Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!

September 14, 2026 by M S R

.

“ఆ సాయంత్రం… రాక్సీలో నార్మా షేరర్, బ్రాడ్వేలో కాంచనమాల! ఎటకేగుటో సమస్య తగిలిందొక విద్యార్థికి!” అన్నాడు మహాకవి ఓ సందిగ్ధంలో… అవును… అప్పుడప్పుడూ అలాగే మరి.,.. ఈ ఆదివారం రాత్రిలాగే…

ఓవైపు నిద్దరొస్తోంది… మరోవైపు అఫ్ఘనిస్థాన్‌తో ఇండియా క్రికెట్ మ్యాచ్… ఎలాగూ వైభవ్ లేడు కదా, ఏం చూస్తాంలే అని వదిలేశామే అనుకొండి… ఇంకోవైపు ఆసియా కప్ వుమెన్ క్రికెట్… నేషనల్ క్రష్ స్మృతి మంధాన… పైగా ఫైనల్ మ్యాచ్… డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకపై పోరాటం…, ఆల్రెడీ పాకిస్తాన్‌కు తొక్కిపారేశాం కదా… సో, కాస్త ఇంట్రస్టింగు…

Ads

ఈ రెండూ గాకుండా ఈటీవీలో ఫ్యామిలీ స్టార్స్… 9 కొట్టగానే బిగ్‌బాస్ వీకెండ్ షోతో నాగార్జున… శ్రీశ్రీ బతికి ఉంటే ఇదే రాసేవాడేమో… ‘ఏం చూసుటో సమస్య తగిలిందొక వీక్షకుడికి’ అని!

సరే, అఫ్ఘనిస్తాన్‌పై ఇండియా ఘనవిజయం… గుడ్… ఆసియా కప్ ముద్దాడిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఆర్మీ… వెరీ గుడ్… వినాయక చవితి కాన్సెప్టుతో ఫ్యామిలీ స్టార్స్ ఎప్పటిలాగే వోకే, వోకే… దానికి ముందుగా వచ్చిన జబర్దస్త్ రాను రాను మరింత నాసిరకంగా, చేదుగా మారుతున్నట్టు అనిపించింది…

సో, వైభవ్ లేడు కదాని అఫ్ఘన్ మ్యాచ్ స్కిప్… ఆసియా కప్‌లో మనోళ్ల బ్యాటింగ్ అయిపోగానే అదీ స్కిప్… ఏదో నాగార్జున బిగ్‌బాస్ వీకెండ్ షో ఏమైనా కాస్త వినోదంతో ఉద్దరిస్తాడేమో అనుకుంటే అది ఫ్లాప్ షో… ఎవరెవరు హౌజ్‌మేట్స్ అయ్యారో పరీక్షలు అట… అవీ ఏమాత్రం ఆసక్తిని రేపలేదు… చివరకు అందరూ పాస్… అంతేలే…

ఆల్రెడీ మిడ్ వీక్‌లో ఇద్దరిని బయటికి పంపించిన పాపం ఉంది కదా… ఇక మరో ఎలిమినేషన్ చేయడానికి ఏమీ లేదు… వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఇంకొందరిని అర్జెంటుగా ప్రవేశపెట్టాల్సిందే… కాకపోతే ఈసారి బిగ్‌బాస్ 10 వ సీజన్‌లో కాస్త ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ తప్ప ఇంకెవరూ ఇంప్రెసివ్ లేరు.., ఆడ కంటెస్టెంట్లే నయం…

అందరికన్నా దేబ్‌జానీ నయం… తెలుగు మాట్లాడుతోంది, సరదాగా ఉంటోంది, ఎవరివైపూ మొగ్గు లేదు… తన ఆట తనది… వీడు నన్ను విడిచిపెట్టి, అటూఇటూ పులిహోర కలుపుతున్నాడని ఆమె ఫన్ చేస్తే, పాపం నిజమే అనుకుని గింగరాలు తిరిగిపోయాడు ఓ కంటెస్టెంట్ (ముఖేష్ ?)

కాస్త ఝాన్సీ మీద పాజిటివ్ వైబ్ ఉండేది… కానీ అస్సలు యాక్టివ్‌గా లేదు, లేదా తనదైన స్ట్రాటజీ ప్లే చేస్తుందో తెలియదు, కానీ ఇప్పటికైతే నో ఇంపాక్ట్… సేమ్, వర్షిణి, సృష్టి… శాలిని ఓవరాక్షన్… మొత్తానికి మొదటి వారమే ఇంత పేలవంగా, నిరాసక్తంగా ప్రజెంట్ చేస్తే… మొత్తం వారాలు ఎలారా నాయనా..? ఎలాగూ స్క్రిప్టెడే కదా, చైత్రను ఇంకొన్నాళ్లు హౌజులో ఉంచితే బాగుండేది…

ఇంతకీ ఎవరు ఈ దేబ్‌జానీ అంటారా..? బెంగాలీ… ఆ భాషతోపాటు తమిళ, తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ ఉంటుంది… నిజానికి తెలుగు టీవీ సీరియల్స్ అంటే ఒకరిద్దరు మినహా మిగతా అందరూ కన్నడ స్టార్లే… బహుశా ఈమె  ఒక్కతే కావచ్చు బెంగాలీ…

దేబ్(దేవ్)జానీ మోదక్ అంటే..? మోదక్ ఇంటిపేరు, దాని అర్థం వినాయకుడిని ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదం అని… దేవ్‌జానీ అంటే దేవతలకు ఇష్టమైన అని అర్థం…!! బాగుంది..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?
  • AMR … ఈడీ భారీ దాడులపై తెలుగు మీడియా సైలెన్స్ దేనికి..?
  • కొన్ని పుస్తకాలు బయటికి రావు ! ఏ పార్టీ ప్రభుత్వమూ మినహాయింపు కాదు !!
  • AIలో ఫోటో అప్‌లోడ్ చేస్తే అకౌంట్‌లో డబ్బులు పోతాయా? నిజమేంటి?
  • ‘‘ఆ రీసెర్చ్ కోసం- బ్లడ్ క్యాన్సర్ సోకిన నీ కూతుర్ని ఇస్తావా?”
  • 40 స్క్రీన్లకు పడిపోయిన సినిమా… 2,500 స్క్రీన్లకు ఎలా వెళ్లింది?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions