Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే..! కేసీయార్ భారీ జలద్రోహం కథ ఇదుగో!!

November 24, 2026 by M S R

.

ఉల్టా చోర్ కొత్వాల్‌ కే డాంటే… అంటే తెలుసు కదా… కేసీయార్, తన పార్టీ వైఖరి అచ్చంగా అదే… నాగార్జునసాగర్‌కు పొక్క కొట్టి కృష్ణజలాల్ని ఏపీకి తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ మీద తాజా నాటకమూ అదే… ఇది అర్థం కావాలంటే మూడు నాలుగు కోణాల్లో చెప్పుకోవాలి…

1. మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఆధార నినాదాలు… నీళ్లు, నిధులు, నియామకాలు… ఏ డిమాండ్లతో నేను తెలంగాణ తెచ్చాను అని భుజాలు చరుచుకుంటాడో, అందులో నీళ్లు అనే ప్రధాన అంశానికి గండి కొట్టిందే కేసీయార్… ఉమ్మడి ఆంధ్రా పాలనలో జరిగిన అన్యాయంకన్నా చాలా ఎక్కువ… అదీ వీర సమైక్యవాదులతో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనను పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్లతో అంటకాగి..!

ఏ కృష్ణజలాలు తెలంగాణకు ప్రాణావసరమో, వాటిని దోచిపెట్టి, తెలంగాణ జలప్రయోజనాల్ని దెబ్బతీసిందే కేసీయార్… ప్రధాన ఉదాహరణలు… జగన్‌తో కలిసి, డబ్బు కోసం ఓ పెద్ద ఏటీఎం కట్టాలని దుమ్ముగూడెం నుంచి పెన్నా బేసిన్ దాకా గోదావరి నీటిని తరలించాలని ప్లాన్ చేసింది కేసీయార్… జగన్ వెనక్కి తగ్గడంతో కాళేశ్వరం అక్రమాల కథ సొంతంగా స్టార్ట్ చేశాడు…

Ads

  • జగన్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మరింత నీటిని తోడుకోవటానికి రాయలసీమ లిఫ్ట్ కడితే దానికి కేసీయార్ సపోర్టు… చూసీచూడనట్టు నటించడం ద్వారా… రోజుకు 3 టీఎంసీల మేరకు వాడుకునే లిఫ్ట్ అది… ఏకంగా 80 వేల క్యూసెక్కులు రోజూ తరలించడానికి పోతిరెడ్డిపాడు పొక్కను వెడల్పు చేసుకునే కుట్రలకూ కేసీయారే మద్దతుదారు…

ఇదిగో ఆ జీవో… 2020 లో జారీ…



ap



  • 2. జాతీయ జలవిధానంలో ప్రధానమైంది… జలాల ప్రథమ ప్రాధాన్యం తాగునీటికి… దాన్ని బేస్ చేసుకుని, జగన్ మోహన్ రెడ్డి నాగార్జునసాగర్‌కూ పొక్క పెట్టే మరో కుట్ర జీవోను జారీ చేశాడు… అంతేకాదు, ఏకంగా 19 వేల కోట్ల పైచిలుకు నిధులకు జీవో ఇచ్చి, కేంద్రాన్నీ జతచేశాడు… జలజీవన్ మిషన్ కింద 50 శాతం నిధులు గ్రాంటుగా తీసుకోవడంతోపాటు… ఇక ఈ నీటి వినియోగంపై కేంద్రం నోరెత్తకుండా..!

 

ప్రస్తుతం బీఆర్ఎస్ గాయిగత్తర నాటకం చేస్తున్నది అదుగో ఆ పనుల మీదే… పల్నాడు వాటర్ గ్రిడ్ అదే… కృష్ణా వాటర్ బోర్డు దగ్గర ఓ డ్రామాకు తెరతీసి, జలాలపై మేమే పోరాడుతున్నాం అనే పూలను తెలంగాణ జనం చెవుల్లో పెట్టడానికి..! అందుకే మనం మొదట్లోనే చెప్పుకున్నది ‘ఉల్టా చోర్ కొత్వాల్‌కే డాంటే’ అని… ఇదుగో 2022లో రిలీజైన ఆ జీవో…



ap



ద్రోహం చేసిందే కేసీయార్… మళ్లీ అదే పార్టీ గగ్గోలు… ఇక్కడ ఓ క్లారిటీ… జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వాళ్లు వాళ్లు ఏపీలో రాజకీయంగా ఎంత తన్నుకున్నా సరే, తెలంగాణ ప్రయోజనాల్ని దెబ్బతీసే విషయంలో మాత్రం ఒకేలా వ్యవహరిస్తారు… కలిసికట్టుగా కదులుతారు… అందుకే జగన్ జీవో తీసుకొచ్చాడు, పనులకు శ్రీకారం చుట్టాడు, చంద్రబాబు ఆ పల్నాడు వాటర్ గ్రిడ్ పనుల్ని జోరుగా కొనసాగిస్తున్నాడు… అంతే…

అసలు ఇదే కాదు… కేవలం కమీషన్ల కాళేశ్వరానికే నిధులన్నీ మళ్లించి…, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, పాలమూరు- రంగారెడ్డి వంటి తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులను పఢావు పెట్టి… ఏపీ యథేచ్ఛగా కృష్ణాజలాల్ని వాడుకునే అవకాశం కల్పించిందీ కేసీయారే… (అసలు పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేలకు పెంచటానికి వైఎస్ అప్పట్లో నిర్ణయిస్తే, ఆ ప్రభుత్వంలో ఇదే కేసీయార్ పార్టీ భాగస్వామి… దాన్ని 44 వేల నుంచి ఏకంగా 80 వేల క్యూసెక్కులకు పెంచడానికి జగన్ జీవోలు ఇస్తే చేష్టలుడిగి, చూస్తూ కూర్చున్నది కేసీయార్ ప్రభుత్వం…)



apకేసీయార్ చేసిన పెద్ద ద్రోహం ఏమిటంటే..? 2015 లోనే… కేంద్రం వద్ద జరిగిన ఉన్నత స్థాయి భేటీలో… ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల కృష్ణా నీటి కేటాయింపులకు కేసీయార్, హరీష్ సంతకాలు చేయడం… అంటే కృష్ణాజలాల్లో అత్యధిక వాటాను ధారాదత్తం చేయడం ఇది… కృష్ణా క్యాచ్‌మెంట్ తెలంగాణలో ఎక్కువ ఉన్నప్పుడు ఆమేరకు అధిక వాటా రావడానికి పోరాడకుండా, మౌనాన్ని అంగీకారంగా తెలపడం ఇది… 2020లో కూడా అదే నిష్పత్తికి అంగీకరించాడు కేసీయార్…

  • ఈ కథనం కటువుగా అనిపిస్తున్నా నిజం నిష్ఠురంగానే ఉంటుంది… తెలంగాణ ఏర్పడ్డాక కేసీయార్ కుటుంబ అపరిమిత దోపిడీ తెలంగాణ ప్రజల ఖజానాను ఎంత దివాలా తీయించిందో… తన పాలనలోని నిర్వాకం, వైఫల్యంతో తెలంగాణకు ప్రాణాధారమైన జలాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది… ఇదీ వాస్తవ చిత్రం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే..! కేసీయార్ భారీ జలద్రోహం కథ ఇదుగో!!
  • ఆ ‘కాంతాదాసుడికి ట్రంప్- మస్క్ మద్దతు … మళ్లీ Nvidia సంచలనం !!
  • చిరంజీవి ప్రతి సినిమా కథనూ మొదట ఆయనకు చెబుతాడు..!!
  • ఓ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్రయోగమే.. మరో సమస్యగా మారితే..?
  • ఆమె హానీట్రాప్‌లో ఆ ’హాట్ చిప్’..! ఆదానీ, అంబానీలకు భలే చాన్స్ !!
  • బిస్లరీ నీరు నిజంగానే అంత డేంజరా..? ఇదీ అసలు కథ..!!
  • The Lakshmana – ప్రయోగం వికటిస్తే దర్శకుడి ముక్కూచెవులు జాగ్రత్త !!
  • ఒక వేర్పాటువాది- ఒక ఉగ్రవాది …! ఇండియా వ్యవహారాల్లో అమెరికా జోక్యం !?
  • అసలు ఆమె ఎవరు..? ఈ పోలీస్ అతి భద్రతలు, బందోబస్తులు దేనికి..?
  • ఓ మలయాళీ హీరోకు తెలుగులో ఇంత మంచి స్పేస్ ఎలాగంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions