Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుటుంబం విచ్ఛిన్నమవుతోంది ! పసి మనస్సులపై దారుణ ప్రభావం !!

July 14, 2026 by M S R

.

ఓ సింగిల్ కాలమ్ వార్త కనిపించింది… మనసు కలిచివేసింది… ఆంధ్రజ్యోతిలో కనిపించింది, మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో ఇండికేషన్ కూడా ఉంది, సరైన ప్రయారిటీ అనిపించింది… మిగతా పత్రికల్లో భూతద్దంతో వెతికాను, కానీ కనిపించలేదు… డెస్కుల్లో సెన్సిటివిటీ తగ్గిపోవడం!! (నమస్తే వంటి అపాత్రికేయం, దానికి సరైన దీటు సాక్షిని వదిలేస్తే, ఈనాడులో సరైన ప్రయారిటీతో వార్త ఎక్స్‌పెక్ట్ చేసి భంగపడ్డాను, గతంలో ఈనాడు బాగానే ఉండేది పాపం)…

నిజానికి ఇంపార్టెంట్ వార్త… సమాజం, కుటుంబం పరిణామగతిని పట్టిచూపే ఓ చిన్న మెతుకు… ఎందుకంటే… గతంలో పోలిస్తే ఇళ్లల్లో భార్యాభర్తల గొడవలు పెరిగాయి… మద్యపానం, అక్రమ సంబంధాలు ఎట్సెట్రా చాలా కారణాలు… ఇప్పుడు ఆడది గతంలోగా ఊరుకోవడం లేదు… భర్తతో అన్ని విషయాల్లోనూ కాంప్రమైజ్ కావడం లేదు, ఈ బంధం ఉంటే ఎంత..? పోతే అంత..? అనుకుంటోంది..! సగటు కుటుంబం నిన్నటిలా లేదు… వేగంగా మారిపోతోంది…

Ads

ఆమె తగాదా పడుతోంది, నిలదీస్తుంది.., మరీ అక్రమ సంబంధాల విషయమైతే భర్తను, పిల్లల్ని కసకసా… ఏమైనా కానీ, ఏమైనా రానీ, రెడీ అంటోంది… ఇక్కడ ఎవరిది తప్పు అని కాదు చర్చ… కుటుంబంపై, ప్రత్యేకించి పిల్లలపై పడే ప్రభావం!! ఇది ఒకవైపు ఇళ్లల్లో పిల్లల మనస్సులపై దారుణమైన ముద్రల్ని వేస్తోంది… కొందరు ఠారెత్తిపోతున్నారు, ఇంకొందరు దారితప్పుతున్నారు… సొసైటీ ఘోరంగా పొల్యూట్ అయిపోతోంది… ఈ వార్త చదవండి ఓసారి…

కొడుకు



రేపటి కోసం గొప్ప కలలు కన్నాడు… కన్న తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలనుకున్నాడు. కానీ, అమ్మా-నాన్న నిత్యం గొడవ పడుతుండడం చూసి తట్టుకోలేకపోయాడు. మద్యం మత్తులో వచ్చి నాన్న రోజూ అమ్మతో గొడవ పడుతుంటే.. తనేరాజీ చేద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, ఆ పసి హృదయం అర్ధంతరంగా తనువు చాలించింది.

హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది. గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన ఎల్లయ్య, అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. ఎల్లయ్యకు ప్రతి రోజు మద్యం తాగిరావడం, భార్యతో గొడవ పడడం అలవాటుగా మారింది.

భర్త వేధింపులు భరించలేక భార్య కూడా ఎదురు తిరిగేది. ఈనెల 11న రాత్రి కూడా ఎల్లయ్య తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రివేళ తల్లిదండ్రులు కొట్టుకునే స్థాయికి వెళ్లడం చూసి, కుమారుడు మోహన్ (15) జోక్యం చేసుకున్నాడు. రోజూ ఇలా గొడవపడొద్దు నాన్నా. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోండి అంటూ సర్ధిచెప్పడానికి ప్రయత్నించాడు.

కోపోద్రిక్తుడైన ఎల్లయ్య నువ్వు ఎవడివిరా చెప్పడానికి? నాకే ఎదురు చెప్పేంత ధైర్యం వచ్చిందా? అంటూ కొడుకును తోసేశాడు. తీవ్ర మనస్థాపం చెందిన మోహన్, అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లి గుండెలు బాదుకుంటూ భోరున విలపించడం అక్కడి వారిని కలచివేసింది….



  • …. ఇదీ వార్త… సున్నితమైన గుండె, తట్టుకోలేకపోయింది, వాడి వయస్సు ఎంతని..? 15 ఏళ్లు… మనం చాలా చోట్ల గమనిస్తున్నాం… ఇళ్లల్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉంటే… పిల్లలు పక్కింటి వాళ్లను, ఎదురింటివాళ్లను పిలిచి, ఆంటీ, అంకుల్ కాస్త చెప్పండి అని ఏడిచే ఉదాహరణలు… ఎస్, పిల్లలపై నెగెటివ్ ప్రభావం పడుతోంది భారీగా… గాయపడుతున్నాయి…

ఇక్కడ మరి సామాజికవేత్తలు కొన్ని సమాధానాలు వెతకాల్సిన ప్రశ్నలున్నాయి… ప్రభుత్వానికి, మీడియాకు, పార్టీలకు పాపం తీరికలేదు, అవేమిటంటే..? 1) ఆ 15 ఏళ్ల పోరడికి చీరెతో ఆత్మహత్య ఎలా చేసుకోవాలో ఎలా తెలుసు..? సినిమాల్లో, టీవీల్లో చూడటం వేరు, దాని ఎగ్జిక్యూషన్ వేరు కదా… 2) అసలు ఆత్మహత్య చేసుకోవాలని ఎలా అనిపించింది..? ఆ వయస్సులో ఆత్మహత్య అనే సంకల్పం అంత బలంగా ప్రేరేపించడం అసాధారణం!! ఇలాంటి చిక్కు ప్రశ్నలు!! సమాజమా..? ఏవో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి..!!

సొల్లు పొలిటికల్ డిబేట్లు, బూతులు, నిందలతో సొసైటీ మొత్తాన్ని పంకిలం చేస్తున్న టీవీ చానెళ్ల ముఖ్యులూ... ఇవిరా సొసైటీ సీరియస్‌గా చర్చించాల్సింది!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కుటుంబం విచ్ఛిన్నమవుతోంది ! పసి మనస్సులపై దారుణ ప్రభావం !!
  • పక్క సీటులో ప్రఖ్యాత అందగత్తె – సో వాట్, నా బాధల్లో నేను…
  • ఆ నిత్యహారతి ప్రోటోకాల్ ఎప్పుడో రద్దు చేసి ఉండాల్సింది !!
  • తీయాల్సిన సినిమాయే ! కానీ అప్పుడే రిలీజును అడ్డుకుంటున్నారు !!
  • జూనియర్ ఊగిసలాట ! – ఏపీ సీఎం లక్ష్మిప్రణతి ? రెండూ వేర్వేరు !!
  • ఇప్పుడంటే జబర్దస్త్ టేస్ట్ గానీ… అప్పట్లో మల్లెమాల అంటే ఓ చరిత్ర !!
  • అర్జెంటీనా Vs ఇంగ్లండ్ … Ind -Pak క్రికెట్‌ను మించి ఎన్నో రెట్ల వైరం !!
  • భారతీయ వెండి తెరపై సంస్కృతం పలికించిన దర్శకుడు..!
  • రావణ్ – నాకు చాలా ఇష్టం… తనను నేనెందుకు ప్రేమిస్తానంటే..!?
  • ఐబీ అధికారిపై 51 కత్తిపోట్లు – ఆప్ నేత దురాగతం – నిర్దారించిన కోర్టు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions