.
మన టీవీ సెలబ్రిటీల్లో ఇద్దరు డిఫరెంట్ కేరక్టర్స్… అంటే, సరదాగా మాట్లాడుతూ, నవ్విస్తూ, అల్లరి చేస్తూ ఉండే రకం… అంటే అమాయకంగా ఏదేదో మాట్లాడేస్తూ నవ్వు పుట్టించే కేరక్టర్స్… ఒకరు సోనియా సింగ్, మరొకరు దీపిక రంగరాజు… సోనియా రూట్స్ నార్త్ కావచ్చు, కానీ హైదరాబాదులోనే పుట్టి పెరిగింది… దీపిక రంగరాజు తమిళియన్…
మన తెలుగు టీవీ సీరియల్స్ అంటేనే కన్నడ స్టార్స్… ధారాళంగా తెలుగు మాట్లాడేస్తూ పక్కా తెలుగువారిలా మారిపోతున్నారు… గుడ్… కానీ దీపిక తమిళియన్… (మరో ఫేమస్ పర్సనాలిటీ ప్రేమీ విశ్వనాథ్- మలయాళీ- కార్తీకదీపం ఫేమ్… అది తప్ప మరో సీరియల్ చేయదు)… సరే, విషయానికొస్తే…
Ads
బిగ్‌టీవీలో కిస్సిక్ అని మరో టీవీ సెలబ్రిటీ వర్ష షో చేస్తుంటుంది… పర్లేదు… అందులో ఓసారి దీపిక మాట్లాడుతూ… ‘‘నాకు ఆస్తులు ఏమీ లేవు, ఐనా నాకంటూ ఏదో స్మశానంలో ఆరడుగుల నేల లేకుండా పోదు..’’ అంటోంది… ఆ అల్లరి వెనుక ఎంత లోతైన ఫిలాసఫీ, ఎంత జీవన వాస్తవికత, ఎంత వైరాగ్యం… సేమ్, సోనియా…
సిద్ధుతో సహజీవనం చేస్తోంది కొన్నేళ్లుగా… టీవీ షోలలో ఈమె మాటలు వింటూ తనే తలపట్టుకుంటాడు… (అఫ్‌కోర్స్, ఇబ్బందికరంగా ఉంటే ప్రసారం చేయరు కదా, అంతా స్క్రిప్టెడ్ కావచ్చు)… ఇదే వర్ష కిస్సిక్ షోలో మాట్లాడుతుంటే… నిజంగా ఈ అల్లరి పిల్లలో ఇంత లోతు తత్వసాధన, శోధన ఉందా అనిపించింది… ఆశ్చర్యం వేసింది కూడా…
ఆమె మాటల్లోనే… ‘‘నేను శివుడిని ఎందుకు బలంగా నమ్ముతాను అంటే… నేను తన ఉనికిని స్వయంగా ఫీలయ్యాను కాబట్టి… నేను శివదీక్ష తీసుకున్నాను, అమ్మయిలకు ఉండే భౌతిక సమస్యల దృష్ట్యా కేవలం 11 రోజుల దీక్ష… అప్పుడు సిద్దూ అయ్యప్ప దీక్షలో ఉన్నాడు… ఇరుముడి కట్టేటప్పుడు హైదరాబాదులో మా గురువు చెప్పాడు…
దీక్ష విరమణకు వెళ్లినప్పుడు నీకు ఓ త్రిశూలం కనిపిస్తుంది, దానిపై ఢమరుకం… తననే శివుడిగా గుర్తించు అన్నాడు… నేను ఏటా మూణ్నాలుగుసార్లు వారణాసి వెళ్తాను… ఈసారి దీక్ష విరమణకు వెళ్లినప్పుడు ఓ ఘాట్‌లో దీక్ష విరమించి, హాారతి చూస్తే సరిపోతుంది అనుకున్నాను… విపరీతమైన రద్దీ ఆరోజు…
ఆ రద్దీలో నాకు ఓ త్రిశూలం కనిపించింది… ఢమరుకం ఉంది… దాదాపు నేను భక్తితో ఫెయింటయిపోయాను… వెనక్కి తిరిగి చూద్దును కదా… చాలాదూరం వెళ్లిపోయింది ఓ ఆకారం… పెద్ద జటాజూటంలా పగోడా, వెనుక నంది రూపం… కలా? నోటమాట రాలేదు… నా నమ్మకమే నా దేవుడు…’’

… ఇలా సాగింది ఆమె మాట ధోరణి… ఆ కిస్సిక్ ఏదో సరదా చిట్‌చాట్ కాబట్టి, వర్షకు అంతకుమించి లోతుగా ఆధ్యాత్మికతలోకి వెళ్లే పరిణతి లేదు కాబట్టి, అక్కడ ఆగిపోయింది… (ప్రోమోకన్నా ఒరిజినల్ ప్రసారంలో ఇంకాస్త ఎక్కువ వివరాలున్నాయేమో…) కానీ ఆశ్చర్యం ఏమిటంటే..? సోనియా తను ఫీలైన దేవుడి ఉనికిని స్పష్టంగా చెప్పగలగడం… ఆ అల్లరల్లరి మాటల పిల్లకున్న స్పిరిట్యుయల్ ఫోకస్ !!
ఆమె చివరలో చెప్పిన మాటలు హైలైట్… ‘‘నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరుకోలేదు… కానీ భక్తి వైపు నేను వెళ్లేకొద్దీ నాలో పరిణతి, ప్రతిదాన్నీ సీరియస్‌గా తీసుకోకపోవడం, అంతర్గతంగానే చాలా మార్పులు వస్తున్నాయి… అంతకుమించి ఆ శివుడిని నేనేం కోరుకోవాలి..?’’
చివరగా… మూఢనమ్మకాలకు సంబంధించి… ‘‘పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు, ఆ మాటలు వింటూనే పెరిగాను నేను కూడా… కానీ నేనే స్వయంగా ఓ నల్లపిల్లిని పెంచుకుంటున్నాను… నేనేమీ నష్టపోలేదుగా… మన నమ్మకాల్ని ఈ జంతువుల మీద రుద్దడం దేనికి..? ఎస్, రెండేళ్లుగా మాంసాహారం కూడా మానేశాను..!!
…. ఇదంతా మనం ఎందుకు చెప్పుకోవడం దేనికంటే..? లక్షల మంది అమరానాథ్ వెళ్తారు, చార్ ధామ్ వెళ్తారు, అనేక వ్యయప్రయాసలకు ఓర్చి మరీ కైలాస మానస సరోవర్ యాత్ర వెళ్తారు, ఇప్పుడు కామాఖ్య అంటున్నారు… కానీ ఎందరు ఆ స్పిరిట్యుయల్ వైబ్స్ ఫీలవుతున్నారు..? ఈమె తాదాత్మ్యత ఆసక్తికరంగా అనిపించింది కాబట్టి అదృష్టవంతురాలు, అందుకే చెప్పుకోవడం!!
Share this Article