.
Pardha Saradhi Potluri …. జంతర్ మంతర్ కధా కమామీషు!
“ ఆందోళనలు జరుగుతున్నాయి ఆగలేదు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆందోళనలు ఢిల్లీ లోనే కాదు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో జరుగుతూనే ఉంటాయి చీఫ్ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేసే దాకా”
….. CJP
నిన్న విమానంలోఉండగానే అభిజిత్, సౌరవ్ దాస్,అసుతోష్ రాంకా ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!
మరోవైపు గురుగ్రామ్ సెక్టర్ 65 లోని తన నివాసంలో ఉండగా ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకొని గుర్తుతెలియని ప్రదేశంలోకి తీసుకుళ్లారు ఢిల్లీ పోలీసులు!
భారతీయ న్యాయ సురక్ష సంహిత లోని సెక్షన్స్ 126 మరియు 170 ల కింద కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు!
Ads
ఈ రోజు…
ఢిల్లీ సౌత్ వెస్ట్ లోని ఢిల్లీ కంటోన్మెమెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు సీజెపి నాయకులని విడుదల చేయమని ఆదేశాలు ఇవ్వడంతో అభిజిత్, సౌరవ్, అసుతోష్ లతో పాటు నిన్న నిర్భంధంలోకి తీసుకున్న మరో 3,000 మందిని విడుదల చేశారు.
కండిషన్స్ అప్లై …: స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బెయిల్ ఇస్తూ ‘ ఒక సంవత్సరం పాటు శాంతి భద్రతలకి విఘాతం కలిగించకుండా ఉంటాము అనే హామీ తీసుకొని విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
హెబియస్ కార్పస్ (habeas corpus ) పిటిషన్…: సీజెపి కో ఆర్డినేటర్ గౌరవ్ భారతి సీజెపి నాయకులని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్ళారని కాబట్టి వాళ్ళని కోర్టులో హాజరుపరచమని కోరుతూ సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది.
ఈ రోజు ఆదివారం అయినా సరే సుప్రీం కోర్టు గౌరవ్ భారతి వేసిన పిటిషన్ ని విచారించింది.
సుప్రీం కోర్ట్ స్పెషల్ సిట్టింగ్ బెంచ్ జస్టిస్ జాయ్ మాల్య బాగ్చి, జస్టిస్ V మోహన విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు…
శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా ఆందోళన చేయడానికి వచ్చిన వాళ్ళని నిర్భoధించకుండా వదిలివేయమని, మెట్రో రైలు సర్వీసులని ఆపకుండా యధావిధిగా నడపమని, ఆపేసిన ఇంటర్నెట్ సర్వీసులని తిరిగి పునరిద్దరించమని ఆదేశాలు ఇచ్చింది!
ధృవ్ రాఠీ సంగతి ఏమిటి?
ధృవ్ రాఠీ విషయంలో కొంచెం కాదు బాగానే గందరగోళం నెలకొని ఉంది….
ధృవ్ రాఠీ 2018 లో జెర్మనీ వెళ్లి జెర్మన్ యువతిని పెళ్లిచేసుకొని అక్కడే స్థిరపడ్డాడు!
జెర్మనీ నుండే యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నాడు. అఫ్కోర్స్! ధృవ్ రాఠీ ఛానెల్ సబ్స్కరైబర్స్ లో ఎక్కువమంది పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వాళ్ళు కాగా కనీసం 2 లక్షల బాట్స్ ని సృష్టించి ఫాలో అయ్యేట్లుగా చేశారు. ఈ బాట్స్ అన్నీ పాకిస్థాన్, బాంగ్లాదేశ్ లనుండి ఆపరేట్ చేయబడుతున్నాయి.

ధృవ్ రాఠీ జెర్మన్ పౌరసత్వం తీసుకున్నాడని వదంతులు వ్యాప్తిలో ఉండగా బెంగుళూరు సీజెపి మీటింగ్ లో నేను జెర్మన్ పౌరుడిని కాదు భారతీయుడిని అంటూ తన పాస్పోర్ట్ ని చూపించాడు!
బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర రావు కేంద్ర హోమ్ శాఖ కి మెయిల్ చేశాడు ధృవ్ రాఠీ పౌరసత్వం, అతని వీసా ఇమ్మిగ్రేషన్ హోదాని ఒక సారి క్షుణ్ణంగా పరిశీలించమని!
కానీ…..
శనివారం ఉదయం గురుగ్రామ్ సెక్టర్ 65 లోని అతని నివాసం నుండి తీసుకెళ్లిన పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే ఆదివారం తెల్లవారుఝామున ధృవ్ రాఠీని వదిలివేశారు.
ఇక్కడ గందరగోళం ఏమిటంటే అన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా ధృవ్ రాఠీ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మీద భారత విదేశాంగ శాఖ పరిశీలిస్తున్నది అని!
పరిశీలించడం ఏమిటి? అంటే భారత విదేశాంగ శాఖ దగ్గర అతను భారత పౌరసత్వం వదులుకున్నదీ లేదా అన్న సమాచారమే లేదా?
చాలా సింపుల్ గా హేచ్చరించి వదిలేశారు అన్న వార్త మాత్రమే బయటికి వచ్చింది.
ఇటు కేంద్ర హోమ్ శాఖ కానీ అటు విదేశాంగ శాఖ కానీ ధృవ్ రాఠీ పౌరసత్వం మీద ఎలాంటి అధికారిక ప్రకటనచేయలేదు ఎందుకని?
కోర్టు కేసు సంగతి ఏమిటి?
ధృవ్ రాఠీ మీద ముంబై బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ కరాంశీ నౌఖియా ఢిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ధృవ్ రాఠీ సోషల్ మీడియాలో సురేష్ కరాంశీ నౌఖియా మీద ఆధారం లేని ఆరోపణలు, పరువుకి భంగం కలిగించే పోస్టులు పెట్టాడని సురేష్ తనకి 20 లక్షలు చెల్లించేలా ధృవ్ రాఠీ మీద చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో కోరాడు.
గత ఆగస్టు 6 న ఢిల్లీ కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని ఢిల్లీ కోర్ట్ సమన్లు జారీ చేసింది కానీ ఆ కేసు ఏమైందో తెలియదు.
*****************
కాంగ్రెస్ ని సైడ్ లైన్ చేసేందుకు సీజెపి కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉంది!
మీడియా ఫోకస్ అంతా సీజెపి మీద కాన్సంట్రెట్ అయ్యేలా చూడడంలో బీజేపీ సఫలం అయ్యింది. గతంలో కూడా కేజ్రీవాల్ కి ఎక్కువ కవరేజ్ ఇస్తూ రాహుల్ ని పక్కన పెట్టేసింది మీడియా!
కేజ్రీవాల్ రాజీనామాతో వార్తలలో లేకుండా పోయాడు. దాంతో రాహుల్ కి మీడియా కవరేజ్ మళ్ళీ పెరిగింది. సీజెపి పిక్చర్ లోకి రావడంతో మీడియా ఫోకస్ రాహుల్ నుండి సీజెపి మీదకి మళ్ళింది.
బహుశా అందుకేనేమో సీజెపి చాప్టర్ వెంటనే ముగించకుండా కొనసాగేలా చూస్తున్నారు.
ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో శాంతి భద్రతలకి భంగం కలిగించకుండా ఒక సంవత్సరం పాటు శాంతియుతంగా ఆందోళన నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం సీజెపిని నిత్యం వార్తలలో ఉంచేందుకేనేమో!
అఫ్కోర్స్! ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ ఈ హడావిడి ఉంటుంది! ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే అంతా సర్దుకుంటారు!
Share this Article