.
నేను రైతు బిడ్డను అని చెప్పుకోవడం సిగ్గుచేటు వ్యవహారమా..? అది సింపతీ కోసం ఆడే నాటకమా..? రైతు అని స్ఫురించేలా దుస్తులు వేసుకుంటే అది తప్పా, నేరమా, అపచారమా..? ఎవడ్రా మీరు బిగ్‌బాస్ హౌజులోకి వచ్చిన వెధవలు..?
వెధవలు అనే మాట వాడటానికి జంకు, సందేహం ఏమీ అక్కర్లేదు… ఇప్పటిదాకా జరిగిన నామినేషన్ల తంతు చూస్తుంటే అసలు ఈ బిగ్‌బాస్ టీమ్‌కు బుద్దీజ్ఞానం, సిగ్గూశరం ఉన్నాయా అనిపిస్తుంది… ఝాన్సీ ఫస్ట్ లేడీ కెప్టెన్ ఈసారి సీజన్లో… తను ఆడి గెలిచింది, బుర్ర పెట్టింది, చాన్స్ వాడుకుంది… ఎవరూ దానధర్మంగా ఆమెను కెప్టెన్‌ను చేయలేదు…
Ads
ఆమె ప్రధాన కంటెండర్ కాబట్టి మిగతా హౌజ్‌మేట్స్ పీఆర్ టీమ్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నాయి… ఒక్కొక్కడికి డబ్బులిచ్చి మరీ గుంటనక్క అని ముద్రలు వేయిస్తున్నాయి… దీనికి వంతపాడుతున్నట్టు బిగ్‌బాస్ టీమ్ కూడా ఝాన్సీని టార్గెట్ చేసి, ఆమెతో బాగుంటున్న ముకేశ్‌ను ఉసిగొల్పి, ఆమె కెప్టెన్సీ ఇమ్యూనిటీ ఊడబీకించాడు…
నిజానికి కెప్టెన్‌కు నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ ఉండాలి కదా… ఇక చాన్స్ దొరికింది కదాని ఆమెను టార్గెట్ చేసి నామినేషన్ చేస్తున్నారు… చరణ్ అని ఆల్రెడీ బయటికి వెళ్లి మళ్లీ వచ్చిన ఓ తిక్క కేరక్టర్… ‘‘నువ్వు పదే పదే నామినేషన్ల సమయంలో రైతు అనిపించేలా డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నావు?’’ అని అడుగుతూ నామినేట్ చేశాడు… అదేదో నేరం అయినట్టు..!!
అబ్సర్డ్… ఫూలిష్… రైతు బిడ్డ అని స్ఫురించే డ్రెస్ వేసుకుంటే తప్పేమిటి..? ప్రైడ్, అది గర్వకారణం, ఆమె చెప్పుకుంటోంది, దాన్ని అభినందించాలి కదా… వాడెవడో త్రిగుణ్ అట, అలా డ్రెస్ వేసుకోవడం బిగ్‌బాస్ రూల్స్‌కు విరుద్ధం అని చెప్పాడట… అదేదో బిగ్‌బాసే చెబుతాడు కదా, మధ్యలో త్రిగుణ్ ఓవరాక్షన్ దేనికి..?
పైగా సింగర్ ఝాన్సీ అని చెప్పుకోవాలట కానీ రైతు బిడ్డ అని చెప్పుకోవద్దట… ఆ పిల్లకూ కాస్త బుద్ధి పనిచేస్తలేదు… ఎస్, నేను రైతు బిడ్డనే, అదే చెప్పుకుంటాను అని కాలర్ ఎగరేసి చెప్పుకోవాలి కదా… ఎవడో సింపతీ డ్రామా అనగానే వెనక్కి తగ్గాలా..? పల్లవి ప్రశాంత్ అనే వేస్ట్ కేరక్టర్‌తో పోల్చగానే భయపడిపోవాలా..?
బట్, వాగ్వివాదం తరువాత చివరకు ఆమె ‘నేను రైతు బిడ్డనే’ అంటూ నెత్తిమీద చెత్త పోయించుకుంది… అవునూ, ఈ చెత్త పోయించడం ఏమిట్రా బిగ్బాసోడా, ఈ సీజన్ నీ క్రియేటివ్ థాట్స్‌కు సింబాలికా..?
నిన్న కృష్ణుడి బదులు ఎలిమినేట్ కావల్సింది, తృటిలో తప్పించుకున్న ఇన్‌యాక్షన్ సృష్టి ఈసారి ఇక తప్పదని ఓవరాక్షన్ చేస్తోంది… ఏడుస్తోంది, అరుస్తోంది, తెరపై ప్రధానంగా కనిపించే ఓ పిచ్చి ఎత్తుగడ… మరోవైపు త్రిగుణ్ అలాగే ఉన్నాడు… చరణ్ ఎలాగూ హాఫ్ బ్రెయిన్… మొత్తానికి ఈసీజన్ను మొదట్లోనే భ్రష్టుపట్టిస్తున్నారు కదరా…
Share this Article