.
Pardha Saradhi Upadrasta …. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సంచలనం: ఓబీసీ రిజర్వేషన్లు 7 శాతానికి కుదింపు. ఓబీసీ జాబితా నుండి ముస్లింల తొలగింపు!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సోమవారం నాడు (జూన్ 29, 2026) ఒక పెను సంచలనం నమోదైంది.
ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు కీలక ఓబీసీ సవరణ బిల్లులు భారీ మెజారిటీతో ఆమోదం పొందాయి. గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం పెంచిన 17 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఈ బిల్లు ద్వారా తిరిగి 7 శాతానికి కుదించారు. అలాగే, ఓబీసీ జాబితా నుండి ముస్లిం సామాజిక వర్గాలను పూర్తిగా తొలగించారు.
Ads
నేపథ్యం ఏమిటి?
గత ప్రభుత్వ హయాంలో ఓబీసీ రిజర్వేషన్లను 17 శాతానికి పెంచడంతో పాటు అనేక కొత్త సామాజిక వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చారు. ఇందులో అధిక సంఖ్యలో ముస్లిం సామాజిక వర్గాలు కూడా ఉండటంతో, దీనిపై చాలాకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో గతంలో కలకత్తా హై కోర్టు కొన్ని చేర్పుల చట్టబద్దతను ప్రశ్నిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా మత పరంగా రిజర్వేషన్ లు రాజ్యాంగ పరంగా చెల్లవు. ఏ వర్గాన్ని అయినా ఓబీసీ లలో చేర్చాలి అంటే ఓబీసీ కమీషన్ ద్వారా సమగ్ర సర్వే చేసి మాత్రమే ఇవ్వాలి అని అప్పటి జీఓ ను హై కోర్టు కొట్టేసింది. అప్పటి మమత ప్రభుత్వం ఈ హై కోర్టు తీర్పుపై సుప్రీంకు అప్పీల్ కు వెళ్లింది. ఈ ప్రభుత్వం రాగానే ఆ అప్పీల్ ను కోర్టు నుండి వెనక్కి తీసుకొని ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తాను అని చెప్పింది.
కొత్త సవరణ బిల్లులోని ముఖ్యాంశాలు
✅ 1. ఓబీసీ రిజర్వేషన్లు 7 శాతానికి
గతంలో 17 శాతంగా ఉన్న ఓబీసీ రిజర్వేషన్లను తిరిగి 7 శాతానికి పరిమితం చేసింది. ప్రభుత్వం దీనిని అసలు చట్టబద్ధమైన వ్యవస్థ పునరుద్ధరణగా అభివర్ణిస్తోంది.
✅ 2. ముస్లిం వర్గాల తొలగింపు
గతంలో ఓబీసీ జాబితాలో చేర్చిన ముస్లిం సామాజిక వర్గాలను తొలగించింది. ప్రభుత్వం వాదన ప్రకారం, రిజర్వేషన్లు మతం ఆధారంగా కాకుండా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే ఇవ్వాలని రాజ్యాంగం సూచిస్తోంది.దానికి మేము కట్టుబడి ఉన్నాం
✅ 3. 66 చట్టబద్ధమైన ఓబీసీ వర్గాలకు మాత్రమే ప్రయోజనం
కొత్త చట్టం ప్రకారం ఇప్పటికే గుర్తింపు పొందిన 66 ఓబీసీ కేటగిరీలకే రిజర్వేషన్ వర్తించేలా నిబంధనలు రూపొందించారు.
✅ 4. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్‌కు అధికారం, భవిష్యత్తులో ఏ వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలన్నా లేదా తొలగించాలన్నా, సంబంధిత సామాజిక, విద్యాపరమైన అధ్యయనం అనంతరం బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకునే విధానం తీసుకొచ్చారు. సుప్రీం కోర్టు కూడా స్పష్టంగా ఇదే చెప్పింది.
రాజకీయ ప్రభావం
గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం మైనారిటీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి ముస్లింలను ఓబీసీ కేటగిరీ ‘A’ , ‘B’ లలో చేర్చిందని బీజేపీ మొదటి నుండి ఆరోపిస్తోంది. ఈ కొత్త బిల్లు ఆమోదంతో మమతా బెనర్జీ కాలం నాటి ఓబీసీ విస్తరణ పూర్తిగా రద్దయినట్లయింది. నిజమైన వెనుకబడిన హిందూ సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికే ఈ చట్టాన్ని తెచ్చినట్లు సీఎం సువేందు అధికారి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ చట్టం తక్షణమే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా సంస్థల అడ్మిషన్లలో అమలులోకి రానుంది. రాబోయే రోజుల్లో ఇది బెంగాల్ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది!. — UPS
#WestBengal #OBCReservation #Reservation #BJP #TMC #IndianPolitics #SocialJustice #PardhaTalks
Share this Article