Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!

September 9, 2026 by M S R

.

( Gopu Vijaya Kumar Reddy  ) … AIపై సంచలన హెచ్చరిక.. ‘మానవాళితో జూదం ఆడుతున్నారు’

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అభివృద్ధిపై Anthropic మాజీ పరిశోధకుడు Jacob Coxon సంచలన వ్యాఖ్యలు చేశారు. Anthropicకు రాజీనామా చేసిన ఆయన.. గత మూడేళ్లుగా OpenAI, Anthropic సంస్థల్లో ప్రీట్రైనింగ్‌ పరిశోధనలో పనిచేసినట్లు తెలిపారు. రెండు సంస్థలూ AIని మరింత శక్తిమంతంగా మార్చే పోటీలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.

Ads

‘సూపర్‌ ఇంటెలిజెన్స్‌ దిశగా పరుగులు’
AI త్వరలోనే మనుషుల కంటే మెరుగైన సామర్థ్యాలు కలిగిన సూపర్‌ ఇంటెలిజెంట్‌ వ్యవస్థలుగా మారే అవకాశం ఉందని Coxon హెచ్చరించారు. ఇవి సైబర్‌ దాడులు చేయడం, వివిధ రంగాలను ఒక్కసారిగా మార్చడం, భారీ వనరులు, శక్తిని సమీకరించడం వంటి సామర్థ్యాలు సాధించవచ్చని పేర్కొన్నారు.

AI అభివృద్ధి చేస్తున్న పలువురు సీనియర్‌ పరిశోధకులు.. ఈ సాంకేతికత వల్ల మానవాళి అంతరించిపోయే స్థాయి ప్రమాదం కూడా ఉండొచ్చని వ్యక్తిగతంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

‘ప్రమాదం తెలిసినా ఎందుకు ఆపడం లేదు?’
వాణిజ్య ప్రయోజనాలతో పాటు.. ఇతర AI సంస్థలు ముందుగా అభివృద్ధి చేసి దుర్వినియోగం చేస్తాయనే భయం కారణంగా ఈ పోటీ కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా “మనం ఆపితే మరొకరు ముందుకెళ్తారు” అనే భావన ప్రమాదకరమని అన్నారు.

సాధారణ సాఫ్ట్‌వేర్‌లా AIని పూర్తిగా మనకు నచ్చిన విధంగా ప్రోగ్రామ్ చేయడం సాధ్యం కాదని Coxon పేర్కొన్నారు. AI వ్యవస్థలు కొన్నిసార్లు ఊహించని విధంగా ప్రవర్తిస్తున్నాయని, వాటిని సురక్షితంగా నియంత్రించే పూర్తి విధానం ఇంకా మన వద్ద లేదని చెప్పారు.

AI అభివృద్ధి వేగాన్ని కొంత తగ్గించి, భద్రతపై మరింత పరిశోధన చేయాలని పలువురు పరిశోధకులు కోరుతున్నారని తెలిపారు. తాను కూడా AI వల్ల మానవాళికి కలిగే అత్యంత తీవ్రమైన ప్రమాదాల అవకాశాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో AI Safety Researchలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

తన పోస్టు ప్రపంచవ్యాప్తంగా ఎంత వైరల్ అయిపోయిందీ అంటే… 13 గంటల్లో ఏడు కోట్ల రీచ్… నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఎఐ మీద ఆందోళన పెరిగిపోతోంది… అది కొలువుల కోత గురించి కాదు… అది మానవ మేధస్సును దాటేసి, సొంతంగా ప్రవర్తించే ప్రమాదం గురించి, మనిషి అదుపు తప్పే ప్రమాదం గురించి, ఏదో వినాశనం గురించి…

చివరికి జరిగేది.. మానవ జాతి అంతరించి పోవడమో లేదా రాతి యుగంలోకి వెళ్లడమో ఏదో ఒకటి కచ్చితంగా జరుగుతుంది. చూడబోతే కల్కి 2042 లాగే అనిపిస్తుంది...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions