Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ ప్రయోజనాల్ని ‘తుంగ’లో తొక్కిందెవరు హరీష్ సాబ్..?!

June 25, 2026 by M S R

.

  • యథో హస్త తథో దృష్టి
    యథో దృష్టి తథో మనః
    యథో మనః తథో భావ
    యథో భావ తథో రసః

 

చేతులు ఎటువైపు ఉంటాయో దృష్టి అటువైపు; దృష్టి ఎటువైపు ఉంటుందో మనసు అటువైపు. మనసు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు. భావం ఎటువైపు చూస్తుందో రసం ఆ భావనతోనే పెల్లుబుకుతుంది. నిజానికి ఇది నాట్యశాస్త్రంలో ఓ నీతిపాఠం.

Ads

…. దీన్ని వర్తమాన  బీఆర్ఎస్ పరిభాషలో చెప్పాలంటే… చేతలు ఎటువైపు అలవాటుపడ్డాయో దృష్టి అటువైపు,, ద‌ృష్టి ఎటువైపు ఉంటుందో మనసు అటువైపు, మనసు ఎటువైపు ఉంటుందో భావం అటువైపు, భావం ఎటువైపు చూస్తుందో విమర్శ, కళ్లు, భాష, భావం అటువైపే పెల్లుబుకుతుంది…

….. ఎందుకిలా చెప్పుకోవడం అంటే..? అసలు మెట్రో విలువే 13,600 కోట్లు అయితే, కేటీయార్ ఏమంటాడు..? 30 వేల కోట్లు మింగడానికి రేవంత్ ప్లాన్ అంటాడు. ఒకవైపు జైపూర్ మోడల్‌లో కేంద్రం- రాష్ట్రం సమభాగస్వామ్యం అని రేవంత్ చెబుతుంటే, అడుగుతుంటే… ఇక మెట్రో ఆస్తులు అమ్ముకునే చాన్స్ ఏముంది? ఏమీ లేదు… తను ఓఆర్ఆర్‌ను అడ్డికిపావుశేరులా అమ్ముకున్నట్టే అనుకున్నాడు… యథో మనః తథో భావ అంటే ఇదే… (మెట్రో ఆస్తులపై అంత సీన్ ఉంటే, కేటీయార్ ఎప్పుడో కబళించేవాడు కాదా?)

ఇక హరీష్ రావు ఉన్నాడు, మరీ దాసోజు శ్రవణ్‌తో పోటీపడుతున్నాడు… తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు, అక్కడికి కర్నాటక, ఏపీ సీఎంలు, కేంద్ర జలశక్తి మంత్రి వస్తున్నాడు అని తెలియగానే… తన పాత ఇరిగేషన్ కోవర్టులతో అర్జెంటుగా ఓ లేఖ రాయించుకుని, రేవంత్‌కు పంపిస్తున్నట్టు మీడియాకు పంపించేసి, ఆర్డీఎస్‌లో పేరుకుపోయిన బురద-పూడిక స్థాయిలో రేవంత్‌పై జల్లడానికి పూనుకున్నాడు…

ఆ మీటింగుకు వెళ్తున్నాడు కాబట్టే రేవంత్ అప్పటికప్పుడు తుంగభద్ర ఇష్యూస్‌పై ఇరిగేషన్ మినిస్టర్, ఉన్నతాధికారులతో సమీక్ష పెట్టుకున్నాడు… డీకే, బాబులతో భేటీ చాన్స్ వస్తే ఏమేం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యాడు… ఏ ముఖ్యమంత్రీ తన రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలతో ఆడుకోడు, కేసీయార్- హరీష్ రావు తప్ప… అందరూ తమలాగే అనుకున్నాడు హరీష్…

కమీషన్ల కాళేశ్వరం యావలోపడి దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల్ని పండబెట్టింది బీఆర్ఎస్… పదేళ్ల స్వరాష్ట్ర పాలనలో క‌ృష్ణా ప్రాజెక్టులను పట్టించుకుని ఉంటే మనకు కృష్ణా జలాల్లో అధికవాటాకు అవకాశం ఉండేది. అంత ఆలోచిస్తే బీఆర్ఎస్ ఎందుకు అవుతుంది..?

పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్ట్ నిర్మాణవేళ కళ్లు మూసుకుని, తమ జాన్‌జిగ్రీ దోస్త్ జగన్ కోసం తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు..? కేసీయార్ కాదా..? రోజా ఇంట్లో దావత్ తీసుకుని రాయలసీమను రత్నాల సీమను చేస్తానని హామీల వరద గుప్పించింది ఎవరు..? కేసీయార్ కాదా..? చెబుతూ పోతే బొచ్చెడు. కనీసం ఆర్డీఎస్ మీద పోరాడగలిగాడా కేసీయార్..?

తుమ్మిళ్ల, బీమా, పాలమూరు- రంగారెడ్డి, ఆర్డీఎస్ తదితర ప్రాజెక్టుల గురించి పట్టించుకున్నది ఏముంది..? ఇప్పుడేమో కొడంగల్ లిఫ్టు కోసం కర్నాటక తుంగభద్ర ఎగువన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి ఎన్వోసీలు ఇచ్చాడని బురద జల్లుతున్నాడు హరీష్…

సరే, రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడే అనుకుందాం, సపోజ్ ఫర్ డిబేట్… మరి పదేళ్లు వేల కోట్ల సంపాదించిన ‘వీర తెలంగాణ ప్రయోజన యోధులు’ కృష్ణా మేనేజ్‌మెంట్ బోర్డు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, కేంద్ర జలశక్తి శాఖ నుంచి సుప్రీంకోర్టు దాకా… ఉద్యమ పార్టీగా డప్పుకొట్టుకునే పార్టీకి ఎందుకు ఆ వేదికలను ఆశ్రయించలేదు? దక్షిణ తెలంగాణకు, ప్రత్యేకించి కృష్ణా ప్రాజెక్టులపై కేసీయార్ పార్టీ నిర్వాకాలు చెప్పాలంటే ఉద్గ్రంథాలు కావాలి… అందుకే చెప్పింది…

యథో హస్త తథో దృష్టి
యథో దృష్టి తథో మనః
యథో మనః తథో భావ
యథో భావ తథో రసః

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?
  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!
  • డేటా సెంటర్లు వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
  • పాకిస్థాన్ ప్రతీకార ఆశలపై నీళ్లు … గుమ్మరించింది ఇండియా కాదు, శ్రీలంక !!
  • చైత్ర ! బిగ్‌బాస్ పైత్యానికి బలి … 4 రోజులకే ఇద్దరు ఔట్ ఏమిట్రా !!
  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…
  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions