Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!

July 21, 2026 by M S R

.

శుష్క వాదనలు, డొల్ల లింకులు, వక్రీకరణలు, తప్పుడు బాష్యాలతో… జనం కళ్లకు గంతలు కట్టడంలో కేసీయార్‌ను మించినవాళ్లు దేశంలోనే లేరనిపిస్తుంది… ఈ క్యాంపు దృష్టిలో జనం పిచ్చోళ్లు, ఏది చెప్పినా నమ్మేస్తారు… అదే ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అబద్ధాల్ని వ్యాప్తి చేసి, బదనాం చేయడమే ఉద్దేశం… కేసీయార్ తన పత్రికలో రాసిన ఓ కథనం అచ్చంగా ఇదే… కటువుగా ఉన్నా రియాలిటీ ఇదే…

ముందుగా ఆ పత్రిక ఏం రాసిందో చెప్పుకుందాం… ‘‘తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడుల వాతావరణం కేసీయార్ హయాంలో నంబర్ వన్ స్థానంలో ఉంటే ఇప్పుడు 12వ స్థానంలో, అంటే శిథిలావస్థకు (?) పడిపోయింది… పరిశ్రమలు తరలిపోతున్నాయి… నీతి ఆయోగ్ సంస్థ సర్వే ఇండెక్స్ చెబుతున్నది ఇదే… కొత్త పెట్టుబడులు ఢమాల్’’… ఇదీ తను రాసుకొచ్చింది… ఇలా…

Ads


kcr


నిజాలు ఏమిటో, కేసీయార్ చెబుతున్న అబద్ధాలు, జనం కళ్లకు కట్టే గంతలేమిటో వివరంగా చెప్పుకుందాం… ఇదే పత్రిక కేసీయార్ హయాంలో నంబర్ వన్ స్థానంలో (ఒకటీరెండు సంవత్సరాలు, అదీ తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో) ఉందని చెప్పిందేమో ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of Doing Business) ఇండెక్స్‌లో… ఇప్పుడు 13 వ స్థానం అని చెబుతున్నది ఆ ఇండెక్స్ కాదు, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ (Investment Friendly Index)… ఇవి రెండూ వేర్వేరు సూచికలు…

కానీ ఆ రెండింటినీ కలగలిపి… గందరగోళ కథనాలు, ప్రచారాలతో జనాన్ని పిచ్చోళ్లను చేయడం ఇది…

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business)

  • నిర్వచనం…: ఒక దేశంలో లేదా ప్రాంతంలో వ్యాపారాన్ని ప్రారంభించడం, నిర్వహించడం ఎంత సులభమో ఈ సూచిక తెలియజేస్తుంది….

  • ప్రధాన దృష్టి…: ఇది ప్రధానంగా నియంత్రణల సరళత (Regulatory Simplification),  పరిపాలనాపరమైన ప్రక్రియలపై దృష్టి పెడుతుంది…

  • పరిశీలించే అంశాలు…:

    • కంపెనీ రిజిస్ట్రేషన్ (Starting a Business)

    • నిర్మాణ అనుమతులు పొందడం (Dealing with Construction Permits)

    • విద్యుత్ కనెక్షన్లు పొందడం

    • ఆస్తుల రిజిస్ట్రేషన్

    • రుణాలు పొందడం, పన్నుల చెల్లింపులు, కాంట్రాక్ట్ల అమలు.

  • ఉపయోగం: ప్రభుత్వ శాఖల్లో ఉండే రెడ్ టేపిజం (Red tape), అనవసరమైన అనుమతుల విధానాలను తగ్గించి, వ్యాపార ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది…

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ (Investment Friendly Index)

  • నిర్వచనం…: ఒక దేశం లేదా రాష్ట్రం దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను ఎంతవరకు ఆకర్షిస్తుందో,  పెట్టుబడులకు ఎంత అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందో ఈ సూచిక అంచనా వేస్తుంది.

  • ప్రధాన దృష్టి…: ఇది కేవలం అనుమతుల గురించే కాకుండా, మొత్తం పెట్టుబడి వాతావరణం, లాభదాయకత, వ్యాపార అనుకూలత, భద్రతలపై దృష్టి పెడుతుంది.

  • పరిశీలించే అంశాలు…:

    • మౌలిక వసతులు (రోడ్లు, పోర్టులు, విద్యుత్ సరఫరా)

    • నైపుణ్యం కలిగిన మానవ వనరులు (Skilled Workforce)

    • రాజకీయ, ఆర్థిక స్థిరత్వం

    • ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZs)

    • శాంతిభద్రతలు, చట్టబద్ధమైన రక్షణ.

  • ఉపయోగం…: పెట్టుబడిదారులు తమ పెట్టుబడులకు తగిన రాబడి (Return on Investment) వస్తుందా లేదా, అక్కడ దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవచ్చా లేదా అని నిర్ణయించుకోవడానికి ఇది సహాయపడుతుంది…

ప్రస్తుతం ఈ రెండు వేర్వేరు వ్యవస్థలు/ ఇండెక్సులు వేర్వేరు సందర్భాల్లో ఉపయోగంలో ఉన్నాయి. అయితే నీతి ఆయోగ్ కేవలం ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్’ (Investment Friendliness Index – IFI) పైనే పూర్తిగా దృష్టి పెడుతోంది…

దీని వెనుక ఉన్న అసలు పరిస్థితి ఏంటంటే…:

  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business)…: ఇది గతంలో ప్రపంచ బ్యాంకు (World Bank) దేశాల వారీగా ఇచ్చేది. అలాగే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న వ్యాపార సంస్కరణల (Business Reforms Action Plan – BRAP) ఆధారంగా DPIIT (డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) రాష్ట్రాలవారీగా ర్యాంకులు ప్రకటిస్తూ వస్తోంది. ఇది పూర్తిగా ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు, నిబంధనల సరళత (Regulatory compliance) పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది.

  • నీతి ఆయోగ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్ (IFI…): కేవలం ఒకే ఒక్క కోణం (నియంత్రణలు) కాకుండా, రాష్ట్రాలవారీగా పెట్టుబడులకు అనువైన సమగ్ర వాతావరణాన్ని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ప్రత్యేకంగా ఈ కొత్త ఇండెక్స్‌ను రూపొందించింది.

నీతి ఆయోగ్ ఈ ఇండెక్స్‌ను ఎందుకు తెచ్చింది?

కేవలం వ్యాపార అనుమతులు సులువుగా ఉండటం (Ease of Doing Business) మాత్రమే పెట్టుబడులను ఆకర్షించడానికి సరిపోదని ప్రభుత్వం భావించింది. అందుకే నీతి ఆయోగ్ మౌలిక వసతులు (Infrastructure), ఆర్థిక ఆరోగ్యం (Financial Health), పర్యావరణ స్థిరత్వం, మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు వంటి 8 కీలకమైన అంశాలు (Pillars) మరియు 84 సూచికల ఆధారంగా దీన్ని రూపొందించింది.

కాబట్టి, రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచడానికి, దేశంలో పెట్టుబడి వాతావరణాన్ని సమగ్రంగా మెరుగుపరచడానికి ప్రస్తుతం నీతి ఆయోగ్ ఈ ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్’ పైనే పూర్తి దృష్టి పెట్టింది.

వ్యాపారం చేయడానికి కేవలం ప్రభుత్వం అనుమతులు త్వరగా ఇవ్వడం (Ease of Doing Business) ఎంత ముఖ్యమో, ఆ పరిశ్రమకు కావలసిన ఎకోసిస్టమ్ (Ecosystem) అక్కడ ఉందా లేదా అని పెద్ద కంపెనీలు పరిశీలిస్తాయి…

సరళంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం… ఒక కార్ల కంపెనీ (ఉదాహరణకు ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్ ఆటోమొబైల్ తయారీ యూనిట్) రాష్ట్రానికి రావాలంటే రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది కంపెనీ…

  • అనుబంధ విడిభాగాల పరిశ్రమలు (Automobile Ancillaries & Supply Chain)…: కారు తయారీకి కావలసిన వేలాది రకాల విడిభాగాలు స్థానికంగా లేదా సమీపంలో దొరకాలి. వాటిని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలంటే రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతాయి.

  • రవాణా అనుసంధానత (Logistics & Connectivity)..: తయారైన కార్లను దేశవ్యాప్తంగా లేదా ఎగుమతి చేయడానికి పోర్టులు, నేషనల్ హైవేలు, రైల్వే నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందనేది చూస్తారు.

  • మార్కెట్ సాన్నిధ్యం (Market Proximity..): తయారీ కేంద్రానికి దగ్గరలో వినియోగదారుల మార్కెట్ అందుబాటులో ఉండటం చాలా అవసరం.

  • నైపుణ్యం ఉన్న మానవ వనరులు (Skilled Workforce)…: ఆటోమొబైల్ ఇంజనీర్లు, అత్యాధునిక టెక్నాలజీని హ్యాండ్ చేయగల సాంకేతిక నిపుణులు ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండాలి.

మరో ఉదాహరణ… ఏపీలో శ్రీసిటీ… చెన్నై, బెంగుళూరులకు రవాణా అనుసంధానత, వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు అనుకూలత, కృష్ణపట్నం, చెన్నై ఎయిర్‌పోర్టుల సామీప్యం… తమిళనాడులోని వివిధ విడిభాగాల తయారీ పరిశ్రమలు… నైపుణ్యమున్న మానవవనరులు… చెన్నై, బెంగుళూరు, తిరుపతి ఎయిర్‌పోర్టులు… అందుకే శ్రీసిటీ గ్రాండ్ సక్సెస్…

కేవలం ‘రెడ్ టేపిజం’ (నియంత్రణల బ్యూరోక్రసీ) తగ్గించడాన్ని మాత్రమే చూసేది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అయితే, పరిశ్రమకు కావలసిన ఈ సమగ్ర మౌలిక వసతులు, సరఫరా గొలుసు (Supply Chain), భవిష్యత్తు లాభదాయకతను బేరీజు వేసేదే నీతి ఆయోగ్ తెచ్చిన ‘ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్’…

ఇదీ అసలు తేడా… రెండింటినీ కలిపేసి, జనం మెదళ్లలోకి అబద్ధాల్ని ఇంజెక్ట్ చేయడం వెనుక ఉద్దేశం… కేసీయార్ పడిపోగానే తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడుల వాతావరణం కొలాప్స్ అయిపోయిందనే దుష్ప్రచారం… కేసీయార్ భాషలోనే చెప్పాలంటే ఓ దిక్కుమాలిన ప్రచారం!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • క్లియర్ ఎగ్జాంపుల్..! ఇలాంటి కేరక్టర్ల ఎంపిక లోపం యూపీఎస్సీదే..!
  • ఒక మెస్సీ తలవంచిన రాత్రి… ఒక యమాల్ తలెత్తిన ఉదయం!
  • ఆ బరాజులు పనికిరానట్టేనా? కాళేశ్వరం తాజా స్థితిపై సాంకేతిక విశ్లేషణ !!
  • ‘పెళ్లాల మార్పిడి’ – సొసైటీయే మారుతోంది – సర్కారు ఏం చేయగలదు..?
  • తిట్టు నేరం కాదా..? ఏది అశ్లీల నేరం..? ఏది కాదు..? వర్గీకరణ ఎలా..?
  • ఇదుగో… కేసీఆర్ క్యాంప్ నుంచి మరో దిక్కుమాలిన బురద ప్రచారం !!
  • అవున్నిజమే… బిగ్‌బాస్ మేకప్ తుడిచేస్తే… ఎవరి బతుకులు వాళ్లవే
  • ఏది మునిగే టైటానిక్? ఏది తస్కిన మేడిగడ్డ? ఎవరి గాచారం ఏంటి?
  • సినీ సంగీత ప్రేమికులా మీరు ? ఈమె గురించి తప్పక చదవాలి !!
  • మోడీ షా బ్లండర్ ! బొద్దింకలపై మొదటి నుంచీ పిరికి వైఫల్యమే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions