఎల్ మెల్లిమెల్లిగా ఓ కొలిక్కి వస్తోంది… హైదరాబాద్, బెంగుళూరు, పంజాబ్ బలంగా కనిపిస్తున్నాయి… తాజాగా గుజరాత్ వచ్చి చేరింది… రాజస్థాన్ కోలుకుంటే, తప్పులు దిద్దుకుంటేనే పోటీలో ఉంటుంది, లేకపోతే మరింత దిగువకే..!!
Share this Article