Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాజు గ్లాసులో చాయ్… ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తాగుతుంటే…

May 21, 2026 by M S R

.

… చాయ్ అంటే… ఒక్క గుక్క తాగితే చాలు, లేదా అలా చప్పరిస్తే చాలు… ఇక చాలాసేపు నాలుక మీద ఉండిపోవాలి రుచి, ఫ్లేవర్, చిక్కదనం, లుక్కు…! అల్లం, యాలకుల పొడి గట్రా ఏమీ వేయకుండా కేవలం టీ పొడి, చక్కెర, పాలతో మాత్రమే ఆ టేస్టు తీసుకురాగలిగినవాడే అసలైన టీ సెల్లర్…
.
ఇప్పుడు టీ బ్యాగులు, వితవుట్ మిల్క్, బ్లాక్ టీ, మూలికా చాయ్ గట్రా గట్రా ఏమేమో వచ్చాయి… ఒరిజినల్ చాయ్ అంటే అవేవీ కావు…
.
అదీ ప్లాస్టిక్ కప్పుల్లో, పేపర్ కప్పుల్లో కాదు… పింగాణీ కప్పుల్లో, స్టీల్ గ్లాసుల్లో అసలే కాదు… గాజు గ్లాసుల్లో తాగితేనే (సీస గిలాస), గ్లాసును ఉఫ్ అంటూ, చేతులు మార్చుతూ… కొద్దికొద్దిగా తాగితేనే ఆ మజా… చాయ్ అంటే ఓ ఎక్స్‌పీరియెన్స్… ఓ ఫీల్… ఆ పేపర్ కప్‌లో తాగుతుంటే మూతి కాలి, చేతులు కాలి… అసలు ఎందుకు తాగాలి అనేంత వైరాగ్యం…

.

Ads

సుగర్ రోగం ప్రబలాక… చక్కెర బంద్, ఎవరెవరో చెబుతున్నారని పాలూ బంద్… జస్ట్, బ్లాక్ టీ… అందులో మజా ఏముంది అసలు..? తాగకపోతే పాయె… ఒక్క పూట తాగినా పర్‌ఫెక్ట్ చిక్కటి టీ తాగినా చాలు… వాహ్ తాజ్ అని తబలా వాయిస్తూ లొట్టలేసేంత మజా లేకపోయినా సరే, తాగినంత సేపయినా ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి..!
.
ఇప్పుడు బయట గాజు గ్లాసులు బంద్… జస్ట్, మరగబెట్టీ బెట్టీ ఆ పే-ద్ద ఫ్లాస్కుల్లో ఉన్నదాన్నే అలా జస్ట్, నొక్కి, పేపర్ కప్పులో పోసి, ఇచ్చేయడమే… స్పెషల్ చాయ్ తయారు చేసి పోస్తావా అంటే… కుదరదు అని నిష్కర్షగా చెప్పేస్తున్నారు…

.

ఇప్పుడంటే హైదరాబాదులో వాడకొక టీ సెంటర్లు వచ్చాయి… అల్లం చాయ్, మసాలా చాయ్, బెల్లం చాయ్ గట్రా రకరకాలు… నిజానికి అవి చాలాచోట్ల పక్కాగా స్మోకింగ్ సెంటర్లు… చాయ్ షాప్ కమ్ పాన్ షాప్…
.
ఆ ఫ్లాస్కుల్లో నిల్వ చేసిన ఆ తెగమరిగిన చాయ్‌కు టీ టేస్టు ఉండదు, చిక్కగా ఉండదు, ఏ ఫ్లేవరూ ఏడవదు… లుక్కు మరీ దయనీయం… నిజమే… ఓ మంచి చాయ్ దొరకడం గగనం అయిపోతోంది…. మరీ బంజారా హిల్స్ నీలోఫర్ రేటు కాకపోయినా ఎంతో కొంత ఎక్కువ చెల్లించడానికి రెడీ అయినా సరే… నిజానికి నీలోఫర్ టేస్ట్ కూడా ఎప్పుడో దెబ్బతినిపోయింది…

.

యాంకర్ సుమ చెప్పింది కదాని వాఘ్ బక్రీ టీపొడి తెస్తే, అది ఘోరంగా ఉంది… ఏదో సాయంత్రాలు అలవాటైన ఇష్టలిక్కర్ కంపెనీ, జానీవాకర్ రెడ్ లేబుల్ పేరుందని ఆ టీపొడి తెస్తే అదీ అంతే… మంచి చాయ్ దొరకడం కాదు, అసలు మార్కెట్‌లో మంచి ‘చాయ్ పత్తా’ కూడా దొరకడం లేదు… ఆమధ్య రంగు, రుచి, చిక్కదనం అని త్రీరోజెస్ యాడ్స్ వచ్చేవి… ఆ మూడూ ఉండటం లేదు…
.
గతంలో హైదరాబాద్ ఇరానీ కేఫుల్లో టీ డిఫరెంటు టేస్టుతో ఉండేది… అదీ ఇప్పుడు కరువు… పౌనా అయితే అసలు అమ్మేవాడే లేడు… కొంతలోకొంత మినర్వా వాడి మసాలా టీ (యాలకుల చాయ్) కాస్త బాగుంటుంది… కొందరికి గ్లాసుల్లో కాదు, కప్పుసాసర్లలో తాగితేనే ఆనందంతో కళ్లు అరమోడ్పులు…
.
(ఈరోజు చాయ్ దినమట…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టెట్రా ప్యాక్ మద్యం నష్టదాయకం… సుప్రీంకోర్టు ఆగ్రహం …
  • గాజు గ్లాసులో చాయ్… ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తాగుతుంటే…
  • ఇప్పుడిలాంటి కథలు కామన్… ఈమె 2003 లోనే చేయించేసింది…
  • ‘పార్లే’ అనబడు ఓ పరమానందయ్య శిష్యుల కథ ఏమిటనగా..!!
  • పాకిస్థాన్ ఏమీ మారలేదు… అప్పు కోసం ఓ హెరిటేజ్ వేషం, అంతే…
  • చిన్న స్కిట్ అయినా సరే… స్క్రిప్టు పక్కాగా ఉండాలోయ్…
  • Raja Shivaji … చిన్న ఇండస్ట్రీ నుంచి పెద్ద హిట్… విశేషాలివిగో…
  • మీడియా ర్యాంకులకూ, జర్నలిస్టు అజ్ఙాన ప్రవర్తనకూ లింకేమిటబ్బా..!!
  • అదే నాగబాబు… అదే హైపర్ ఆది… అవే పాత టీమ్స్… మళ్లీ జనసేన షో…?
  • ఏ సీఎంకన్నా యోగి 17 వేల రెట్లు బెటర్… ఎవడు ఒప్పుకోకపోయినా సరే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions