Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే

July 21, 2026 by M S R

.

తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, మలయాళం భాషల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ఒకేసారి స్టార్ట్ చేయబోతున్నట్టు (సెప్టెంబరు 10 న) సదరు షో నిర్వాహకులు రీసెంటుగా ప్రకటించారు… తెలుగులో ఆల్రెడీ అగ్నిపరీక్ష పేరిట పిచ్చి పిచ్చి పరీక్షలతో ఆశావహుల్ని వడబోసే ఆడిషన్స్ కార్యక్రమం కూడా సాగుతోంది… ప్రోమోలు వదులుతున్నారు…

పాత హోస్టులే… తెలుగులో నాగార్జున, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్‌లాల్, కన్నడంలో కిచ్చా సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్, బెంగాల్ సౌరవ్ గంగూలీ… పాత కాపులే… వీరిలో అందరూ హీరోలే గంగూలీ మినహా… కానీ భలే సెట్టయ్యాడు తను..!! (మరాఠీలో రితేష్ దేశ్‌ముఖ్)…

Ads

అత్యంత ఖరీదైన, క్లిష్టమైన టీవీ రియాలిటీ షో ఇది… ఎవరెన్ని విమర్శలు చేసినా జబర్దస్త్‌లాగే ఇదీ ఆగదు… ఏదో ఓ రెండురోజులు సీపీఐ నారాయణ దీన్ని ‘వ్యభిచారం’ అని ఆరోపణలు చేయడం, మీడియా రాయడం తప్ప ఏదీ ఆగదు… నిజానికి ఇందులో చట్టవిరుద్ధం ఏమీ లేదు, ఇతర దేశాల్లో ఇతర భాషల్లోనూ ఎన్నాళ్లుగానో నడుస్తున్న రియాలిటీ షోయే…

జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది… ఈ కామెడీ షో ద్వారా పాపులరైన ఫైమా ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘బిగ్ బాస్ బంధాలన్నీ బూటకమే… బయటకొచ్చాక ఎవరూ పలకరించరు… బిగ్‌బాస్ సీజన్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా కలుద్దామని కొన్నిరోజులు హడావుడి చేశారు… గ్రూప్ మొత్తం మెసేజ్‌లతో హల్‌చల్ చేశారు… కానీ రోజులు గడిచేకొద్ది మళ్లీ మామూలే… ఎవరూ పట్టించుకునేవారు కాదు… మూడు రోజుల మురిపెం అంటారు కదా అలానే జరిగింది…’

‘నా గృహ ప్రవేశానికి కూడా ఎవరినీ వదిలిపెట్టకుండా అందరినీ పిలిచాను… కానీ సూర్య ఒక్కడే వచ్చాడు… ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పారు… నేను కూడా సినిమా ఇండస్ట్రీ కాబట్టి వారి పరిస్థితిని అర్ధం చేసుకున్నా… అందరికీ షూటింగ్స్ ఉంటాయి… కానీ తర్వాత వస్తామని చెప్పినవాళ్లు ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు..’ అని ఫైమా ఎమోషనల్ అయ్యింది… (ఈమధ్యే పెళ్లి కూడా చేసుకుంది)…

రియాలిటీ షోలాగే ఈమె చెప్పింది కూడా ఫీల్డ్ రియాలిటీ… హౌజులో పెరిగే బంధాలు బయట కొనసాగాలని ఏమీలేదు… మిగతా రియాలిటీ షోలాగే ఇది కూడా… భిన్నం ఏమీ కాదు, ఎవరి జీవితాలు వాళ్లవి… కాకపోతే కొందరికి ప్రచారం, పాపులారిటీ ఎక్కువ వస్తుంది… గిరాకీ పెరుగుతుంది… టీవీ, సినిమా రంగాల్లో కొందరికి అవకాశాలు పెరగొచ్చు… కొందరు ఈ పాపులారిటీతో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి విపరీతంగా సంపాదించడం, కేసులు తెలుసు కదా… సో, హౌజులో పెరిగే బంధాలు జస్ట్, ఆర్టిఫిషియల్ అండ్ కమర్షియల్… అంతకుమించి ఎవరైనా ఎక్కువ ఊహిస్తేనే అది మూర్ఖత్వం…

మొన్న ఎక్కడో చదివినట్టు గుర్తు… హరితేజ అనే నటి ఛిఛీ మళ్లీ బిగ్‌బాస్ వెళ్లను అన్నదట… తన ఇమేజ్ దెబ్బతీసిందట… బిగ్‌బాస్‌కు వెళ్లకముందు ఏదో పెద్ద ఇమేజ్ ఉన్నట్టు బిల్డప్… నిజానికి రెండోసారి కూడా లేటరల్ ఎంట్రీ ఇచ్చారు ఆమెకు, అట్టర్ ఫ్లాప్… విసిగించింది… బిగ్‌బాస్ షో నిర్వాహకుల లెక్కలు వేరే ఉంటాయి… ముందస్తుగా కుదిరే రెమ్యునరేషన్లు, హౌజులో ఉండేకాలం, సోషల్ మీడియా వోట్లు గట్రా చాలా సమీకరణాలు ఉంటాయి… సో, ఆమెను మళ్లీ హౌజులోకి రమ్మని ఎవరు అడిగారు? ఛీ, నేను అసలే వెళ్లను అనే శుష్క వ్యాఖ్యలు దేనికి..?

ఈసారి కూడా అదుగో ఫలానా ఫలానా వాళ్లు వెళ్తున్నారు అంటూ బోలెడు వార్తలు కనిపిస్తున్నాయి, జస్ట్, ఊహాగానాలే… ఏదో టైంపాస్ పల్లీబఠాణీ వార్తలు, అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!
  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions